వైద్య విద్యలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టే యోచన.

 వైద్య విద్యలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టే యోచన


దీర్ఘకాలిక రోగులకు మందులు పంపిణీ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలి

ఉద్యోగుల ఆరోగ్య పధకంలో పరిష్కరించిన అంశాలను ఉద్యోగ సంఘాలకు తెలపండి

కౌమార బాలికల్లో రక్తహీనత నివారణకు డేటాబేస్ సిద్ధం చేయండి

ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పధకాన్ని తెచ్చేందుకు డేటాను సిద్ధం చేయండి

ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలి

                    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,21ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో వైద్య విద్యలో కృత్రిమ మేధ(Artificial Intilgence)సాంకేతికత ను ప్రవేశపెట్టేందుకు తగిన ప్రాధమిక కసరత్తును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.వైద్య ఆరోగ్యశాఖపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా ఎంప్లాయిస్ హెల్తు స్కీంపై తీసుకుంటున్నతదుపరి చర్యలు,ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిర్వహణ,ఆరోగ్యశ్రీపై అవగాహనా కార్యక్రమాలు,దీర్ఘ కాలిక రోగులకు మందులు పంపిణీ,వైద్య విద్యలో కృత్రిమ మేధ(AI) సాంకేతికతను ప్రవేశ పెట్టడం వంటి అంశాలపై సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య,వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూ.లు ఖర్చు చేసి పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు.ముఖ్యంగా వైద్య విద్యలో మరిన్ని మెరుగైన సత్వర ప్రయోజనాలు పొందేందుకు వీలుగా కృత్రిమ మేధను ప్రవేశపెడితే ఏవిధంగా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన అని కావున దీనిపై వైద్యశాఖ అధికారులు ప్రాధమిక స్థాయి కసరత్తును చేసి ఒక నివేదికను సిద్ధం చేయాలని అన్నారు.దీనివల్ల వైద్య విద్యను అభ్యసించే విద్యార్ధులకు ఈవిధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.రోబోట్ అసిస్టెట్ సర్జరీలు, డ్రగ్ డోసేజ్ అండ్ డెలివరి,ఎపిడమిక్ ప్రిడక్సన్ అండ్ ప్రివెన్సన్,రేర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్, ఏరియా ఆఫ్ స్పెసిఫిక్ డిసీజ్ ప్యాటర్న్,ఎజ్ స్పెసిఫిక్ ప్యాటర్న్ వంటి అంశాల్లో కృత్రిమ మేధ ఎంతో దోహదపుడుతుందన్నారు.ఇప్పటికే దేశంలోని ప్రముఖ వైద్య సంస్థల్లో ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్సు విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని సిఎస్.డా.జవహర్ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పధకం(EHS)ద్వారా మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు తీసుకున్నచర్యలపై జాయింట్ స్టాప్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలియ జేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సిఎస్.డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.వివిధ దీర్ఘకాలిక రోగులకు ప్రస్తుతం చేస్తున్నమందుల పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా సిహెచ్ఓ లేదా ఫ్యామిలీ డాక్టర్లు ద్వారా నెలవారీ,గ్రామం వారీగా ఆయా రోగులకు సకాలంలో చేరేలా ప్రత్యామ్నయ విధానాన్నితీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు.

కౌమార బాలికల్లో రక్తహీణతను నివారించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య,స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు ఇందుకు సంబంధించిన డేటా బేస్ ను సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ప్రజలకు వేగవంతంగా అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జగనన్నఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు అందిస్తున్నవివిధ వైద్య సేవలను సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పధకం అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఉద్యోగుల మెడికల్ రీఇంబర్సుమెంట్ పధకం గడువు వచ్చే మార్చి నెలాఖరుతో పూర్తవుతుందని ఈగడువును మరో ఏడాది కాలానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఇహెచ్ఎస్ లబ్దిదారులకు డిస్పెన్సరీ విధానం కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరగా దానిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.అదే విధంగా ఇహెచ్ఎస్ లో అన్ కవర్డ్ ప్రోసీజర్లకు సీలింగ్ లిమిట్ పెంచాలన్నదానిపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఇహెచ్ఎస్ కార్డులు జారీ,ఇహెచ్ఎస్ ఫ్యాకేజిల సవరణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ గురించి వివరిస్తూ మొత్తం కోటి 43 లక్షల 60వేల 620 కార్డులకు గాను కోటి 13 లక్షల 48వేల 378 కార్డులు డెలివర్ కాగా ఇప్పటికే 79 లక్షల 78వేల కార్డులు పంపిణీ జరగ్గా మరో 33 లక్షల 70వేల కార్డులు పంపిణీ కావాల్సి ఉందని అన్నారు.దీర్ఘకాలిక రోగులకు మందుల పంపిణీకి సంబంధించి 25వేల 742 ప్రిస్క్రిప్సన్లకు గాను 20వేల 620 కు మందులు డిస్పాచ్ జరిగిందని మరో 4వేల 172 పెండింగ్ ప్రోసెస్లో ఉన్నాయని వివరించారు.అనంతరం జగనన్నఆరోగ్య సురక్ష పధకం-1,2 ద్వారా ప్రజలకు అందించిన చికిత్సలు ఇతర సేవలను స్పెషల్ సిఎస్ కృష్ణబాబు వివరించారు.

ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్,ఎపిఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి,సెకండరీ హెల్తు డైరెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,డిఎంఇ డా.నర్సింహం,ఆరోగ్యశ్రీ సిఇఓ బాలాజీ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు.


Comments