రాష్ట్రానికి చెందిన కేంద్ర పరిశీలకులకు రాష్ట్ర సచివాలయంలో శిక్షణ.

 *రాష్ట్రానికి చెందిన కేంద్ర పరిశీలకులకు రాష్ట్ర సచివాలయంలో శిక్షణ



అమరావతి, మార్చి 11 (ప్రజా అమరావతి): త్వరలో ఎన్నికల షెడ్యూలు  ప్రకటించనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. మరియు ఐ.ఆర్.ఎస్. అధికారులు వర్చ్యుల్ మరియు ఫిజికల్ విదానంలో పాల్గొని శిక్షణ పొందారు. సోమవారం న్యూ ఢిల్లీ విగ్యాన్ భవన్ లో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి   శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో 23 మంది ఐ.ఏ.ఎస్. మరియు 13 మంది ఐ.పి.ఎస్. అధికారులు రాష్ట్ర సచివాలయం నుండి వర్చ్యుల్ విదానంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన మరో 16 మంది ఐ.ఏ.ఎస్. మరియు 14 మంది ఐ.పి.ఎస్. అధికారులు నేరుగా ఢిల్లీలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.   


త్వరలో దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు దాదాపు 2150 సీనియర్ ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఆర్.ఎస్. అధికారులను సాధారణ, పోలీస్ మరియు వ్యయ పరిశీలకులుగా నియమించడం జరిగింది.   ఈ కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధులు, అనుసరించాల్సిన విధి విదానాలపై సమగ్ర అవగాహన కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది కేంద్ర పరిశీలకులు వర్చ్యుల్ మరియు ఫిజికల్ విదానంలో పాల్గొని శిక్షణ పొందారు. 


న్యూ ఢిల్లీ విగ్యాన్ భవన్ లో భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అధ్యక్షత జరిగిన ఈ శిక్షణా కార్యక్రమం డైరెక్టర్ (ఎక్సపెండిచర్) పంకజ్ శ్రీవాత్సవ్ స్వాగతోపన్యాసం తో ప్రారంభం అయి  భారత ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ రాజీవ్ కుమార్ సందేశంతో ముగిసింది.   ఈ సందర్బంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ రాజీవ్ కుమార్ కేంద్ర పరిశీలకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయ బద్దంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావులేకుండా నిర్వహించడంలో కేంద్ర పరిశీలకులు తమ పరిధిలో కీలక పాత్ర  పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎటు వంటి సమస్యాత్మకమై విషయం ఎదురైనా, తక్షణ పరిష్కారానికి వెంటనే ఎన్నికల సంఘానికి నివేదించాలన్నారు. కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధి విధానాలపై సమగ్రమైన అవగాహన పెంచుకుని ఎన్నికలను ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. 


అదే విధంగా  ఈ  శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియలోని పలు కీలక అంశాలకు సంబందించి సంబందిత అధికారులు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కేంద్ర పరిశీలకులకు వివరించారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (డి.ఇ.ఓ.) హిర్దేష్ కుమార్ ఎన్నికల పరిశీలన, ప్రణాళిక, ఓటర్ల జాబితా, పోలింగ్ సిబ్బంది శిక్షణ అంశాలను, డి.ఇ.ఓ. అజయ్ భాడో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల వ్యయ పర్యవేక్షణా అంశాలను, డి.ఇ.ఓ. ఆర్కే గుప్తా చట్టపరమైన నిబంధనలు, చట్టబద్దమైన ఆదేశాలను మరియు మరో డి.ఇ.ఓ. నితేష్ వ్యాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వివిప్యాట్ల నిర్వహణ అంశాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించడంతో ఉదయం సెషన్ ముగిసింది. స్వల్ప విరామం తదుపరి ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (ఐటి అప్లికేషన్సు)   నీతా వర్మ ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న పలు ఐటి అప్లికేషన్లను, డైరెక్టర్ జనరల్ (మీడియా)  నారాయణన్ ఎన్నికల సమయంలో మీడియా, సోషల్ మీడియా పర్యవేక్షణా అంశాలను కేంద్ర పరిశీలకులకు వివరించారు. 


రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తో పాటు అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర పరిశీలకులుగా  నియమించబడిన 23 మంది ఐఏఎస్, 13 మంది ఐపీఎస్  అధికారులు మరియు జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు,  డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు,  అసిస్టెంట్ సీఈవో లు  ఎస్ ఆంజనేయులు, పి.తాతబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.

                                                                                                                                                                                                           

Comments