జనసేనలో చేరిన మాజీ వైమానికదళ అధికారి శ్రీ వేణుగోపాల రెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి);
తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన మాజీ వైమానికదళ అధికారి శ్రీ భీమవరపు వేణుగోపాల రెడ్డి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి శ్రీ వేణుగోపాల రెడ్డిని ఆహ్వానించారు. ఈయన గతంలో రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ శాఖలో బయో మెడికల్ ఇంజినీర్ గా 25 సం. విధులు నిర్వర్తించారు. తెనాలి నియోజక వర్గం నుంచి పలువురు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
addComments
Post a Comment