ప్రాథమిక స్థాయి విద్యా ప్రమాణాలు పెరగాలి.




*ప్రాథమిక స్థాయి విద్యా ప్రమాణాలు పెరగాలి*




పార్వతీపురం, మార్చి 30 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం విస్తృతంగా పర్యటించారు. గుమ్మలక్ష్మీపురం జ.డ్పి ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించారు. గిరిశిఖర ప్రాంతాల్లో  సైతం పర్యటించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించారు. తోట గ్రామం నుంచి బైక్ పై వొండ్రుబంగి గ్రామానికి చేరుకొని ప్రాథమిక పాఠశాలను  పరిశీలించారు.  పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళ్ళి తల్లితండ్రులతో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల  విద్యార్థుల వర్క్ బుక్స్ పరిశీలించగా పూర్తిస్థాయిలో క్లాస్ లు పూర్తి కాకపోవడాన్ని గుర్తించారు. పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ విషయంలో సైతం లోపాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా విద్యా శాఖ అధికారికి, ప్రధాన ఉపాధ్యాయునికి డిజిటల్  క్లాస్ బోధించాలని అడిగారు. డిజిటల్ విధానంలో బోధించడంలో తటపటాయించడంతో ప్రశ్నించారు. బైజుస్, డిజిటల్ క్లాస్ రూమ్ నిర్వహినపై అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  ప్రభుత్వం వేల కోట్లు విద్యపై ఖర్చు చేస్తోందని, దాని ఫలితాలు అందుకోవడంలో సరైన శ్రద్ద ఉండాలని ఆయన అన్నారు. అధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు డిజిటల్ తరగతుల నిర్వహణపై అవగాహన లేకపోతే పర్యవేక్షణ ఏవిధంగా ఉంటుందని ప్రశ్నించారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి తమ పరిధిలో ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణించి పర్యవేక్షణ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ విద్యా విలువలుగల విద్యార్థులు తయారు కావాలని ఆయన ఆదేశించారు. ప్రాథమిక స్థాయి నుండి ప్రామాణిక విద్య అందించడంలో విద్యా శాఖ అధికారులు శ్రద్ద వహించాలని అన్నారు. ప్రాథమిక స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగు పడడం వల్ల విద్యార్థి మానసిక ఆలోచన మారుతుందన్నారు. అత్యుత్తమ విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.


అనంతరం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ స్పాట్ ను తనిఖీ చేశారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి మంజుల వీణ, జిల్లా విద్యాశాఖ అధికారి జి పగదాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments