రాట్నంతో నూలు వడికి మగ్గంతో నేత నేసిన మంత్రి.



కడియం మండలం (దుళ్ల)  (ప్రజా అమరావతి);


** రాట్నంతో నూలు వడికి మగ్గంతో  నేత నేసిన  మంత్రి




** చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక భరోసా నిస్తోంది



** లబ్ధిదారులతో, విద్యార్థులతో మంత్రి ముఖాముఖి



** వైయస్సార్ నేతన్న నేస్తం  పథకం కింద  అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించాం.


-  మంత్రి వేణుగోపాలకృష్ణ


చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక భరోసానందిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. 


 శుక్రవారం కడియం మండలం దుళ్ల గ్రామం లో  పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో   మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులతో కలిసి పాల్గొన్నారు. 


వేణుగోపాల కృష్ణ గ్రామంలోని  ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను  తెలుసుకొని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి  మరికొన్ని సమస్యలను  శాశ్వత పరిష్కారం  దిశగా  అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో మంత్రి  వేణుగోపాలకృష్ణ  చేనేత కార్మికుడైన  కాలేపు దుర్గా వీరభద్ర ప్రసాద్  చేనేత ఇల్లు సందర్శన సమయంలో మంత్రి వేణు గోపాలకృష్ణ స్వయంగా రాట్నంతో నూలు వడికి, మగ్గం చేత బూని వస్త్రాలు నేశారు.


 ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాల్ మాట్లాడుతూ  చేనేత కార్మికుల కుటుంబాల స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ  చేయూతని స్తుందన్నారు. వైయస్సార్ నేతన్న నేస్తం  పథకం కింద  అర్హులైన ప్రతి కుటుంబాన్ని ఆర్థిక బరోసా  కల్పించి ప్రభుత్వం ఆదుకుంటోందనీ అన్నారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అనేక కోట్ల రూపాయలు హెచ్చించి వారి ఆర్థిక అభివృద్ధికి  కృషి చేశారని పేర్కొన్నారు. నేతన్న నేతల పెన్షన్ కూడా  వారికి నెలలో మొదటి రోజునే అందిస్తూ వారి ఆర్థిక తోడ్పాటుకు చేయూత నిస్తున్నా మని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ చేనేతను బ్రతికేందుకు ప్రభుత్వం భరోసా కల్పించిందనీ అన్నారు.


 ఈ సందర్భంగా  మంత్రి లబ్దిదారుల తో ముఖాముఖి లో భాగంగా దుర్గాప్రసాదుని   మీకు ప్రభుత్వం నుండి ఏ యే పథకాల ప్రయోజనం పొందారని అడిగారు.


 అందుకు ఆయన బదులిస్తూ  ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి  నా కుటుంబానికి అమ్మ ఒడి, రుణమాఫీ, చేయూత,  పెన్షన్ వంటి పథకాలు ద్వారా ఇప్పటివరకు రు.3 లక్షల 60 వేల  ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం జరిగిందని మంత్రికి వివరించారు.



 మడికి, చిలకలపాడు,  ఏడిద సాగు నీటి కాలువ ఆక్రమణలకు గురై  ఆయకట్టులో ఉన్న 1500 ఎకరాలకు నీరు అందటం లేదని స్థానిక రైతు సామకూరి వీరపక్షియ్య సూచనలు మేరకు మంత్రి ఇరిగేషన్ అధికారులను  కాలువ పూడిక తీత పనులు చేపట్టి ఆక్రమణలను తొలగించే ప్రక్రియలు చేపట్టాలని ఆదేశించారు.


పాముకాటుకు గురైన  గంధం గోవిందం  కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవడం జరుగుతోందని మంత్రి హామీ ఇచ్చారు.


 ఆరోగ్య పెన్షన్ పొందుతున్న  ఆచంట శ్రీను  కి ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి పెన్షన్  5 వేల రూపాయలు వచ్చే విధంగా  చర్యలు తీసుకోవాలని సచివాలయం సంక్షేమ  అసిస్టెంట్ కి ఆదేశాలు మంత్రి జారీ చేశారు.


 ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి  మురుగు కాలువల  పూడిక తీత పనుల్లో  స్వయంగా పాల్గొన్నారు.


 అనంతరం పాఠశాల విద్యార్థు లతో  మాట్లాడిన మంత్రి జగనన్న విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య  అభ్యసించి సమాజంలో తమ కీర్తి ప్రతిష్టలను  ఇనుముడింప చేసుకునే విధంగా  విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.


దుళ్ళ గ్రామంలో చేనేత కార్మికునీ ఇంటికి వెళ్ళి నూలు వడికి, స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ స్వదేశీ వస్త్రా లను ఒడికి ఉద్యమ స్పూర్తి ప్రదాత గా నిలిచారని పేర్కొన్నారు.  ఈరొజు నూలు ఓడకడం ఒక మధురానుభూతి కలిగిందని పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీడీవో కే రత్నకుమారి, ఏఈ సిహెచ్ త్రిమూర్తులు,  జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, వైఎస్ఆర్సిపి  మండల అధ్యక్షులు  గిరిజాల బాబు, జుల్ల సర్పంచ్  కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టంగ నాగరాజు, స్థానిక నాయకులు టీ బాబ్జి, తడాల చక్రవర్తి, అయినమిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు 



Comments