దోపిడీయే జగన్ ప్రత్యేక పాలసీ.

 అమరావతి (ప్రజా అమరావతి);


              *దోపిడీయే జగన్ ప్రత్యేక పాలసీ



• ఐదేళ్లుగా ఎలాంటి పాలసీ లేకుండా, ఇసుకదోపిడీయే లక్ష్యంగా జగన్ ప్రత్యేకపాలసీ  అమలుచేశాడు.

• కేవలం ఇసుకదోపిడీతోనే రూ.50వేల కోట్లు కొల్లగొట్టాడు

• రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న విచ్చలవిడి ఇసుకదోపిడీని సాక్ష్యాలతో సహా కేంద్ర పర్యావరణ మరియుఅటవీ శాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు విభాగాల  కమిటీ బయటపెట్టింది.

• సదరు కమిటీ ఎన్.జీ.టీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) ఎదుట ఉంచిన నివేదికలో జగన్ రెడ్డి సాగిస్తున్నఇసుకదోపిడీకి సంబంధించి విస్తుగొలిపే అంశాలున్నాయి.

• సదరు నివేదికపై ప్రభుత్వం స్పందిస్తుందని తాము అనుకోవడం లేదు. 

•  కోర్టులు, ఎన్.జీ.టీ గతంలో ఎన్నిసార్లు చెప్పినా జగన్  తన ఇసుకదోపిడీ ఆపలేదు. 

• ఇసుక దోపిడీ సహా జగన్ రెడ్డి దోపిడీలను ప్రజలముందు పెడతాం.. ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఏంచేయాలో ఎన్నికల నాటికి వారే నిర్ణయం తీసుకుంటారు


    


ప్రభుత్వం సాగిస్తున్న ఇసుకదోపిడీని ప్రతిపక్షాలు, ప్రసారమాధ్యమాలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 6 నెలల క్రితమే ఇసుకాసురుడు జగన్ రెడ్డి రూ.40 వేలకోట్ల ఇసుకదోచేశాడని  ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజలముందు ఉంచారని, ఆ మొత్తం ఇప్పుడు రూ.50 వేలకోట్లకు చేరిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 


“ఐదేళ్లలో ప్రత్యేక పాలసీ అనేది లేకుండా దోపిడీయే పాలసీగా జగన్ అతని ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుకదోపిడీకి పాల్పడుతోంది. ఇసుక దోపిడీపై మీడియా, ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకున్నా వైసీపీప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో జరిగే ఇసుక దోపిడీపై హైకోర్ట్ లో, సుప్రీంకోర్టులో, ఎన్.జీ.టీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యున ల్) లో పలుకేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో జరిగే ఇసుకదోపడీపై ఎన్.జీ.టీ లో విచారణ జరిగేటప్పుడు రాష్ట్రప్రభుత్వ న్యాయవాది పచ్చి అబద్ధాలు చెప్పాడు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడంలేదని బొంకాడు. మరోసారి హైకోర్టులో మూడురోజుల్లో మూడు విరుద్ద వాదనలు చేశాడు. రాష్ట్రం లో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్.జీ.టీ స్టే ఇస్తే,  జగన్ సర్కార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. జగన్ రెడ్డి తన దోపిడీని కొనసాగించడానికి, న్యాయస్థానాల్ని తప్పుదారి పట్టించడానికి కూడా ప్రజల సొమ్మునే వినియోగిస్తున్నాడు. 


*రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడి ఇసుకదోపిడీని, కేంద్ర పర్యావరణ మరియు అటవీశాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు నివేదిక బహిర్గతం చేసింది* *రీచ్ లలో జరిగే తవ్వకాలు, రవాణాను గూగుల్ టేకౌట్ చిత్రాలద్వారా బయటపెట్టింది* 


ఎన్.జీ.టీ ఆదేశాలతో జనవరి 17, 18, 19 తేదీల్లో కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ, మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన అధికారుల కమిటి రాష్ట్రంలో పర్యటించి  ఇసుకదోపిడీపై నిజానిజాలు నిగ్గుతేల్చింది. సదరు కమిటీ ఎన్.జీ.టీ ఎదుట ఉంచిన నివేదికలో రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల గురించి ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అందుకు సాక్ష్యాలుగా గూగుల్ టేకౌట్ ద్వారా రీచ్ లలో జరిగే తవ్వకాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రవేశపెడుతున్నామని కేంద్రపర్యావరణ మరియు అటవీశాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు సభ్యుల కమిటీ అభిప్రాయపడింది. సదరు కమిటీ నివేదికలో ఇంకా అనేక విస్తుగొలిపే అంశాలు న్నాయి. రాష్ట్రంలోని పలు రీచ్ లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని, ఒక్కో ప్రొక్లెయిన్ బకెట్ దాదాపు 2టన్నుల ఇసుక తోడేంత భారీస్థాయిలో ఉందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకఅక్రమ తవ్వకాలకు కలెక్ట ర్లు కూడా వంతపాడుతున్నారని కేంద్ర పర్యావరణ మరియు అటవీశాఖ, పొల్యూ షన్ బోర్డు కమిటీ తేల్చింది.  ఇసుక సరఫరా చేసే  లారీలకు రీచ్ లలో అన్నీ దొంగబిల్లులు ఇస్తున్నారని, ప్రభుత్వం నియమించిన సెబ్ విభాగం కూడా పట్టించుకోవడం లేదని కమిటీ అభిప్రాయపడింది.  కొన్ని రీచ్ లలో భారీవాహనా లు నేరుగా నదులమధ్యలోకి వెళ్లేలా రోడ్లు కూడా వేశారు. *(రోడ్లు.. ఇసుక తవ్వకాలకు సంబంధించి గూగుల్ టేకౌట్ ద్వారా తీసిన ఫోటోలను ఆనంద్ బాబు విలేకరులకు ప్రదర్శించారు)* 


*జేపీ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రూ.1528కోట్లు వచ్చాయనడం పచ్చి అబద్ధం. ప్రభుత్వమే జేపీ సంస్థకు వివిధకారణాలుచెప్పి  రూ.1200కోట్ల పైగా చెల్లించింది.* *జగన్ ఇసుకదోపిడీకి సహకరిస్తున్న కలెక్టర్లు.. వివిధశాఖల అధికారులు.. గుత్తేదారుసంస్థలు శిక్షార్హులే*


జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న అడ్డగోలు ఇసుకదోపిడీకి సహకరిస్తున్న కలెక్టర్లు అందరూ కచ్చితంగా జైలుకెళ్లడం ఖాయం. 25 మంది కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు తప్పుడు నివేదికలు  ఇచ్చా రని సదరు విచారణ కమిటీ తేల్చింది. తప్పుడు సమాచారమిచ్చిన కలెక్టర్లు అందరూ  శిక్షార్హులే. కేవలం ఇసుకదోపిడీలోనే ఇంతమంది కలెక్టర్లు తప్పుచేసిన ట్టు తేలితే, ఇతరత్రా జరిగే దోపిడీల్లో  ఇంకెందరి ప్రమేయం ఉందో చెప్పాల్సిన ఉంది. రాష్ట్రంలో జేపీవెంచర్స్ సంస్థ ఇసుకతవ్వకాలు సాగిస్తోందని, సదరు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినందున ఏపీ ప్రభుత్వానికి రూ.1528కోట్ల ఆదాయం వచ్చిందని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ చెప్పడం పచ్చి అబద్ధం. జేపీ సంస్థ ప్రభు త్వానికి రూపాయి కూడా కట్టలేదు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా చేశారని, ప్రభుత్వం గృహనిర్మాణ శాఖ నుంచి జేపీ సంస్థకు రూ.1100 కోట్లు చెల్లించింది. నాడు-నేడు పథకం కింద పాఠశాలల మరమ్మతులకు ఇసుక అందించారని రూ.80 కోట్లు, ఆర్ అండ్ ఆర్ కింద రూ.50 కోట్లు చెల్లించారు. 2023 నవంబర్ వరకు జగన్ సర్కార్ జేపీ పవర్ వెంచర్స్ పేరుతో అడ్డగోలుగా ఇసుకదోపిడీకి పాల్పడింది. ఇప్పుడు ప్రతిమ & జే.సీ.కే.సీ సంస్థల్ని రంగంలోకి దింపింది. ఈ సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ వాటి పేరుచెబుతూ వైసీపీనేతలే ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం చూసుకుంటుందిలే అన్నధీమాతో గుత్తేదారుసంస్థలు కూడా తప్పులు చేస్తున్నా యి. రేపు ప్రభుత్వం మారాక చేసిన తప్పులకు గుత్తేదారు సంస్థలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిం దే. రాష్ట్రంలో జరిగే ఇసుకదోపిడీకి ముమ్మాటికీ ముఖ్యమంత్రే బాధ్యుడైనప్పటికీ, అతనిదోపిడీకి సహకరిస్తున్న గుత్తేదారు సంస్థలు శిక్షింపబడటం ఖాయం.  ఏపీ.ఎం.డీ.సీ డీఎంజీగా అర్హతలేని వ్యక్తిని నియమించారు. అతను ప్రభుత్వ దోపిడీకి సహకరిస్తూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. మైనింగ్ శాఖ డీఎంజీతో పాటు ఇసుకదోపిడీకి సహకరిస్తున్నఇతర శాఖల అధికారులు, పోలీసులు కూడా శిక్షింపబడతారు. 


*విలేకరుల ప్రశ్నలపై ఆనంద్ బాబు స్పందన..!*

*జగన్ రెడ్డి ఇసుకదోపిడీ సహా, అన్నిదోపిడీలను ప్రజలముందు పెడతాం... ఎన్నికల నాటికి ఏం చేయాలో వారే నిర్ణయించుకుంటారు*


కోర్టులు చెప్పినా, పర్యావరణ సంస్థలు చెప్పినా జగన్ ప్రభుత్వానికి సిగ్గు,శరం లేదు. ఎప్పుడో 6, 7 నెలల క్రితమే టీడీపీ సహా, ఇతర పార్టీలు రాష్ట్రంలో జరుగు తున్న ఇసుకదోపిడీపై గళమెత్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా అడ్డగోలుగా సాగుతున్నఇసుక దోపిడీని ప్రజలముందు ఉంచారు. ఆయన తన దోపిడీని బయటపెట్టాడన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టించాడు. జగన్ రెడ్డి ఇసుకదోపిడీ సహా, ఇతర దోపీడీలన్నింటినీ ప్రజల ముందు పెడతాం. ఎన్నికలనాటికి ఏం చేయాలో వారే నిర్ణయం తీసుకుంటారు? ఏపీఎండీసీ డీఎంజీగా,  మైనింగ్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా వెంకటరెడ్డిని నియమించింది ఇసుకదోపిడీ కోసమే. ఆ రెండు పోస్టుల్లో కొనసాగడానికి అతను అనర్హుడు.” అని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

Comments