మారుమూల గ్రామాల్లో 4జిసేవల కల్పనపై కేబినెట్ కార్యదర్శి వీడియో సమావేశం .

 మారుమూల గ్రామాల్లో 4జిసేవల కల్పనపై కేబినెట్ కార్యదర్శి వీడియో సమావేశం 


అమరావతి,14 మార్చి (ప్రజా అమరావతి):దేశ వ్యాప్తంగా వివిధ మారుమూల గ్రామాలు,సరిహద్దు గ్రామాల్లో యూనివర్సల్ సర్వీసు ఆబ్లిగేషన్ ఫండ్(USOF) ద్వారా 4జి సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతోందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్ననెట్ వర్కు టవర్లు,ఇతర పనుల ప్రగతిపై ప్రగతిపై గురువారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ మారుమూల,సరిహద్దు,ఇన్ యాక్సిసబుల్  గ్రామాల్లో యూనివర్సల్ సర్వీసు ఆబ్లిగేషన్ ఫండ్ కింద 4జి సేవల సౌకర్యాన్నికల్పించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 27 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం జరిగుతోందని తెలిపారు.ఈ అంశాన్నిప్రధాన మంత్రి నరేంద్ర మోడి నిర్వహించే ప్రగతి సమీక్షలో కూడా ఈఅంశాన్నిసమీక్షిస్తున్నారని అన్నారు.మారుమూల,సరిహద్దు,ఇన్ యాక్సిసబుల్ గ్రామాల్లోని ప్రజల ప్రయోజనార్థం ఈ 4జి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నెట్ వర్కు టవర్ల ఏర్పాటు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇందుకు సంబంధించి పెండింగ్ క్లియరెన్సులు సకాలంలో వచ్చే విధంగా అటవీ తదితర శాఖలతో మాట్లాడాలని,కలెక్టర్లతో సమీక్షించి ఆయా గ్రామాల్లో వేగాంగా 4జి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను కోరారు.మారుమూల,సరిహద్దు గ్రామాల్లో 4జి సేవలను వేగవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న టవర్లు ఇతర పనుల ప్రగతికి సంబంధించి మెరుగైన పురోగతి  ఉందని రానున్న రోజుల్లో మరింత వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు 4జి సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.

ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేజ్-2 కింద 5వేల 423 గ్రామాల్లో యుఎస్ఓఎఫ్ ద్వారా బిఎస్ఎన్ఎల్,ఎయిర్టెల్,జియో నెట్ వర్కు సంస్థల ద్వారా 4జి సేవలను అందుబాటులోకి తెచ్చేదుంకు 2329 టవర్ల ఏర్పాటుకు ఆయా సంస్థలు 2329 స్థలాల కోసం ధరఖాస్తు చేయగా ఇప్పటికే 2316 స్థలాలను అప్పగించడం జరిగిందని తెలిపారు.ఈఅంశంపై ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలక్టర్లతో సమీక్షించడం జరుగుతోందని వివరించారు.బిఎస్ఎన్ఎల్ విభాగంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది తక్కువగా ఉన్నారని సరిపడినంత సిబ్బందిని సమకూర్చితే పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి దృష్టికి సిఎస్ జవహర్ రెడ్డి తెచ్చారు.దానిపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పందించి బిఎస్ఎన్ఎల్ రాష్ట్ర స్థాయి అధికారులు వెంటనే ఎపి సిఎస్ తో కూర్చుని తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంకా ఈవీడియో సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి కె.శశిధర్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో,ఇంటిలిజెన్స్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,అదనపు పిసిసిఎఫ్ రాహుల్ పాండే,బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్,జియో నెట్ వర్కు సంస్థల ప్రతినిథులు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments