శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):


   ఈరోజు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు   ఆలయం నందు జరుగుచున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఇందులో భాగముగా అన్నదాన భవనము, ప్రసాదం పోటు, ఎలేవేటెడ్ క్యూ కాంప్లెక్స్, కనకదుర్గ నగర్ పార్కింగ్ ప్రదేశం, యాగశాల మెటీరియల్ షిఫ్టింగ్, శివాలయం క్రింద ఉన్న ఖాళీ ప్రదేశం, కనకదుర్గ నగర్ నుండి మహమండపం వరకు రోడ్ డెవలప్మెంట్  తదితర పనులను పరిశీలించి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమ  మరియు ఇంజినీరింగ్ సిబ్బందితో సదరు పనుల గురించి చర్చించి, సదరు పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా కార్యనిర్వాహనాధికారి వారు తెలిపారు. మరియు వేసవి సందర్బంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం తదితరములను ఈవో  పరిశీలించి, పలువురు భక్తులతో  మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా భక్తులు వారి సంతృప్తిని వ్యక్తపరిచారు.

Comments