కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు.
విజయవాడ (ప్రజా అమరావతి);


*కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు*మనబడి నాడు-నేడు ద్వారా మారుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలు


ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్చర్యపోయేలా మౌలిక వసతులు కల్పన


1 మార్చి, 2024న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాను. 


గతేడాది ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కృషి అభినందనీయం


:- *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్*


ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం గౌరవంగా ఉందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రైవేట్ సంస్థలకు దీటుగా మౌలిక వసతుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ ఏడాది పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన బెంచ్ లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, త్రాగునీటి వసతి, టాయిలెట్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని చూసి ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఆశ్చర్యపోతారన్నారు. 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు గానూ గతేడాది ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు కాని 93,875 మంది విద్యార్థులు మళ్లీ ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేలా గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ప్రోత్సహించారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ప్రోత్సహించిన సంబంధిత సిబ్బందికి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


Comments