గుంటూరుTDPఅభ్యర్థి చంద్రశేఖర్ తెనాలి రాక.

 గుంటూరుTDPఅభ్యర్థి చంద్రశేఖర్ తెనాలి రాక తెనాలి (ప్రజా అమరావతి);


తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన NRI చంద్రశేఖర్‌ తండ్రి వ్యాపార రిత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్‌ 1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. తరువాత మెడికల్‌లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచితవైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలువడం, పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలను తెలుసుకున్న ఆయన 120 బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు.


తెనాలి మండలం బుర్రిపాలెంలోనూ ఉచిత ఆర్‌వో ప్లాంటు నెలకొల్పడం ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ప్రజల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 , 2019 నుండే టిడిపి నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ట్రై చేసారు. కానీ మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో చంద్రశేఖర్ సైలెంట్ అయ్యారు..ఇక ఇప్పడూ జయదేవ్ పక్కకు తప్పుకోవడం తో గుంటూరు నుండి బరిలోకి సిద్ధం అయ్యారు.


రేపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో చంద్రశేఖర్ NVRC లో TDP తెనాలి శ్రేణులతో ములాఖత్ కానున్నారు.

Comments