కొండ, రైల్వేస్థలాల్లో నివాసితులకు శాశ్వత పట్టాలిస్తాం!

 *కొండ, రైల్వేస్థలాల్లో నివాసితులకు శాశ్వత పట్టాలిస్తాం!*



*పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్, ఆర్కే!*


*తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్*


తాడేపల్లి (ప్రజా అమరావతి): వచ్చే ఎన్నికల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ పోరంబోకు, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేసి, గౌరవంగా బట్టలుపెట్టి మరీ పట్టాలిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలోని దళితవాడ, ముగ్గురోడ్డు, హోసన్నామందిరం ప్రాంతాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... పట్టాల విషయంలో హామీ పత్రంపై సంతకం చేసి ఇస్తాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లి  అడ్డుకుంటే చీపుర్లతో తిరగబడాలి. పేదరికం లేని మంగళగిరే నా లక్ష్యం. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్లు, కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. 20వేల పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. రైల్వే మంత్రి కూడా మనకు అనుకూలంగా ఉండేవారే వస్తారు. రైల్వే భూముల విషయంలో కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తన ప్యాలస్ వద్ద పేదలు ఉండటానికి అర్హత లేదని ఇళ్లు కూల్చిన పెత్తందారుడు జగన్, వారి పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేక గ్రామాల్లో పేదల ఇళ్లు కూల్చేశారు, ఇటువంటి వారు పేదల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటాం, శాంతిభద్రతలను కాపాడతాం. ప్రతిపక్షంలో ఉండగానే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని పనులు చేస్తామో మీరే చూస్తారు. వచ్చే ఎన్నికల్లో 53వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 


*ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నా అభివృద్ధి శూన్యం*


ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నివాసం ఉంటున్నా తాడేపల్లి  అభివృద్ధికి నోచుకోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాను. చిరువ్యాపారులకు తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు, పెళ్లికానుకలు అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రం ద్వారా సేవలు అందించాం. మంత్రిగా పనిచేసే సమయంలో మంగళగిరిలో ఐటీ కంపెనీలు తీసుకువచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నా సొంత నిధులతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ఆళ్ల రామకృష్ణారెడ్డిని రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఉచిత ఇసుక విధానం రద్దుచేయడంతో 5 రెట్లు ధర పెరిగింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. మరోవైపు కల్తీమద్యంతో పేదప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు మంగళగిరికి కొత్తగా చెల్లెమ్మను తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కరకట్ట కమల్ హాసన్ షర్మిల పార్టీలోకి వెళ్లి మళ్లీ వైసీపీలోకి వచ్చారు. జగన్, ఆర్కే మధ్య ఏం డీల్ కుదిరింది? సీఎం నివసిస్తున్న తాడేపల్లిలోనే అభివృద్ధి లేదు. ఇప్పటం, ఆత్మకూరు, తాడేపల్లిలో అనేక ఇళ్లు కూల్చారని దుయ్యబట్టారు.


*రాజకీయాల్లో లోకేష్ నూతన ఒరవడి*


మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించడానికి నారా లోకేష్ వచ్చారు. ప్రతి వార్డుకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. అమరావతి కోసం 33వేల ఎకరాలు చంద్రబాబును నమ్మి రైతులు ఇచ్చారు. జగన్ రెడ్డి వచ్చి మూడు ముక్కలాటతో ప్రజల జీవితాలను ముక్కలుముక్కలు చేశారు. యూ-1జోన్ పేరుతో 175 ఎకరాల ప్రజలను మోసగించారు. సొంత పార్టీ వారిని కూడా ఇబ్బంది పెట్టారు. లోకేష్ గారిని గెలిపించడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి.  రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. కొండ, కాలువ, అటవీ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కృష్ణానది పక్కనే ఉన్నా తాగునీటి సమస్య ఉందని చెప్పారు. అంజిరెడ్డి కాలనీ వాసులు విజయవాడ పట్టణంలోకి వెళ్లేందుకు కాలువ మీద వంతెన నిర్మించాలని కోరగా, అధికారంలోకి వచ్చాక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురోడు రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా... మధ్యలో నమాజ్ వినిపించడంతో నారా లోకేష్ ఐదు నిమిషాల పాటు కార్యక్రమాన్ని నిలిపివేశారు. నమాజ్ అనంతరం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.


Comments