శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


: (ప్రజా అమరావతి );           మహాశివరాత్రి ఉత్సవములు-2024 సందర్భముగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి లోని శ్రీ ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర  స్వామివార్లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి తరుపున పట్టువస్త్రములు సమర్పించుటకు ఈరోజు అనగా ది.10-03-2024న  ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు , ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు , పాలకమండలి సభ్యులు మరియు అర్చక బృందం శ్రీకాళహస్తి దేవస్థానం చేరుకోగా ఆలయ చైర్మన్  మరియు కార్యనిర్వహణాధికారి (శ్రీకాళహస్తి)  ఆలయ మర్యాదలతో మంగలవాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వీరు శ్రీ  అమ్మవారు స్వామివార్లను దర్శనము చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, కార్యనిర్వహణాధికారి(శ్రీకాళహస్తి) , (శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం) వీరికి స్వామివార్ల శేషవస్త్రములు మరియు ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమములో పాలకమండలి సభ్యులు, ఆలయ ఆలయ వైదిక సిబ్బంది, వేదపండితులు, అర్చకులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Comments