ఇ.వి.ఎం. మేనేజ్మంట్ సిస్టంపై నోడల్ అధికారులకు శిక్షణ.

 *ఇ.వి.ఎం. మేనేజ్మంట్ సిస్టంపై నోడల్ అధికారులకు శిక్షణ


*

*•హైద్రాబాదుకు చెందిన ఇ.సి.ఐ.ఎల్. అధికారుల బృందంచే శిక్షణా కార్యక్రమం నిర్వహణ*

*•రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇ.వి.ఎం. నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు హాజరు*

*•బీహార్, గోవా రాష్ట్రాలతో పాటు లడక్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీఘర్ కేంద్రపాలిత  ప్రాంతాల అధికారులు ఆన్ లైన్ ద్వారా హాజరు*

         * * *                                                                                                                                                                                 

అమరావతి, ఫిబ్రవరి 9 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల  నేపథ్యంలో  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణపై (EVM Management System-EMS 2.0)  రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఇవీఎం ల  నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు రాష్ట్ర  సచివాలయంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. బీహార్, గోవా రాష్ట్రాలతో పాటు లడక్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీఘర్ కేంద్రపాలిత  ప్రాంతాలకు చెందిన నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. 


రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆద్వర్యంలో నిర్వహించబడిన ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు సి.ఇ.ఓ. ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, హైద్రాబాదుకు చెందిన ఇ.సి.ఐ.ఎల్. అధికారుల బృందం పాల్గొని  ఇ.వి.ఎం.ల నిర్వహణపై నోడల్ అధికారులకు,  సాంకేతిక సహాయకులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ఇ.వి.ఎం.ల నిర్వహణలో ఎటు వంటి సాధారణ, సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా వాటిని తక్షణమే ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలను ఈ శిక్షణా కార్యక్రమంలో వివరించారు. ఎన్నికలకు ముందు, తదుపరి ఇ.వి.ఎం.లను  ఏ విదంగా భద్రపర్చాలి, ఎన్నికల సమయంలో వాటిని ఏ విధంగా తరలించాలి, ఇ.వి.ఎం.ల  మొదటి స్థాయి తనిఖీ, కమిషనింగ్ తోపాటు మొదటి, రెండవ రాండమైజేషన్ ఏ విధంగా చేయాలి, పనిచేయని ఇ.వి.ఎం.లను ఏ విధంగా మరమ్మత్తు చేయాలి, ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు రోజు వాటిని ఏ విధంగా వినియోగించాలి అనే పలు అంశాలపై శిక్షణ నివ్వడం జరిగింది. 


హైద్రాబాదు ఇ.సి.ఐ.ఎల్. కు చెందిన సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, టెక్నికల్ మేనేజర్ ఎం.శంకర్, ఇంజనీరు సి.జి.ఆధిత్య తదితరులతో పాటు రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి కార్యాలయపు పలువురు అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. Comments