పార్లమెంటు ఎన్నికల్లో అదే జోరు కొనసాగిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ

 *పార్లమెంటు ఎన్నికల్లో అదే జోరు కొనసాగిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ?*











హైదరాబాద్:ఫిబ్రవరి 07. (ప్రజా అమరావతి);

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు పోటీగా భారీ సభకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన పీఈసీ.. లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ అంశాలపై నా చర్చించింది.


కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టంచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన హస్తం పార్టీ. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.


అయితే టికెట్‌ ఆశించే నేతల జాబితా భారీగా ఉండడంతో.. అభ్యర్ధుల వడపోతపై దృష్టిసారించింది అధిష్ఠానం. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమా వేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధుల జాబితాపై చర్చించింది.


నియోజక వర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్నే పార్లమెంటు ఎలక్షన్స్‌లోనూ ఫాలో అవుతోంది.


హస్తం పార్టీ. పీఈసీలో కీలక అంశాలపై మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పారు.


టికెట్‌ ఆశించే నేతల సంఖ్య వందల సంఖ్యలో ఉండడంతో అభ్యర్థుల ఎంపిక.. పార్టీకి కష్టంగా మారినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు

Comments