పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ..


అమరావతి (ప్రజా అమరావతి);


*పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..*


*పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) పంపిణీ..*


*ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీ.. దీంతోపాటు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని నేడు (23.02.2024) ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..*


*రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు...*


పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత..

రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి..

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం.. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం.. ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు..

పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు.. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు.. అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..

ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్..


ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..

నేడు (23.02.2024) ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..

అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్,

ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..

మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల

భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్ అందజేత..

భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిప్ ల అభివృద్ధికి రూ.210 కోట్లు.. లే అవుట్ ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు కేటాయించిన జగనన్న ప్రభుత్వం..


*పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్..*


అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ..

ఒక్కోప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతున్న నేపథ్యంలో ఆ కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్ల పైమాటే..

దీంతోపాటు సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణం..

ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన జగనన్న ప్రభుత్వం..

రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన..

ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ధి.. మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి..

తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఆ ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుండి రూ.20 లక్షల వరకు లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ. 2 లక్షల కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్ల సంపద.. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు..

Comments