శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది.*మే 13 తర్రావాత ష్ట్రంలో జగనాసుర వధ తధ్యం*


*శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది*
*సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది మే 13న జరిగే ఓట్ల సునామీ ఎలా ఉంటుందో*


*అనంతపురంలో కియా మన బ్రాండ్... జాకీ పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్*


*దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు*


*వివేకా హత్యపై జగన్ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు*


*రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి*


*నీళ్లు ఇస్తే బంగారం పండించగల భూములు అనంతపురం సొంతం*


*మనం మహాశక్తితో ఆడబిడ్డను గౌరవిస్తే.. జగన్ రెడ్డి సొంత చెల్లెళ్ల పుట్టుకనూ ప్రశ్నిస్తున్నాడు*


*యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు రావాలి.. పోరాడాలి*


అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం  (ప్రజా అమరావతి);


రేపు ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

శింగనమలలో ఈ సారి పసుపు జెండా ఎగరేయబోతున్నామని ఇక్కడకొచ్చిన జనం చూస్తే అర్ధమైపోతుంది.

ఈ ఎన్నికలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మార్చే ఎన్నికలు. 

సభకు వచ్చిన ప్రజా ఉదృతి చూస్తుంటే మే 13న జరగబోయే ప్రజా సునామీ కళ్లకు కనిపిస్తోంది.

ఐదేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకునని ఓటు వేయాలి.

నరకాసుర వధ చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవానికి గడువు 46 రోజులు మాత్రమే.

బటన్ నొక్కా అని చెప్పే జగన్ రెడ్డి.. బటన్ నొక్కి వేస్తున్నదెంత, బొక్కుతున్నదెంతో సమాధానం చెప్పాలి.

ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయం, దోపిడీ గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.

రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్న జలగ ఈ జగన్ రెడ్డి.

కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వరుసగా పెంచుకుంటూ పోయాడు. 

టీడీపీ హయాంలో రూ.200 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 అయ్యింది. దీనిపై చర్చించాలి.

పెట్రోల్ డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరిగాయో, ఎంతలా పెరిగాయో ప్రజలు ఆలోచించుకోవాలి.

చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జలగ. మద్యం క్వార్టర్ అప్పుడు రూ.60 ఉంటే.. ఇప్పుడు రూ.200 చేశాడు. ధరలు పెంచి, పేదల రక్తం తాగుతూ, తాడేపల్లి కొంప నింపుకుంటున్నాడు.

కల్తీ మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రేట్లు పెంచుకుంటూ పోవడం ద్వారా మద్య నిషేధం చేస్తానంటూ ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వీరోచితంగా పోరాడే యువత మన రాష్ట్రంలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. మెగా డీఎస్సీ అన్నాడు. ఐదేళ్లు పూర్తైంది. ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా?

మనం వస్తే పెట్టుబడులొస్తాయి. పరిశ్రమలొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. అనంతపురంలో కియా మన బ్రాండ్. జాకీ పారిపోయిందంటే అది జగన్ రెడ్డి బ్రాండ్. పెట్టుబడులు తరిమేయడం జగన్ పని.. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉద్యోగాలివ్వడం మన బ్రాండ్. ముఖ్యమంత్రిగా నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.

పిల్లలకు ఉద్యోగాలివ్వడం లేదు. గంజాయి, మద్యం, డ్రగ్స్ తెచ్చి యువత జీవితాలను నాశనం చేస్తున్నాడు.

పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలనుకుంటారు. జగన్ రెడ్డి అనే దుర్మార్గుడి పాలనలో ఉద్యోగాల్లేక మద్యం, గంజాయి, డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నాడు.

ఓటింగ్ రోజున గ్రామాలన్నీ ఏకం కావాలి. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకం కావాలి. మన భవిష్యత్తు కోసం అందరమూ పని చేయాలి.

రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన, సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టి భవిష్యత్తును కాపాడుకుందాం.

ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకి ఓటు వేయించేలా ఒప్పించాలి. భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించాలి.

జగన్ రెడ్డి అరాచకానికి ప్రతి వర్గమూ నష్టపోయింది. రైతులు, వ్యాపారులు, కూలీలు, ట్రాన్స్ పోర్టు రంగమూ నష్టపోయింది.

నష్టపోయిన ప్రతి రంగమూ అభివృద్ధిలోకి రావాలంటే, లాభాల్లోకి రావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి.

దళితులందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో 1996-97లోనే ఏ, బీ, సీ, డీ వర్గీకరణ తీసుకొస్తే. దాన్ని రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ చేసేందుకు ముందుకు రావడం సంతోషకరం.

సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ప్రజలు తెలుసుకోవాలి.

దళితులకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దళితుల గొంతు కోశాడు. దగా చేశాడు.

దళితుల కోసం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశఆడు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్, కులాంతర వివాహాలు సహా అన్ని దళిత పథకాలు రద్దు చేశాడు.

విదేశాల్లో చదువుకునే వారికి అంబేద్కర్ విదేశీ విద్య తీసుకొస్తే.. అంబేద్కర్ పేరు తీసి ఈ దుర్మార్గుడి పేరు పెట్టుకున్నాడు.

దళితులకు స్వాతంత్ర్యం లేదు. నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు. అహంకారంతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. 6వేలకు పైగా తప్పుడు కేసులు పెట్టాడు. 180 మంది దళితుల్ని హత్య చేశాడు.

కాకినాడలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే.. హంతకుడి భుజాలపై చేతులేసుకుని ప్రోత్సహిస్తున్నాడు.

దళితులంతా ఏకం కావాలి. దళితులకు న్యాయం చేసే ఏకం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. 

తెలుగుదేశం పార్టీ వెన్నెముక బీసీలు. వారికి ఈ పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రోత్సహించే ఏకైక పార్టీ తెలుగుదేశం.

జగన్ రెడ్డి రాగానే బీసీలకు అమలు చేసిన 30కి పైగా పథకాలు రద్దు చేశాడు. ఆదరణ, కార్పొరేషన్ రుణాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోతతో ఎవరూ చేయనంతటి దగా చేశాడు.

అందుకే 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ ఇచ్చి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా.

నిన్న పులివెందులకు వచ్చిన జగన్ రెడ్డి.. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు. బాబాయిని గొడ్డలి వేటు వేసి చంపి నాటకాలలాడుతున్నాడు.

2019 మార్చి 15న సాక్షి టీవీలో గుండెపోటు అన్నారు. తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు అన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు. చివరగా నా చేతిలో గొడ్డలి పెట్టి దొంగ సాక్షిలో బొమ్మ వేశారు.

తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్లే హత్యకు కారణం అన్నారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, సీబీఐ విచారణ కావాలన్నాడు. హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు.

అధికారంలోకి రాగానే.. సీబీఐ విచారణ వద్దు అంటూ వేసిన పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాడు. కానీ సునీత పోరాటం ఆపలేదు. తండ్రి హంతకుల్ని పట్టుకోవాల్సిందేనని పోరాడింది.

రెండో వివాహమే కారణమన్నారు, ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణమన్నారు. తర్వాత కూతురే హత్య చేసిందన్నారు. తర్వాత సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించినందునే చంపేశారన్నారు.

నిన్న పులివెందుల వచ్చిన జగన్ రెడ్డి.. బాబాయిని ఎవరో చంపేసి దాన్ని వారిమీదకు నెట్టేస్తున్నారని బీరాలు పోతున్నాడు.

ఇద్దరు చెల్లెల్లని నేను మేనేజ్ చేస్తున్నానంటూ కథలు చెబుతున్నాడు. అన్ని రాజకీయ పార్టీలను నేనే మేనేజ్ చేస్తున్నానని, ఆయన ఒంటరి వాడని మాట్లాడుతున్నాడు.

పిచ్చోడో, దొంగో వస్తే ఊరంతా కలిసి దొంగను తరిమేస్తారు. పిచ్చి కుక్కను అంతా ఏకమై తరుముతారు. ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ శని గ్రహాన్ని వదిలించుకోవడానికి అంతా ఏకం కావాలి.

జగన్ రెడ్డి ఒంటరివాడు కాదు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మానసిక రోగి.

దారుణమైన రోడ్లు చూస్తే జగన్ రెడ్డి గుర్తొస్తాడు. కొట్టుకుపోయిన సాగునీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొస్తాడు. పాడుబడిన రాజధాని చూస్తే గుర్తొస్తారు. పూర్తి కాని పోలవరం చూస్తే జగన్ గుర్తొస్తాడు, గంజాయి, డ్రగ్స్, మాఫియాలను చూస్తే జగన్ గుర్తొస్తాడు. ప్రజల జీవితాలను నాశనం చేసిన వాడంటే జగన్ రెడ్డి గుర్తొస్తాడు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నంగనాచిలా మాట్లాడుతున్నాడు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.

కానీ నేను సీమ ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా కోసమే ఏకంగా రూ.5800 కోట్లు ఖర్చు చేసి.. జీడీపల్లి, చెర్లోపల్లి, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి అనంతపురం జిల్లాకు నీరిచ్చాను.

నీళ్లుంటేనే అభివృద్ధి. మన కష్టాలు తీరుతాయి. పెట్టుబడులొస్తాయి. గొల్లపల్లి పూర్తి చేసి అనంతపురంలో కియా పరిశ్రమ పెట్టాను. సీమకు నీళ్లొస్తే రత్నాల సీమగా చేస్తామని నమ్మి పని చేశాను.

కృష్ణా, గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్న చెరువులు నింపి సీమను సస్యశ్యామలం చేయాలనేది నా ఆశయం. ప్రజల ఆశీర్వాదం ఉంటే.. ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటా.

జగన్ రెడ్డి అహంకారాన్ని తొక్కేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జగన్ రెడ్డీ.. సిద్ధంగా ఉండు. 

మే 13 తర్వాత జగన్ రెడ్డి అహంకారం కూలిపోతుంది. పెత్తనం పడిపోతుంది. అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొడతాం.

సిద్ధం అంటూ రోడ్డెక్కిన నిన్ను ఓడించడానికి ప్రజలంతా సిద్ధం. కాస్కో జగన్ రెడ్డీ.

రావణుడు కూడా నాకంటే గొప్పోడు లేడన్నారు. కానీ, చివరికి రాముడి చేతుల్లో ఏమయ్యారో తెలుసుకో.

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అందరం బాధితులమే మనం మనం చేతులు కలపాలి. జగన్ రెడ్డి అరాచకంపై ఉద్యమించాల్సిందే.

మేధావులు, సామాజిక వేత్తలు, రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఆలోచించండి.. బాధ్యతగా ఓటు వేయండి. మన భవిష్యత్తు కోసం ఓటు వేయండి.

ఒక్క ఛాన్స్ అన్నాడు. బుగ్గలు నిమిరాడు. నెత్తిన చెయ్యి పెట్టాడు. ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

రూ.10 ఇచ్చి రూ.100 దోచేయడం కనిపిస్తోందా. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు పెంచాడు. చివరికి ఇసుక మొత్తాన్ని దొంగతనంగా బ్లాకులో అమ్ముకుంటున్నాడు.

ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే.. సంపద సృష్టించడం తెలిసిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి.

అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది. లేకుంటే అప్పులు చేసి, వాటికి వడ్డీలు కట్టుకుంటూ సంపద మొత్తాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది.

సంపద సృష్టిస్తా. ఆదాయం సృష్టిస్తా. ఆ ఆదాయాన్ని ప్రజలందరికీ పంచుతా. అసలు సిసలైన బటన్ నొక్కుతా.

డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలకు పొదుపు అంటే ఏంటో నేర్పించాను. వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మరుగుదొడ్లు కట్టించ ఆత్మగౌరవం కాపాడాను. ఆస్తిలో హక్కు కల్పించి గౌరవించింది తెలుగుదేశం, ఎన్టీఆర్ మాత్రమే. 

ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు ఉంది. పాతికేళ్ల క్రితం ఐటీ అంటే అందరూ నవ్వుకున్నారు. కానీ, ఈ రోజు చూడండి ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారో. ఎంత ఆదాయం సంపాదిస్తున్నారో.

ఆరోజు వేసిన పునాది కారణంగా.. ఈ రోజు దేశంలో ఎక్కువ ఆధాయం సంపాదించే వారిలో తెలుగు వారిదే అగ్రస్థానం.

ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.1500 ఇస్తా. ఎంత మంది ఉంటే అందరికీ అందిస్తాను. 

తల్లికి వందనంతో చదువుకునే ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తా. 

జగన్ రెడ్డి రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు. కానీ, నేను రూ.15 ఇస్తా. దాంతో రూ.100, రూ.1000 సంపాదించే మార్గం చూపిస్తాను.

దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తా.

ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తా. ఎక్కడైనా ఎక్కండి, మీ పనులు ముగించుకుని మళ్లీ ఉచితంగా బస్సుల్లో ఇళ్లకు వెళ్లండి.

రైతుని రాజు చేయడమే నా ధ్యేయం. అనంతపురం జిల్లా రైతాంగానికి ఉన్నన్ని అవకాశాలు ఇంకెక్కడా లేవు. నీళ్లు ఇస్తే.. బంగారం పండించగల భూములున్నాయి. గతంలో డ్రిప్ ఇస్తే.. మూడు నాలుగు రకాల పంటలు పండిస్తున్నారు.

అనంతపురం జిల్లాకు పుష్కలంగా నీరు అందిస్తే దేశంలోనే ది బెస్ట్ నియోజకవర్గం అవుతుంది. ప్రతి రైతుకు అన్నదాత పథకంతో ఏటా రూ.20 వేలు ఇస్తా. డ్రిప్ ఇరిగేషన్ పథకంతో పనిముట్లన్నీ మళ్లీ అందిస్తా.

యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. అంత వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తా.

ఇళ్లలో కూర్చుని ప్రపంచంలో కూర్చుని పని చేసుకునేలా మండల కేంద్రాల్లో వర్క స్టేషన్లు కట్టిస్తా. 

స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలతో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.

ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తా. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను.

ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ ఇచ్చారు. నేను రూ.75 చేశాను. 2014లో అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశాను. ఆ నిజాన్ని కూడా జగన్ రెడ్డి ఒప్పుకోలేకపోతున్నాడు. 

అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని రూ.4000కు పెంచుతాను. మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునేలా నిబంధనలు మారుస్తాను. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తాను.

శింగనమలలో దెంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్శిటీ పనులు నిలిచిపోయాయి. కేంద్రంతో మాట్లాడి పనులు పూర్తి చేస్తా.

గార్లదిన్నెమండలంలో అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరి ఆకలితీర్చే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రమంతా విరివిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తా.

ఉల్లికల్లు ఆర్ అండ్ ఆర్ చాగళ్లు రిజర్వాయర్లకు రూ.168 కోట్లు కేటాయించి, పనులు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి కనీసం పూర్తి చేయలేదు. దాన్ని నేను వచ్చాక పూర్తి చేసితీరుతా.

శింగనమలలో 10 నెలల క్రితం అంబేద్కర్ విగ్రహం కడతానన్నడాడు కట్టాడా?

మిడ్ పెన్నార్ నిర్వహణకు రూ.3 కోట్లు ఇస్తానన్నాడు. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు.

గండికోట, సుబ్రయాన్ సాగర్, పొట్లూరు మండలానికి నీటి పైపులైన్ల కోసం రూ.250 ఇస్తానన్నాడు. రూపాయి ఇవ్వలేదు. జగన్ మాటలు కోటలు దాటతాయి. కానీ, చేతలు మాత్రం గడప కూడా దాటవు.

కోల్డ్ స్టోరేజీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని ఇవ్వకుండా తగా చేశాడు.

గార్లదిన్నె, శింగనమలలో షాధీఖానా 95 శాతం పనులు పూర్తైపోయినా.. ఐదేళ్లలో 5శాతం పనులు పూర్తి చేయలేదు.

ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతానంటున్నాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి.

స్థానిక ఎమ్మెల్యే.. దోపిడీకి కేరాఫ్ అడ్రస్ లా మారారు. ప్రభుత్వ భూములు, వివాదాలున్న భూములు మొత్తంగా 500 ఎకరాలు, కోడుమర్తి గ్రామంలో 2.50 ఎకరాల శ్మశానం భూమిని కూడా కబ్జా చేశారు.

విండ్, సోలార్ మిల్లుల యజమానుల్ని బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు.

బండారు శ్రావణిశ్రీ చదువుకున్న అమ్మాయి. సీనియర్ నాయకులు కేశవ రెడ్డి, సీనియర్ నాయకులు నరసయ్య, రామలింగారెడ్డి లాంటి ఎంతో మంది ఉన్నారు.

ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా సేవ చేసేవారు పెత్తందారులంట.. అగ్రవర్ణాల చేతుల్లో అధికారాన్ని పెట్టి పేదల్ని పీల్చి పిప్పి చేసే వాడు పేదల మనిషంట.

జగన్ రెడ్డీ.. నువ్వు చెప్పే మాటలు నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేము.

శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది.

సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం.

160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు సాధించుకుందాం. జగన్ రెడ్డీ.. ఈ రాష్ట్రానికి నీ అవసరం లేదని చాటి చెబుదాం.

కేవలం 46 రోజులు మీ భవిష్యత్తు కోసం పని చేయండి. మీ పిల్ల భవిష్యత్తు కోసం పని చేయండి. భావితరాల కోసం పని చేయండి. తల్లిదండ్రులు పిల్లల్న భుజాలపై ఎత్తుకుని పెంచుతారు.

నేను కూడా అదే విధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పని చేస్తున్నాను. 

మన విజన్ ఎప్పుడూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలి. 

పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. గెలిపించే బాధ్యత ప్రజలు, నాయకులు తీసుకోవాలి.

ఒంటిమిట్టలో చేనేత కార్మికుడి భూమి రికార్డుల్ని వైసీపీ నేతలు ఆన్ లైన్లో మార్చేశారు. చివరికి దిక్కుతోచని స్థితిలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు.

ఇప్పుడు కమిషన్ కడుతున్నారు. మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే.. మీరు పంట పండించి వారికిచ్చేయాల్సి వస్తుంది. తిరిగి కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది.

కోపాలుంటే అరుచుకుంటారు. లేదా మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. చీనీ చెట్లు నరికేసి రైతుని రోడ్డున పడేశారు. పది పదిహేనేళ్లు బిడ్డలా సాకిన చెట్లను రాజకీయ వైరంలో భాగంగా నరికేసే ద్రోహుల్ని ఏం చేయాలో ఆలోచించాలి.

పులివెందుల నుండి మళ్లీ హత్యా రాజకీయాలు మొదలవుతున్నాయి. గతంలో తీవ్రవాదుల్ని, ముఠా నాయకుల్ని, రౌడీలను పారద్రోలాం. మత సామరస్యాన్ని కాపాడాం. ఇప్పుడు రాజకీయ విధ్వంసకారుల్ని మట్టికరిపిస్తా. కబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు.

మన ప్రభుత్వం వస్తే అందరూ బాగుంటారు. 46 రోజుల పాటు పని చేయండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి.

Comments