రాజమహేంద్రవరం రూరల్ (ప్రజా అమరావతి);
రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ అనుబంధ విభాగాల పరిశీలనా
ఆర్వో తేజ్ భరత్
రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి వారీ కార్యాలయములో ప్రతిపాదించిన ఎన్నికల పర్యవేక్షణ కేంద్రాలు మరియు పోస్టల్ వోటింగ్ కేంద్రంను పరిశీలించడం జరిగిందని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు.
గురువారం ఉదయం తహశీల్దార్ వారి కార్యాలయము , వై టి సి ప్రాంగణం నందు జాయింట్ కలెక్టర్ సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి అనుబంధ విభాగాలను పరిశీలించడం జరిగిందీ..
ఈ సందర్భం గా రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ పరిశీలిస్తూ , రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఎన్నికల సిబ్బంది విధులను నిర్వర్తించడం కోసం అందుబాటులోకి సెక్షన్లు గుర్తించడం జరిగిందన్నారు. అందరూ కూడా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహించడం, జవాబు దారీతనంతో కూడి విధులను నిర్వర్తించడం ప్రారంభించాలని స్పష్టంగా చేశారు.
ఎన్నికల నిమిత్తం సమావేశాలు నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ రూమ్ ను , సి విజిల్ (cVIGIL), ఎమ్ సి సి, సువిధ, తదితర కేంద్రాలను పరిశీలించడమైన దన్నారు.
ఈ సమావేశంలో రూరల్ తహసీల్దార్ సహాయ రిటర్నింగ్ అధికారు లు వై వికే అప్పారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment