ఆర్ఎంపీలకు మెరుగైన శిక్షణ, గుర్తింపుకార్డులు ఇస్తాం.

 *ఆర్ఎంపీలకు మెరుగైన శిక్షణ, గుర్తింపుకార్డులు ఇస్తాం.*



*మొదటి వంద రోజుల్లో ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరిస్తాం.*


*మెరుగైన ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం.*

 

*ఆర్ఎంపీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలతో లోకేష్ భేటీ*


అమరావతి (ప్రజా అమరావతి): యువగళం పాదయాత్రలో ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశానని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వందరోజుల్లోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఆర్ఎంపీలు, మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మొదటి వందరోజుల్లోనే ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం. ఆర్ఎంపీలకు మెరుగైన శిక్షణ, గుర్తింపు కోసం గత టీడీపీ ప్రభుత్వం జీవో నెం.429 విడుదల చేస్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు.  జీవోను పునరుద్దరించడంతో పాటు మెడికల్ అసోసియేషన్ తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాం. మెడికల్ షాపులపై వేధింపులకు అడ్డుకట్టవేస్తాం. పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలు, మెడికల్ దుకాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య  కార్యక్రమాల్లో ఆర్ఎంపీలను భాగస్వాములను చేయాలని కోరారు. ఆర్ఎంపీలపై పోలీసుల వేధింపులను ఆపాలి. టీడీపీ ప్రభుత్వంలో జీవో 429 ద్వారా ఆర్ఎంపీలకు సాయం చేస్తే జగన్ ఆ జిఓ రద్దుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 429 జీవోను పునరుద్దరించాలి. మెడికల్ దుకాణాలపై పన్నులభారం తగ్గించాలి, మెడికల్ షాప్స్ అసోసియేషన్ కు భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 


మెరుగైన ఇసుక పాలసీ తెస్తాం


అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీతో ఇసుక అందుబాటులోకి తెస్తాం, అమరావతి పనులు కొనసాగించి అందరికీ చేతినిండా పనికల్పిస్తాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో భవన నిర్మాణ కార్మికులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే నేడు రూ.5వేల నుంచి రూ.7వేలకు పెరిగింది. రాష్ట్రంలో మొట్టమొదట ఆత్మహత్యలు ప్రారంభమైంది భవన నిర్మాణ కార్మికులతోనే. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి పురోహితుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు పాలనలో భవన నిర్మాణరంగం కార్మికుల కోసం చంద్రన్న బీమా అమలుచేశారు. నేడు ఆ పథకాన్ని నిలిపివేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీమా పథకం అమలుతోపాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తాం. భవిష్యత్ లో భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం రెట్టింపు చేస్తాం. భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ... ఇసుక కొరత వల్ల పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కరెంట్ ఛార్జీల భారం తగ్గించాలి. భవన నిర్మాణ కార్మికుల బోర్డు ద్వారా గతంలో మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించాలి. ఇళ్లులేని పేదలకు ఇంటిపట్టాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. 


సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి కల్పిస్తాం


ప్రజలు సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి కల్పించాలన్నదే టీడీపీ లక్ష్యమని  యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ హమాలీలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. దుగ్గిరాల పసుపు మార్గెట్ యార్డ్ ను ఆన్ లైన్ చేయడం వల్ల తమకు పనులు లేకుండా పోయాయని హామాలీలు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. జగన్ నిర్వాకం కారణంగా కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం 2వస్థానం,  రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలిచింది. టీడీపీ హయాంలో 120 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కొనసాగించి ప్రతి ఒక్కరికి చేతినిండా పనికల్పిస్తాం. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి చేస్తాం.  హామాలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ...దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పనులు లేవని, పనులు కల్పించి, సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. హామాలీల విశ్రాంతి కోసం భవన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.


Comments