రాష్ట్ర సమాచార కమిషనర్లు ఆర్టిఏ కేసము సత్వరమే పరిష్కరించాలి.

 విజయవాడ (ప్రజా అమరావతి );


      రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ పనితీరుపై విజయవాడ నందు స్వాతంత్ర్య సమరయోధుల భవనం నందు ఆర్టిఐ కార్యకర్తల సమీక్ష  సమావేశం జరిగినది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కావడానికి సమాచార కమిషన్ బాధ్యతగా పనిచేయాలని కార్యకర్తలు కోరారు. సమాచార హక్కు ప్రచార సంస్థ రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ సమాచార కమిషన్లు రోజువారి కేసులు తగిన సంఖ్యలో లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు నందు ఒక్కో న్యాయమూర్తి ప్రతిరోజు 50 నుండి 100 కేసులు వరకు కేసుల విచారణ జరుపుతున్నారని, హైకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వేతనాలు పొందే గౌరవ సమాచార కమిషనర్లు ప్రతిరోజు కేసుల విచారణ జరపక, కొద్దిమంది కమిషనర్లు రోజువారి విచారించే కేసుల సంఖ్య పదిలోపే ఉంటూ ప్రతిరోజూ కూడా కేసులు విచారణ జరపటం లేదని విచారించే కేసులు నెల మొత్తం ఉండటం దారుణమన్నారు. సమాచార కమిషనర్లు చట్టానికి అతీతులని ప్రశ్నించారు. ముఖ్యంగా ఒక్క రెవెన్యూ శాఖ కేసులు మాత్రమే మూడు వేలకు పైగా పెండింగ్లో ఉండటం ఆర్టిఐ సెక్షన్ 7 (1) నిబంధన ప్రకారం 30 రోజుల్లో సమాచారం పంపక చట్టం ఉల్లంఘించే అధికారులకు చట్టపరిధిలో చర్యలు లేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంతో సహ చట్టం అమలయ్యే పరిస్థితి లేకుండా చట్టం నిర్వీర్యం కావడానికి కారణం అవుతుందన్నారు. రెవెన్యూ శాఖ భూముల రీ సర్వేలో ఇష్టార్జిన రికార్డులు మారుస్తున్నారని ఆర్టిఐ ద్వారా సమాచారం అడిగిన సమాధానం వచ్చే పరిస్థితులు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. సహ చట్టం పరిరక్షణ సమితి అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని సమాచార కమిషన్ లో కేసుల విచారణ మొదలు ఉత్తర్వులు వెలువడే వరకు పారదర్శకత లేదని కేసుల నమోదుకు ఫైల్ వెళ్లిన తరువాత ఎన్ని రోజుల్లో కేసు సంఖ్య కేటాయిస్తారు తెలియడం లేదని కొన్ని సందర్భాల్లో అసంబద్ధ కారణాలతో కేసు నమోదు చేయక కొన్ని నెలల తరువాత ఫైల్ త్రిప్పి పంపుతున్నారని వాపోయారు. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాల్లో ఈ ఫైలింగ్ ప్రక్రియ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు wp సివిల్ నెంబర్ 360 / 2021 నందు 2023 డిసెంబర్ నెల  గడువు విధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. కమిషన్ వెబ్సైట్లో కూడా కేసు లిస్ట్ పూర్తిస్థాయిలో ఉంచటం లేదన్నారు. కొన్ని కేసుల్లో సమాచారం ఇవ్వకపోయినా అసంబద్ధంగా సమాచారం ఇచ్చిన అధికారులపై కమిషన్ చర్యలు తీసుకోకుండా కేసులు మూసివేస్తున్నారని సమావేశానికి వచ్చిన ఆర్టిఐ కార్యకర్తలు వాపోయారు. వీటి పైన న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో సమాచార కమిషన్లు ఆర్టిఐ ఫిర్యాదు కేసు నమోదుకు మొదటి అప్పీలు లేదనే అసంబద్ధ కారణంతో అనేక కేసులు విచారణ జరపక త్రిప్పి పంపడంతో దీనిపై గౌరవ హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు wp 82 67 / 2023 నందు ఫిర్యాదు కేసుల్లో పెనాల్టీ విధించే అంశాన్ని పరిశీలించక త్రిప్పి పంపడం చట్టవిరుద్ధ చర్యగా కమిషన్ చర్యను తప్పు పట్టిందని తెలియజేశారు. సమాచార కమిషన్కు వెళ్లే కేసులు సకాలంలో కేసు నెంబరు కేటాయించి గతంలో లాగా ఎస్ఎంఎస్ ద్వారా తెలియపరచడం సమాచార కమిషనర్లు రోజువారి విచారణ కేసులు తగినంత సంఖ్యలో పెంచడంతోపాటు రోజువారీ కేసుల విచారణ జరపాలని విచారణ సమయంలో సమాచారం ఇవ్వడంలో అధికారుల ఆలస్యానికి కారణాలు నమోదు చేయటం నిర్ణీత 30 రోజుల్లో సమాచారం పంపక చట్టం ఉల్లంఘించిన సందర్భాల్లో సంబంధిత అధికారులపై చట్టపరమైన పెనాల్టీ చర్యలు తీసుకోవడం, సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో సమాచార కమిషన్ కార్యాలయంలో ఈ ఫైలింగ్ విధానం అమలు చేసి సమాచార కమిషన్ కార్యాలయం పాలన ప్రక్రియలో జవాబుదారీతనం తీసుకురావాలని అలా కాకుంటే రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కు సమాచార హక్కు కాగితాలకే పరిమితం అవుతుందన్నారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు తగిన చర్యలు తీసుకొని పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫ్ ఆర్టిఐ సాయికుమార్, సమాచార హక్కు చట్టం ప్రతినిధులు షేక్ నజీర్, సామాజిక కార్యకర్తలు టీ. రాజశేఖర్ రెడ్డి వివిధ జిల్లాల నుండి ఆర్టిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments