విశ్వసనీయతకు పట్టం కట్టండి - ఎమ్మెల్యే ఆర్కే...

 *విశ్వసనీయతకు పట్టం కట్టండి - ఎమ్మెల్యే ఆర్కే...*


తాడేపల్లి (ప్రజా అమరావతి);

*తాడేపల్లి అపర్ణ అపార్ట్మెంట్ నివాస ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల తదితరులు...*


ఈ రోజు ఉదయం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి తాడేపల్లి అపర్ణ అమరావతి వన్ బహుళ అంతస్తు సముదాయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే అపార్ట్మెంట్ వాసులతో సుదీర్ఘంగా ముచ్చటించారు...


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : 


2014 లో తాను శాసన సభ్యునిగా ఎన్నికైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, తిరిగి 2019 సంవత్సరంలో ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో ఎన్నిక అయ్యాక జరిగిన పలు అభివృద్ధి పనులను గూర్చి ఆయన వారికి వివరించారు...


ఒక నాయకుడు మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి పని చేసే విధానాన్ని ప్రజలందరూ పరిశీలించాలని ఆయన కోరారు...


నియోజవర్గంలో జరిగిన పలు ప్రైవేట్ అపార్ట్మెంట్ల నిర్మాణాలు విషయంలో తాను ఎటువంటి జోక్యం చేసుకోలేదని తెలిపారు...


మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగిందని... ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రాంతంలో అనేక రహదారుల నిర్మాణం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు....


తిరిగి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మిగిలిపోయిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు...


మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) మాత్రమే పరిష్కారమని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరొకసారి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కానున్న ఐదు సంవత్సరాలు కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని అన్నారు.  


ఉన్నత విద్యావంతులు అయిన అపార్ట్మెంట్ వాసులు రానున్న ఎన్నికల్లో విశ్వసనీయతతో, విజ్ఞతతో ఆలోచించి ఎన్నుకోవాలని ఆయన వారికి విన్నవించారు.

Comments