జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు.



*జగన్ రెడ్డి నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు


*

*బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై లేదా?*

*ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు రూ. 1,500 కోట్లు చెల్లించకపోవడం పేదల ఆరోగ్యంతో చెలగాటమాడటం కాదా?

-ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.

అమరావతి (ప్రజా అమరావతి);

వైద్యో నారాయణో హరి అనే నానుడిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద జగన్ రెడ్డి ఒక్కరే. ఆయన మాటలు కోటలు దాటతాయి. చేతలు మాత్రం చేతులు కూడా దాటవు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య విపత్తు తలెత్తింది. దేవుని దయ, పేదల కోసమే నేను వచ్చానని కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆరోగ్య సురక్ష కింద ఇంటింటికి వైద్యం కేవలం ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోయింది. పీహెచ్ సీల్లో కనీసం సిబ్బంది లేదు. వైద్యులు లేరు. జ్వరం బిళ్లలు కూడా దొరకని పరిస్థితి. టీడీపీ హయాంలో నెలకొల్పిన డయాలసిస్ కేంద్రాలను కూడా మూసేశారంటే వైద్యఆరోగ్య శాఖ ఎలా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. 

ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్యం అంటూ సాక్షిలో భారీ ప్రకటనలకు వందలకోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన జగన్ రెడ్డి ....పథకం ద్వారా  ఒక్క పేదకైనా ఉచిత వైద్యం అందించారా? పేదల ఆరోగ్యంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 1500 కోట్లు ఎందుకు చెల్లించడంలేదు? బిల్లులు రాక వైద్యం చేసేందుకు ఆస్పత్రులు ముందుకు రాకపోవడంతో పేదల ప్రాణాలు పోతున్నాయి.

 ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడానికి మనసురాని జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకు మాత్రం అప్పులు తెచ్చి మరీ కోట్ల రూపాయిల బిల్లులు చెల్లించి కమీషన్లు దండుకుంటున్నాడు. ఎలక్షన్ కోడ్ కు 10 రోజుల ముందు తన అస్మదీయ కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి అక్షరాలా రూ. 6,500 కోట్లు చెల్లించి కమీషన్లు అందుకున్నాడు. బిల్లుల చెల్లింపు కోసం  ఏకంగా రూ. 4,700 కోట్లు అప్పులు తెచ్చింది వాస్తవం కాదా? కమీషన్ల కోసం కక్కుర్తి పడి పేదవారి ప్రాణాలు తీసే హక్కు మీకెక్కడిది? వైద్యం కోసం అప్పులు చేస్తున్న పేదలు అవి తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.  పేదలు చచ్చిపోయినా పర్లేదు తాడేపల్లి ప్యాలెస్ ఖజానా మాత్రం నిండాలి. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 15వ ఆర్థిక సంఘం 2023-24 కింద రూ. 514 కోట్లు నిధులిస్తే  కేవలం రూ. 25 కోట్లు మాత్రమే విడుదల చేసి  మిగిలిన సొమ్ము దారి మళ్లించేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి? అభయహస్తం నిధులు  రూ. 2118 కోట్లు జగన్ రెడ్డి దారి మళ్లించేసింది నిజం కాదా? గతంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తే జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో ప్రచారమే తప్పా చేసిందేమీ లేదు. ఈ ఐదేళ్లలో పేదలకు చేసిన ఒక్క మంచి పనైనా చేశానని జగన్ రెడ్డి చెప్పగలరా? 

మహిళలకు ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ అమలు చేస్తే జగన్ రద్దు చేశాడు. ప్రసవానంతరం ప్రతి తల్లి బిడ్డ క్షేమంగా ఇళ్లకు చేరాలనే లక్ష్యంతో చంద్రన్న తెచ్చిన  తెచ్చిన తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ రద్దు చేశాడు. పసి పిల్లలకు తల్లి ఒడిలా ఉండేలా ఇచ్చిన ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఆపేశాడు. ఈ ఐ టెస్టుల్ని నిలిపివేశాడు. ఉచిత వైద్యాన్ని రద్దు చేశాడు. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ఉచితంగా నిర్వహించే కంటి పరీక్షల్ని రద్దు చేశాడు. అంబులెన్సుల నిర్వహణను తన అవినీతి భాగస్వామి విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి కట్టబెట్టి, రూ. 307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. వాహనాల నిర్వహణను మాత్రం  గాలికొదిలేశాడు. గిరిజనులకు వైద్య సేవలు ఆలస్యం కాకుండా ఉండేందుకు తెచ్చిన ఫీడర్ అంబులెన్సులు ఐదేళ్లుగా కదిలిందేలేదు. పేదలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి రద్దు చేశారు. వచ్చే విరాళాలను స్వాహా చేస్తున్నారు. ప్రమాద వశాత్తు మరణించిన వారికి అందించే చంద్రన్న బీమా, మట్టి ఖర్చులను రద్దు చేశారు.చివరకు కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన నిధులనూ స్వాహా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల కరోనా సమయంలో పేదలకు వైద్యం దూరమైంది. అంబులెన్సులు అందక వేలాది మంది ప్రాణాలు పోయాయి.  బ్లీచింగ్ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. కరోనా సహాయ నిధికి వచ్చిన నిధుల్ని కూడా సద్వినియోగం చేయకుండా దోచుకున్నారు. 



Comments