పదో తరగతి గణితం పరీక్షకు 95.51 శాతం విద్యార్థులు హాజరు.


ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ :: అమరావతి (ప్రజా అమరావతి);


*పదో తరగతి గణితం పరీక్షకు 95.51 శాతం విద్యార్థులు హాజరు*


ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి .


పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా నాలుగో రోజు గణితం పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు  డి.దేవానందరెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,81,256 మంది  విద్యార్థులకు గానూ 6,50,668 (95.51% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 30,588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1486 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు  సందర్శించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి  తెలిపారు.

*పరీక్ష కేంద్రాల్లో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ పరిశీలన*

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్  ఎస్.సురేష్ కుమార్  విజయవాడలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ ఉన్నత పాఠశాల (అరండల్‌పేట), సీతారాంపురంలో ఐకాన్ హైస్కూళ్లను సందర్శించారు. Comments