పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఆహ్వానం. *వైసీపీ దిగిపోతేనే ప్రజలు సుఖంగా ఉంటారు : టీడీపీ అధినేత చంద్రబాబు*


*పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఆహ్వానం*కుప్పం (ప్రజా అమరావతి):- చంద్రబాబు నాయుడు సమక్షంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. కేవీఆర్ కల్యాణ మండపంలో మంగళవారం వీరంతా చేరగా కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు 'మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే రాష్ట్రం నిలుస్తుంది. వైసీపీకి ఓటు వేస్తే ఏమవుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వైసీపీ దిగిపోతేనే ప్రజల సుఖంగా ఉంటారు. వైసీపీ ఓడిపోవడం ఖాయం. మీ అభివృద్ధి సంక్షేమాన్ని రాజకీయాలే నిర్ణయిస్తాయి...దానికి తగ్గ నాయకులను ఎన్నుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఒక్క ఛాన్స్ తో జగన్ ప్రజలకు మరణ శాసనం రాశారు.' అని అన్నారు. చేరిన వారిలో పీఈఎస్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఆశాలత, రిటైర్డ్ సీఐ రాజేంద్ర, శాంతిపురం నాయకులు ప్రకాష్ స్వామి,  జరుగు ఎంపీటీసీ అభ్యర్థి జనార్ధన్, హేమాద్రి, కొత్తపేట వాసు, కొత్తపేట్ నాగరాజు,  డా.సోహైల్, సవిత, మానవ హక్కుల సంఘం నాయకులు జలపతి, భాస్కర్, దుబాయ్ గౌడ్, తదితరులు ఉన్నారు.

Comments