6వ తేదీన జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న - ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.


ఎన్టీఆర్ జిల్లా, (ప్రజా అమరావతి);


6వ తేదీన జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న

   - ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు



                        

జాతీయ మానవ హక్కుల కమిషన్ క్యాంపు సిట్టింగ్ కు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు.

                

 ఈనెల 6వ తేదీ బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నిర్వహించే క్యాంపు సిట్టింగ్ కు నగరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రానికి సంబంధించి  కేసుల విచారణకు క్యాంపు సిట్టింగ్ నిర్వహించనున్నదన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ మిశ్రా, సభ్యులు శ్రీ డిఎం. ములే, శ్రీ రాజీవ్ జైన్, శ్రీమతి విజయభారతి సయాని హాజరుకానున్నార న్నారు. ఈ శిబిరంలో పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకుల ప్రతినిధులతో కమిషన్ సమావేశం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర అధికారులు, సంబంధిత ఫిర్యాదుదారులు కేసుల విచారణకు హాజరుకానున్నారన్నారు.


కమిషన్ పర్యటన ఈ విధంగా ఉందన్నారు...

ఆరవ తేదీ బుధవారం ఉదయం 10.30  గంటల నుండి 12.30 గంటల వరకు క్యాంప్ సిట్టింగ్ లో కేసుల బహిరంగ విచారణ, 

మధ్యాహ్నం 12.30 గంటల నుండి 01.30  గంటల వరకు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సమావేశం,

తిరిగి 2.30 గంటల నుండి 03.30  గంటల వరకు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పౌర స‌మాజ సంస్థ‌లు (సిఎస్ వో లు), స్వచ్ఛంద సంస్థలు ( ఎన్జీవోలు), హ్యూమన్ రైట్స్  ఢిఫెండర్స్ (హెచ్ఆర్ డీ) ల‌తో ముఖాముఖి.

అనంతరం 3.30 నుండి 4.00 గంటల వరకు పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. 


ఏర్పాట్ల పరిశీలనలో సబ్ కలెక్టర్ బీహెచ్. భవాని శంకర్ ఉన్నారు.


Comments