కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా.

 *కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన  సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా


*


రాజానగరం, మార్చి 29 (ప్రజా అమరావతి): తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా  స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలు,  స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి తగిన సూచనలు చెయ్యడం జరిగిందనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.



ఈ సందర్భంగా  సి ఈ వో ముఖేశ్ కుమార్ మీనా సూచనలు చేస్తూ, ఈ వి ఎమ్, ఇతర అనుబంధ యూనిట్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత తో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ముందుస్తు ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత  , జిల్లాలోనీ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల నుంచీ ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత నియోజక వర్గాలు నుంచీ నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తీసుకొని రావడం జరుగుతుందనీ అన్నారు. రిసేప్షన్ కేంద్రం వద్ద ఈ వి ఎమ్ లకు స్వీకరించిన అనంతరము ఒక నిర్ధిష్టమైన రూట్ లో ఆయా నియోజక వర్గాల కి చెందిన స్ట్రాంగ్ రూమ్ కి తరలించాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లాలో చేపట్టినా కార్యాచరణ ప్రణాళికలు , రూట్ మ్యాప్ పై సమగ్ర సమాచారం సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా కు వివరించడం జరిగింది.  ప్రతీ నియోజక వర్గం నుంచి ఈ వి ఎమ్ లు, ఇతర అనుబంధ యూనిట్స్ నన్నయ్య యూనివర్సిటీ కి తీసుకొని రావడం, వాటికి ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఆయా నియోజక వర్గ స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్స్ రిసెప్షన్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూం వరకు తీసుకుని వొచ్చే సిబ్బందిని ప్రత్యేక డ్రెస్ కలర్ కోడ్ ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు.  సి ఈ వో వారు సూచించిన సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని మాధవీలత తెలియ చేశారు


ఎస్పి పి. జగదీష్ పోలీసు పరంగా అన్ని విధాల భద్రతా చర్యలు తీసుకోవడం, జిల్లా ఎన్నికల అధికారి తో సమన్వయం చేసుకోవడం జరుగుతోందనీ తెలిపారు.


  కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్, రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి - ఎన్. తేజ్ భరత్, కొవ్వూరు  ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ , రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి,  గోపాలపురం ఆర్వో - కె ఎల్ శివజ్యోతి,  నిడదవోలు ఆర్వో - ఆర్ వి రమణా నాయక్ , ఎమ్. మాధురీ , కే ఆర్ ఆర్ సి - ఎస్.డి.సి. ఆర్. కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Comments