బీసీలకు రాజ్యాధికారం కోల్పోయేలా చేసిన జగనే అసలైన పెత్తందారుడు.

నెల్లూరు (ప్రజా అమరావతి);

*నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం*


*ప్రపంచానికి ఏసు శకం – రాష్ట్రానికి టీడీపీ శకంలా రూపకల్పన*


*రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ డస్ట్ బిన్ లో ఉండటం ఖాయం*


*బీసీలకు రాజ్యాధికారం కోల్పోయేలా చేసిన జగనే అసలైన పెత్తందారుడు**బాబాయ్ ని చంపిన వ్యక్తిని ఊరేగించి – న్యాయం చేయమన్న చెల్లిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు*


*యానాదుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చి ఆదుకుంటాం*


*టీడీపీ 12 డీస్సీలు పెడితే - వైసీపీ ఒక్క డీఎస్సీని పెట్టిందా?*


*పోలీస్ రిక్రూట్ మెంట్ చేస్తాం*


*గతంలో మత్స్య కారులకు ఇచ్చిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాం - మత్స్య కారులకు శాపంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం*


నెల్లూరులో పక్కనే సముద్రాన్ని మరిపించే జనసముద్రం ఇక్కడే ఉంది. కావాలి సభ దద్దరిల్లింది. ఇది చూసిన సైకో జగన్ కి నిద్రరాదు. టీవీలు పగలగొడతాడు. చేసిన పాపాలు ఊరికే పోవు. వైసీపీని చిత్తు చిత్తు ఓడించేందుకు ప్రజలందరు సిద్ధంగా ఉన్నారు.

ఎన్డీఏ అన్ స్టాపబుల్. వైసీపీకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. యువత సభలకు భారీగా తరలివస్తున్నారు. మా పిల్లలకు భవిష్యత్ గ్యారెంటీ ఇవ్వమని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా చేస్తాను.

తెలుగుజాతికి గుర్తింపు వచ్చిన రోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన రోజు, సంక్షేమం, సుపరిపాలన అందించిన  రోజు అదే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన రోజు. ఆయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు.

ఏసు శకం అంటే పూర్వం, తరువాత అని రాస్తాం. రాష్ట్రంలోను తెలుగుదేశానికి ముందు, తరువాత అనే విధంగా రూపకల్పన చేశాం.

42 ఏళ్ల సుధీర్ఘ పాలనలో ప్రపంచానికి తెలుగు జాతిని పరిచయం చేశాం. హైదారబాద్ లాంటి  బ్రహ్మండమైన నగరాన్ని నిర్మించి. విదేశాలకు తెలుగు వారిని అత్యధికంగా పంపించాం.

గత 5 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలకు గురి అవుతున్నారు. అందుకే ప్రజాగళంతో ప్రజలను ఛైతన్యవంతుగా తీర్చిదిద్దేందుకు వచ్చాను. మీకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చాను.

ఏ ఒక్క బాగు పడటం లేదు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు, నీళ్లు రని పరిస్థితి. మహిళలకు రక్షణ లేదు. నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు.

రూ.10 ఇచ్చి రూ.100 జలగాలు మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకు బాదుడే బాదుడు.

నిత్యావసర ధరలు, పెట్రలో, డీజిల్ ధరలు పెరిగాయి. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ప్రజల ఖర్చులు పెరిగాయి. మీ జీవన ప్రమాణాలు పడిపోయాయి. ప్రజల్లో ఆవేదన, బాధ ఉంది. 

యువతకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, డీఎష్సీలు ఎందుకు ఇవ్వలేదు.

జాబు రావాలంటే – బాబు రావాలని యువత అంతా నినదీస్తున్నారు.

చిరు వ్యాపారస్థుతు, కూలి పనులు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. వారికి 5 ఏళ్లుగా ఉపాధి దొరికిందా? అందరికి చాలీచాలనీ జీతం. 

ఉద్యోగం చేస్తున్న పోలీసులకు జీతాలు వస్తున్నాయా? ప్రావిడెంట్ ఫండ్ డ్రా చేసే అవకాశం మీకు ఉందా? 

ప్రజల సంక్షేమం, అభివృద్ధి భవిష్యత్ కు గ్యారెంటీ మాది. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారు.

ప్రజల తుఫాను తాకిడికి ఫ్యాన్ గిలగిలకొట్టుకుంటుంది. ఫ్యాన్ డస్ట్ బిన్ లో ఉండాలి.

నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు.

ఏంటి రాష్ట్రం ఇలా అయ్యిపోతుందని బాధ కలుగుతుంది. జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగంపై గౌరవం లేదు. ప్రజలపై విశ్వాసం లేదు.

దోచుకున్న డబ్బులతో అక్రమ కట్టడాలు, ప్యాలెస్ లు కట్టుకోవడం మాత్రమే తెలుసు. పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని తప్పుడు ప్రచారాలు మాత్రమే చెయ్యడం తెలుసు.

బాదుడే బాదుడే వలన అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అభివృద్ధి ఆగిపోయిం, ఆదాయం తగ్తిపోయింది, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు తరలిపోయాయి.

జగన్ ముందు ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎవ్వరు ఎదురుతిరిగినా సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజల నుంచి ఉద్యగ సంఘాల వరకు అందిరిని అణగతొక్కారు.

రోడ్డు మీద ఎవరైనా వస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయించారు. జైల్లో పెట్టి కొట్టి, టార్చర్ పెడతారు, అదే విధంగా చంపేందుకు కొంత మంది పోలీసులు కృషి చేశారు.

రాష్ట్రంలో లక్షలాది అక్రమ కేసులు బనాయిస్తే తట్టుకోలేక ఇళ్లల్లోనే బాధపడ్డారు. ఆస్తులు కబ్జా చేస్తే మాట్లాడలేని పరిస్థితి.

ఆఖరికి కృష్ణ పట్నం పోర్టును నిర్వీర్యం చేశారు. స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు.

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 

కడప, ఒంటిమిట్టలో ఒక అతని ఆస్తి వేరే వాళ్లు రాయించుకుంటే సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

ఎమ్మల్యే చేపల చెరువు దోచుకుంటే ఇదే ప్రాంతంలో కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర, లోకేష్ ఆదుకొని  ఆ అప్పు కట్టారు.

మాస్క్ అడిగినందుకు సుధాకర్ అనే డాక్టర్ ను వేధించి పిచ్చి వాడిగా చేసి చంపేశారు.

కాకినాడలో ఎమ్మల్సీ అనంతబాబు ఎస్సీ వర్గానికి చెందిన తన కార్ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేశారు.

బాబాయ్ ది గొడ్డలి వేటా? సహజ మరణామా? చంపినతనికి ఎంపీ సీటు ఇచ్చే ఊరేగే పరిస్థితికి వచ్చారు. మా నాన్న ను చంపిన వాళ్లపై కేసు పెట్టండి, ప్రపంచానికి పరిచయం చేయండి, ఆత్మకు శాంతికి కలిగించమని చెల్లెళ్లు కోరితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

ఇవ్వన్ని చూస్తే సామన్య ప్రజలకు భవిష్యత్ కు రక్షణ ఉందా? ఆస్తులకు రక్షణ ఉందా?

పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందనం సుబ్బయ్య, రాజాంలో కృష్ణ మాస్టర్, గిద్దలూరులో మనయ్య, పుటపర్తిలో అమర్ నాథ్ రెడ్డి, రేపల్లె లో చెల్లెల్ని అవమానవద్దని అడిగిన పాపానికి పెట్రోల్ పోసి తగలపెట్టారు.

జగన్ ను చిత్తు చిత్తు గా ఓడిస్తేనే మనందరం బాగుపడతాం. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగే జగన్ బుల్లెట్ ఫ్రూట్ బస్సులో వచ్చాడు. 

నేను పేదల మనిషి మిగిలిన వారందరూ పెత్తందారులు అని జగన్ అంటున్నారు. 

పేదల కోసం రూ.5 భోజనం పెట్టిన వారు పెత్తందారులా? అన్న క్యాంటీన్ ను అధికార అహంకారంతో రద్దు చేసిన వాళ్లు పెత్తందారులా?

పేదలు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యోన్నతి అమలు చేసిన వాళ్లు పెత్తందారులా? కక్షపూరితంగా విదేశీ విద్యోన్నతిని రద్దు చేసిన వాళ్లు పెత్తందారులా?

ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని 12 లక్షల టిడ్కో  ఇళ్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు మార్చుకున్నారు. 

పేదలకు ఇళ్ల ఇవ్వకుండా, వాళ్లు అప్పుల పాలు చేసిన వ్యక్తి నిజమైన పెత్తందారుడు.

ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కాని జగన్ రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారుడు. పేదల ఇళ్లకు రాష్ట్రం నిధులు ఇవ్వకుండా కేంద్ర నిధులు మీకు ఇచ్చారు.

ఇప్పుడు ఉన్న కాలనీలు అలానే ఉంటాయి, ఏమీ రద్దు అవవ్వు. అక్కడే మీరు ఇళ్లు కట్టుకునేందుకు మరిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఆదుకుంటానని హామీ ఇస్తున్నాను.

నేను జగన్ మాదిరి కాదు. ఏదైతే అసంపూర్తిగా వదిలి పెట్టారో, అరాకొర ఇచ్చారో అది చాలదు. అన్ని విధాలుగా ఆదుకునేందుకు నిధులు ఇస్తాం, మిమ్మల్ని అప్పుల నుంచి భయటకు తీసుకువచ్చాం.

ఎష్సీలకు 27పథకాలు ఇచ్చిన వాళ్లు పెత్తందారులా? వాటిని రద్దు చేసిన వ్యక్తి పెత్తందారులా?

గిరిజన కాలనీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, కరెంట్, వంట గ్యాస్ ఇచ్చిన వాళ్లు పెత్తందారులా? ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టని వాడు పెత్తందారుడా?

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ టీడీపీ. బదిలీల పేరుతో ఎమ్మెల్సీలను ట్రాన్సఫర్ చేసి ఆయన మనుషులను ఇక్కడే పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అసలైన పెత్తందారుడు.

పేదల పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లో సీట్లు ఇచ్చాం. వారి భవిష్యత్ కోసం కృషి చేస్తే కాని నేడు జగన్ రెడ్డి ఆ స్కీమ్ ని తీసేశారు.

పేద పిల్లలందరికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మంట్ తీసేసిన జగన్ రెడ్డి పెత్తందారుడు.

9 సార్లు కరెంట్ చార్జీలు పెంచాడు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదవాడి పొట్ట కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు.

పేదల ఆస్తులు తరిగిపోయాయి, అప్పులు పెరిగిపోయాయి. కాని జగన్ రెడ్డి ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

దేశంలో ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, అప్పులు ఎక్కువగా ఉన్న ప్రజలు ఏపీలోనే ఉన్నారు.

రైతులు దేశంలోనే తలసరి అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. యువత ఆత్మహత్యల్లో నెంబర్ వన్ లో ఉన్నాం. 

కాని విలాశవంతమైన ఇళ్లు కట్టుకున్న జగన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు. 

జగన్ కుర్చీ కూలదొయ్యడానికి ప్రజలు సిద్ధం. జగన్ అహంకారం కూలిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్ బద్దులు కొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

మహిళలను అవమానపాలుకు గురి చేయడం వైసీపీ డీఎన్ ఏలోనే ఉంది. 

ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. 

అలాంటి నిస్వార్ధపరుడు పార్టీలోకి వచ్చి ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మాం.

నెల్లూరు జిల్లా ఎంపీ మనదే. ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఎన్నికలు నామమాత్రమే.

ఆయన మీద పోటీకి ఎవరిని పెట్టారో చూశారా? ఆయనే ఏ2. ఒక అవినీతి పరుడు, పనికి మాలిన వ్యక్తి, దళారి వ్యవస్థకు దత్తపుత్తుడు

మీటింగ్ పెట్టి, భోజనం పెడతామని అడుక్కుంటున్న జనం వెళ్లిపోయారు. 

వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి  భార్య ప్రశాంతి కోవూరు పోటీ చేస్తున్నారు.  అలాంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు. 

ఉన్మాదుల్లా, అరాచక శక్తుల్లా వైసీపీ నేతలు తయారయ్యారు. 

నెల్లూరు జిల్లాలో బుల్లెట్ దించుతానన్న వ్యక్తి ఇప్పుడు నర్సరాపుపేటలో పడ్డారు. అక్కడ ఓటర్లు తంతే మళ్లీ చెన్నైలో పడతారు. మంచి చెడులకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు.

అన్ని వర్గాలను ఆదుకుంటాం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా, పేదవాళ్లకు తోడుగా ఉంటాం.

ఆదాయం తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలను తెచ్చేందుకు కృషిచేస్తాం.

కియాను తేయవడం మా బ్రాండ్, పరిశ్రమలు తరలికొట్టడం జగన్ రెడ్డి బ్రాండ్.

యానాదుల కోసం ప్రత్యేకంగా ఐటీడీ పెట్టాను. యానాదుల కోసం కొత్తగా ప్రత్యేక కార్యక్రమాలు తెస్తాను. మీ పిల్లలను చదివిస్తాను.

ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి రూ.1,500 ఇచ్చే పూచి నాది. నెంబర్ తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం. తల్లిక వందనం కింద ఒక్కో విద్యార్ధికి రూ.15,000 ఇస్తాం.  దీపం పథకం కింద ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఉస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

రైతు బాధ పడితే ఆ రాష్ట్రం సుభీక్షంగా ఉండదు. అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రతి ఒక్క రైతుకు రూ.20వేలు ఇస్తాం. సబ్సిడీ, గిట్టుబాటు ధరలు ఇస్తాం.

యువగళం కింద 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మెగా డిస్సీ తొలి రోజునే పిలుస్తాను.

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డీఎస్సీలు, ఎన్టీఆర్ గారు 3 డీఎష్సీలు పెడితే జగన్ రెడ్డి 5 ఏళ్లల్లో ఒక్క డీఎస్సీ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి.

నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం. శుభవార్త ఎన్డీఏ హయాంలో న్యాయం చేసే బాధ్యత మాది. 

ప్రపంచంలోని అన్ని కంపెనీలను అనుసంధానం చేసి మీ ప్రాంతం నుంచి పని చేసేవ విధంగా చేస్తాను.

ఇంటింటికి మంచి నీరు, బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. పింఛన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్. రూ.200 నుంచి రూ.2000 పెంచాను. ఫించన్ రూ.4వేలు చేసి మీ ఇంటి దగ్గరే మొదటి తారీఖునే ఇచ్చే ఏర్పాటు చేస్తాం.

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్. వాలంటీర్లను కొనసాగిస్తాం. రాజకీయాలు చేస్తే వదలిపెట్టం. మంచి వాళ్లను కొనసాగిద్దాం. అవసరమైన వాలంటీర్లను స్కిల్ డవలప్ మెంట్ ఇచ్చి రూ.5వేల నుంచి రూ.50వేలు జీతం తీసుకునేందుకు కృషి చేస్తాం.

పోలీస్ రిక్రూట్ మెంట్ చేస్తాం. 

ఎన్డీఏలో 1995 నుంచి 2004 వరకు అలయెన్స్ ఉంది. 2014-19 వరకు అలయెన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. 2014లో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలని జనసేన అభిమతం. 

ప్రజల కోసం మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు బాగుపడాలి.

రూ.12 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. రేపు వచ్చే ముఖ్యమంత్రికి దిక్కు తెలియకుండా ఉండకూడదని అందరం కలిసి వస్తున్నాం.

మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. ఎన్డీఏ లో ఉన్న ముస్లిం హక్కులను కాపాడం. 5 ఏళ్లు బీజేసీ ఏ బిల్లు పెట్టినా వాటికి సపోర్టు చేసిన పార్టీ వైసీపీ. మీరు చేసింది స్వార్ద ప్రయోజనాల కోసం మేము చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం.

కావలి కాలకేయుడు అవినీతిపరుడు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదు. వింత జీవి, విచిత్రమైన మనిషి. అతనిని ఢీ కొట్టడానికి కావ్యా కృష్ణారెడ్డి. సుబ్బానాయుడు భవిష్యత్ నేను చూసుకుంటాను. ఈ సీటు గెలుస్తున్నాం, గెలిచాం. 

కావాలి ఎమ్మెల్యే ఒక నాయకుడిగా కాదు మనిషిగా ఉండటానికి అర్హుడు  కాదు.

దళితుడు కరుణాకర్ అనే వ్యక్తి చేపల చెరువును లాక్కున్నారు. కప్పరాల తిప్పలో బీసీ గురుకుల కింద ఉన్న 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. సెంటు పట్టా భూమిలో రూ.100 కోట్లు కొట్టేశారు.

కావలి రూరల్ లో విచ్చల విడిగా గ్రానైట్ దోచుకున్నారు. ప్రతి దానిలో కమీషన్లు కావాలంటూ గద్దల్లా మారి పీక్కుతుంటున్నారు.

మీ అరాచకాలను చిత్రగుప్తుడి మాదిరి లెక్కలు రాశాను. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తాను.

యానాది శెట్టి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటాను.

గతంలో మత్స్య కారులకు ఇచ్చిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాం. మత్స్య కారులకు శాపంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం. గతంలో ఇచ్చిన అన్ని మళ్లీ పునరుద్దరిస్తాం. అక్వాపరిశ్రమలకు చేయూతనిస్తాం. రూ.1.50 విద్యుత్ సరఫరా చేస్తాం. ఉప్పు నిల్వ చేయడానికి షెడ్లు నిల్వ చేస్తాం. ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకానికి కార్యక్రమానికి పైలాన్ పగులకొట్టారు. వారిపై కేసులు పెడతాం.

నార్త్ అమ్మలోరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది మేము దానిని పూర్తి చేస్తాం. పైడేరు వాగుపై బ్రిడ్స్ నిర్మాణం రద్దు చేశారు. 

ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు నేను కడితే జగన్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. 18 నెలల్లో దగదర్తి విమానాశ్రయానికి ఫౌండేషన్ వేశాను. ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాను. 

మాకు ఓటు వేస్తే కంపెనీలు వస్తాయి, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం, మహిళలకు రక్షణ ఇస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేస్తాం. 

కావాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పూర్తి చేస్తాం. 

నాశిరకం మద్యంతో మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపాలి.

Comments