ఓటమి భయంతోనే మంగళగిరిలో నారా లోకేష్ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు - ఎమ్మెల్యే ఆర్కే..

 *ఓటమి భయంతోనే మంగళగిరిలో నారా లోకేష్ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు - ఎమ్మెల్యే ఆర్కే..


.*

మంగళగిరి (ప్రజా అమరావతి);

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే...*


*నారా లోకేష్ కు జరిగిన ఘటనకు సంబంధం లేకపోతే బీసీలకు మరియు మురుగుడు లావణ్యకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్...*


*మంగళగిరిలో బీసీలను భయభ్రాంతులకు గురిచేయాలన్న నారా లోకేష్ ఎత్తుగడలు పనిచేయవు....*


*బీసీలంతా ఇప్పటికే ఒక తాటిపైకి చేరి బిసి మహిళ అయిన మురుగుడు లావణ్యను గెలిపించేందుకు సిద్ధమయ్యారు..*


నిన్న రాత్రి నగరపాలక సంస్థ పరిధి బ్రహ్మానందపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి వాహన చోదకుడు మీద దాడి చేసిన ఘటనపై ఎమ్మెల్యే ఆర్కే నిప్పులు చేరిగారు.


మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నారా లోకేష్ ఓటమి భయంతోనే ఇటువంటి హీంసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నాడని...


ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మంగళగిరిలో హింసలు చెలరేగే విధంగా నారా లోకేష్ కుటీల యత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు....


తనకు ఓటమి తథ్యం అని గ్రహించిన లోకేష్ మరోసారి ఇటువంటి ఘటనలు ప్రేరేపిస్తే దాని పరిణామం తీవ్రంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు....


ఇప్పటికే బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి బీసీ మహిళ అయిన మురుగుడు లావణ్యను గెలిపించేందుకు సిద్ధమయ్యారని, మరికొన్ని రోజుల్లోనే నారా లోకేష్ కు తగిన బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు...


జరిగిన ఘటనకు నారా లోకేష్ కు సంబంధం లేకపోతే బేషరతుగా బీసీలకు మరియు మురుగుడు లావణ్య కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments