ఎంఎస్ఎంఇ రంగంలో యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పనకు చర్యలు

 ఎంఎస్ఎంఇ రంగంలో యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పనకు చర్యలు


పియం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్లలో ఎపి ద్వితీయ స్థానం

మొదటిదశలో ఎంపికైన 5 జిల్లాల్లో ఇప్పటికే 18వేల మందికి శిక్షణ పూర్తి

రాష్ట్రంలో 100 ఇన్ప్రాస్ట్పక్చర్ డెవల్మెంట్ క్లస్టర్లు(ఐడి)ఏర్పాటు చేయాలని లక్ష్యం

             ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,26 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ రంగం అభివృద్ధి ద్వారా చేయడం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటు న్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఎంఎస్ఎంఇ రంరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి చర్యలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈరంగంలో అనేక వినూత్న ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.ఇప్పటికే వివిధ రంగాలకు సంబంధించి పలు ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం జరుగుతోందని తెలిపారు.ఎంఎస్ఎంఇ-క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 100 ఇన్ప్రాస్ట్పక్చర్ క్లస్టర్లు(ఐడి)ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటికే 57 క్లస్టర్లను గుర్తించగా ఇప్పటికే 8 క్లస్టర్లు పూర్తయ్యాయని సిఎస్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకం రిజిస్ట్రేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో కర్నాటక తర్వాత ద్వితీయ స్థానంలో నిలించిందని సిఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో ఎంపికైన అనంతరపురం,నెల్లూరు,తిరుపతి,పశ్చిమ గోదావరి,వైయస్సార్ కడప జిల్లాల్లో ఇప్పటికే 18వేల మంది వరకూ వివిధ చేతివృత్తుల్లో శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా మరో 3వేల మంది శిక్షణలో ఉన్నారని చెప్పారు.ఎంఎస్ఎంఇ ద్వారా పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ రంగంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు వాటి ప్రగతిని  గురించి వివరించారు.కామన్ ఫెసిలిటీ సెంటర్లకు సంబంధించి మొత్తం 55 క్లస్టర్లను గుర్తించగా ప్రస్తుతం ఏఏ దశల్లో ఉంది వివరించారు.అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్మెంట్ క్లస్టర్లు వాటి స్టేజ్ ల గురించి సిఎస్ కు వివరించారు.అదే విధంగా ఎంఎస్ఎంఇకి సంబంధించి ఉదయం పోర్టల్లో ఇంత వరకూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను తెలిపారు.వివిధ చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చి మరింత ఉపాధిని కల్పించేందుకు నిర్దేశించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించి ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లు,చేపట్టిన శిక్షణా కార్యక్రమాలు ఇతర అంశాలపై కార్యదర్శి యువరాజ్ సిఎస్ కు వివరించారు.

ఇంకా ఈసమావేశంలో ఎంఎస్ఎంఇ సిఇఓ సేదు మాధవన్, పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి పాల్గొనగా ఎపిఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్ వర్చువల్ గా పాల్గొన్నారు.

Comments