కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో రైల్వే స్టేషన్ల ఆధునికరణ...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో రైల్వే స్టేషన్ల ఆధునికరణ.. నగరంలో పేర్కొన్న (ఎంపీ) శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి . 

గుంటూరు (ప్రజా అమరావతి);

గతంలో ఎన్నడూ లేనివిధంగా రైల్వేస్టేషన్ల ఆధునికరణకు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  కృషి చేస్తున్నారని  రాజ్య సభ సభ్యులు, కృష్ణా - ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్  ఆళ్ల అయోధ్య రామిరెడ్డి  పేర్కొన్నారు.. నేడు అనగా 26-02-2024 సోమవారం  దేశ ప్రధాని  నరేంద్ర మోడీ  ఢిల్లీ నుండి వర్చువల్ గా అమృత్ భారత్ పథకం లో భాగంగా 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి అదే విధంగా 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ల/ అండర్ పాస్ ల శంకుస్థాపన/ప్రారంభం/జాతికి అంకితం చేయు కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు రైల్వే స్టేషన్ నుండి   ఆళ్ల అయోధ్య రామిరెడ్డి  పాల్గొన్నారు.. అదే విధంగా ఈ కార్యక్రమంలో  బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్,  శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రగిరి ఏసురత్నం , గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ శ్రీ రామకృష్ణ , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చందు సాంబశివరావు , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ , పలువురు నాయకులు, పాల్గొన్నారు..

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి  మాట్లాడుతూ, అమృత్ భారత్ పథకం కింద గుంటూరు డివిజన్ పరిధిలో మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మాచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నరసరావుపేట, వినుకొండ, మార్కాపూర్ రోడ్డు, కంబం, గిద్దలూరు, నంద్యాల 13 స్టేషన్లు ఎంపిక కావడం జరిగిందన్నారు..

ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments