పరిహార చెల్లింపు జాప్యం పై ఫిర్యాదు.

 పరిహార చెల్లింపు జాప్యం పై  ఫిర్యాదు



 తెనాలి (ప్రజా అమరావతి);

దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగి 46 రోజులు గడుస్తున్నా రైతుల పడుతున్న ఆవేదనకు ముగింపు రాకపోవడం శోచనీయమని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య అన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు పసుపు రైతులకు జరుగుతున్న జాప్యంపై లిఖితపూర్వకమైన వినతిపత్రం సమర్పించారు. ప్రమాద ఘటనలో ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న సబ్ కలెక్టర్ తోచర్చీచారు.


అనంతరం  మాట్లాడుతూ ప్రభుత్వం జోక్యంచేసుకున్నా కూడా పసుపు రైతులకు పూర్తి ప్రమాదభీమ అందకపోవడం ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు తాత్సారం చేస్తుందో అంతుపట్టడం లేదన్నారు. రైతులు వెల్లడించిన లిస్టుకన్నా 30వేల అదనపు బస్తాలు లిస్టును ప్రభుత్వానికి  సమర్పించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సరైన పద్దతిలో ప్రమాద భీమా కట్టకపోవడం కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. 


ఆంద్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ   ఘటనకు బాద్యులైన యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలన్నారు.  అగ్నిప్రమాద ఘటనలో నష్టపోయిన రైతులపట్ల ప్రభుత్వం చొరవ తీసుకోకపోడం, ఘటనపై సబ్ కమిటీ రిపోర్ట్ ఇప్పటివరకూ ఇవ్వకపోవడం శోచనీయమని రైతు సంఘం జిల్లా కన్వీనర్ జొన్న శివశంకరరావు అన్నారు.  రైతులకు రూ 100 కోట్లు నష్టంవాటిల్లినా కమిటి నివేదిక పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయటం సోచనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రమాద బీమాతో పాటు విపత్తుల నిధి నుండి క్వింటాల్ కు రూ 13 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.



Comments