ఆర్టీఈ ప్రకారం ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ.*ఆర్టీఈ ప్రకారం ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ*

ఈ నెల 31 వరకు గడువు పెంచిన సమగ్ర శిక్షా ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు .

అమరావతి (ప్రజా అమరావతి);

విద్యాహక్కు చట్టం- 2009, సెక్షన్ 12 (1)C ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు (అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ) బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం పొందడానికి ఈ నెల 25తో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగియనుండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఈ నెల 31వరకు గడువు పెంచినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  ఒక ప్రకటనలో తెలిపారు.  

విద్యార్థుల నివాసానికి  సమీపంలో ఉన్న  IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో   25% కోటా కింద ఉచిత ప్రవేశం పొందవచ్చని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు  తెలిపారు.  

శనివారం (23.3.24)నాటికి 47,082 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని, 36,457 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారని తెలిపారు.  ఆసక్తిగలవారు cse.ap.gov.in వెబ్ సైట్ లేదా మీ దగ్గరలోని సచివాలయం/ ఇంటర్నెట్/ మండల విద్యాశాఖాధికారి కార్యాలయం/ మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో  సమగ్ర శిక్షా  - పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 1800-4258-599 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. Comments