ఎమ్మెల్సీ కవిత కు 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.

 *ఎమ్మెల్సీ కవిత కు 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ* న్యూ ఢిల్లీ :మార్చి 16. (ప్రజా అమరావతి);

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.


ఈనెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది ధర్మాసనం. శుక్రవారం సాయంత్రం బంజారా హిల్స్‌ లోని ఆమె నివా సంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.


సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.


ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు...

Comments