క్రైస్తవులకు మొండి చేయి చూపిన YS జగన్ మోహన్ రెడ్డి.

 క్రైస్తవులకు మొండి చేయి చూపిన YS జగన్ మోహన్ రెడ్డి    అమరావతి (ప్రజా అమరావతి );    

ప్రొఫెసర్ డాక్టర్ జోసఫ్ మోసిగంటి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ (JBAC) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 25 శాతం ఉన్న క్రైస్తవులు బాధలు విని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మాకు సట్ట సభలో MLC గానీ, ఈ మధ్యనే కాళీ ఐన రాజ్యసభలో MP లలో కూడా  ఒక్క పొజిషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు YS జగన్ , జగన్ మావాడు అనుకుని 98%  ఓట్లు గుద్దేశారు, విశ్వసనీయత విశ్వసనీయత అని చెప్పే ముఖ్యమంత్రి గారు 98% ఓట్లేసిన క్రైస్తవులు పట్ల ఏం విశ్వసనీయత చూపించారు, కృతజ్ఞత కాదు కదా మొండి చేయి చూపారు. సుమారు 12000 ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడ్ నిలిపివేశారు, PG కోర్స్ లకి ఫీజు రీయింబర్సుమెంట్ లేదు.


పోనీ మైనారిటీకి నామినేటెడ్ పోస్టులు మండల్ లెవెల్ కో ఆప్టెడ్ ఎంపీటీసీ (MPTC) నుంచి రాష్ట్రస్థాయి వరకు సుమారు 800 ల పొజిషన్స్ ఉన్నాయి,  వీటిని క్రైస్తవ సమాజానికి సేవ చేసే వారికి ఇవ్వలేదు గని ,వాళ్ళ పార్టీకి సేవ చేసే వారికి ఇస్తున్నారు క్రైస్తవేతరులకు కూడా అమ్ముకుంటున్నారు. 


 ఈ మధ్యన సర్వే నిర్వహిస్తే ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్లు  70% నుంచి 80% క్రైస్తవ సమాజానికి వాళ్ళు ఎవరో కూడా తెలియదట, ఇది ఎంత అన్యాయం. వీళ్లకు పొజిషన్స్ ఇచ్చేది సమాజానికి సేవ చేయడానికి కాదు, పక్క పార్టీ వాడిని తిట్టడానికో, క్రైస్తవులచేత ఓట్లేపించడానికే నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తున్నారు, ఎలక్షన్ అప్పుడు తప్ప మిగతా టైం లో ఏ ఒక్కరు కనబడరు అందుబాటులో ఉండరు, 


ఆంధ్రప్రదేశ్ రాష్టంలో  సుమారు 80 వేల మంది పాస్టర్లు ఉంటే దాంట్లో  సంవత్సరం నర నుంచి మొదటి విడత గా 5196 వేల మందికి, రెండో విడత గా సంవత్సరం 3321 వేల మందికి 5,000 చొప్పున  సహాయం చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు, వీటికంటే ముఖ్యం చర్చిల మీద, క్రైస్తవుల మీద  దాడులు ఈ ప్రభుత్వం లో  పెరిగిపోయాయి అని ,ఆపాలి అని డిమాండ్ చేసారు. 


క్రైస్తవ ముద్ర పడకూడదని క్రైస్తవ క్రైస్తవ సమాజాన్ని దూరం పెట్టిన YS జగన్ గారు, ఇప్పుడు YS విమలా రెడ్డి ని పంపిస్తూ క్రైస్తవులని మరోసారి మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంతకు ముందు బైబిల్ ఇచ్చి అమ్మను, చెల్లి ని పంపిన జగన్,  ఇప్పుడు విమలా రెడ్డి ని పంపిస్తున్నారని ఆరోపించారు .గత నాలుగున్నర సంవత్సరాలలో ఏనాడు జగన్ గానీ, విమలా రెడ్డి  గానీ క్రైస్తవ సమస్యల పట్ల స్పందించలేదు.


క్రైస్తవ నాయకులు సీఎం జగన్ గారి దగ్గరికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి, YS విమల రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అమ్మ క్రైస్తవులకి సమస్యలు ఉన్నాయి, దయచేసి మీరు జగన్ గారికి చెప్పండి అంటే, నేను రాజకీయాలలో ఇంటర్ఫియర్ అవ్వను అని సమాధానం ఇచ్చారు, రాజకీయాలకు క్రైస్తవులను నేను ప్రోత్సహించను, ఎందుకంటే రాజకీయాలలో పరిశుద్ధంగా ఉండలేం అని సమాధానం ఇచ్చిన విమలా రెడ్డి గారు, ఏ మొహం పెట్టుకొని జగన్ రెడ్డి గారికి ఓటు వేయమని అడుగుతున్నారు, జగన్ భారతి ప్రార్థన చేసుకుంటున్నారని, మంచి భక్తి పరులని వారి ప్రభుత్వం ఉంటే మంచిదని నమ్మబలుకుతూ, క్రైస్తవులకు మరోసారి నమ్మకద్రోహం చేయాలని వైయస్ జగన్ రెడ్డి గారు వైయస్ విమలా రెడ్డి గారు పన్నాగం పన్నుతున్నారు అని ఆరోపించారు. అన్ని వర్గాల కంటే ఎక్కువగా క్రైస్తవ సమాజానికి గొప్ప అన్యాయం చేశారని. వైయస్ విమలా రెడ్డిని , ఓట్లు అడగటాని వచ్చే నాయకులను, ఎలక్షన్ అప్పుడే వస్తారా, మా సమస్యలు ఉన్నప్పుడు రారా అని నిలదీయాలని క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు...ప్రొఫెసర్ డాక్టర్ జోసఫ్ పి  మోసిగంటి. 

                       B.Tech, M.Tech, Ph.D

చైర్మన్, జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ (JBAC)

Phone : 9849482182

డైరెక్టర్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ చేబ్రోలు, గుంటూరు

ఆంధ్ర రాష్ట్ర ఎమినేట్ ఏమినెంట్ క్రిస్టియన్ అవార్డు గ్రహీత

Comments