పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

 *పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!**ప్యాలెస్ లో పెద్దనటుడు...మంగళగిరిలో చిన్ననటుడు.*


*పన్నులు విధానాన్ని సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం.*


*మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్.* 


మంగళగిరి (ప్రజా అమరావతి): మంగళగిరి పరిధిలో పెద్దఎత్తున వివిధరకాల పరిశ్రమలు రప్పించడం ద్వారా ఉద్యోగాలు కల్పించి, పేదరికం లేని మంగళగిరిని సాధించడమే తన లక్ష్యమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో యువనేత లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే నియోజకవర్గంలో ఏ ఒక్క పనీ చేయలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్దనటుడు, మంగళగిరిలో చిన్ననటుడు పోటీపడి నటిస్తున్నారు. ఇద్దరూ సినిమాల్లోకి వెళితే భాస్కర్ అవార్డు రావడం ఖాయమని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రభుత్వంతో సమానంగా నియోజకవర్గంలో సొంతనిధులతో 29సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందించా. వీవర్స్ శాల ఏర్పాటుతో  కొత్తడిజైన్లు రప్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించా. రాబోయే రోజుల్లో మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా 40వేలమందికి ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు అన్నివిధాలుగా అభివృద్ధి చేశారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న మంగళగిరి అభివృద్ధిని పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తా. ఆదర్శంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా. పన్నుల విధానాన్ని సమీక్షించి అడ్డగోలుగా విధించిన పన్నులను తగ్గిస్తాం. గతంలో తాను ఆటోనగర్ కు తెచ్చిన ఐటి కంపెనీల్లో 70శాతం జగన్ దెబ్బకి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అక్కడ ఐటి కంపెనీలు రప్పించే బాధ్యత నాది. పోలింగ్ రోజున వైసిపి గొడవలు సృష్టించి సమయం వృధా చేసే అవకాశం ఉంది. ఓర్పు, సహనంతో ప్రతిఒక్కరూ ఓటువేయాలి. మంగళగిరి సమగ్రాభివృద్ధికి ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని లోకేష్ కోరారు. 


సమస్యలు తెలుసుకునేందుకే ప్రజలవద్దకు లోకేష్

మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకే యువనేత నారా లోకేష్ ప్రజల ముందుకు వచ్చారని మంగళగిరి జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరిస్తారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ విధ్వంసక పాలన వల్ల ఒక తరం భవిష్యత్తు దెబ్బతింది. మంగళగిరి సమగ్రాభివృద్ధికి యువనేత లోకేష్ ను దీవించాలని కోరారు.


యువనేత ఎదుట అపార్ట్ మెంట్ వాసుల సమస్యలు

కుంచనపల్లి అన్నపూర్ణ అపార్ట్ మెంట్ వాసులు తమ సమస్యలను తెలియజేస్తూ... డ్రైనేజి, తాగునీరు సమస్యలు పరిష్కరించండి. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయి. చీప్ లిక్కర్, గంజాయిని నివారించి యువత భవితను కాపాడండి. ఆటోనగర్ లో ఏర్పాటుచేసిన ఐటిటవర్స్ కు ఐటి కంపెనీలను రప్పించి బిడ్డలకు ఉద్యోగాలిప్పించండి.  వాలంటీర్లు ఇళ్లకు వచ్చి ఓటిపిలు అడుగుతున్నారు, తాడేపల్లి పరిధిలో మోయలేని విధంగా ఉన్న పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ... మంగళగిరి పరిధిలో బ్లాక్ డెవలప్ మెంట్ మోడల్ తో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో గంజాయిని అరికడతాం.  గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలో కసి, పట్టుదల పెరిగాయి. మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా నాలక్ష్యం, ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నేను డబుల్ ఇంజన్ మాదిరిగా పనిచేసి మంగళగిరిని అభివృద్ధి చేస్తామని లోకేష్ చెప్పారు.


Comments