ప్రజల ఆశీర్వాదబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన పార్టీలను విడదీయడం వైసీపీ తరం కాదు.

అమరావతి (ప్రజా అమరావతి);


*17 న చిలకలూరిపేటలో నభూతో అనేలా భారీ బహిరంగసభ* 


*చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 10లక్షల మంది సమక్షంలో భారీ సభ*


*చంద్రబాబు : పవన్ కల్యాణ్ లు సభ సాక్షిగా ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నారు*


*ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను అధినేతలు ప్రకటిస్తారు*


*సభకు టీడీపీ శ్రేణులు, జనసైనికులు,వీరమహిళలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి*


*ప్రజల ఆశీర్వాదబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన పార్టీలను విడదీయడం వైసీపీ తరం కాదు*


*ఇరుపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు ఫోన్లు చేసి కేసుల పేరుతో వేధిస్తున్న పోలీస్ యంత్రాంగానికి సమాధానం చెప్పడానికి న్యాయనిపుణులతో 73062 99999 నంబర్ తో టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్* 


         -*కింజరాపు అచ్చెన్నాయుడు,  నాదెండ్ల మనోహర్*


రాజకీయపార్టీలు సాధారణంగా అధికారం కోసమే పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తాయని, కానీ ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా తెలుగుదేశం-జనసేన పార్టీలు మొదటిసారి ఒక దుర్మార్గుడి పాలనకు వ్యతిరేకంగా, ప్రజలకోసం.. రాష్ట్రం కోసం ఒక్కటయ్యాయని, వైసీపీ బారినించి రాష్ట్రాన్ని కాపాడి, ప్రజలకు అండగా నిలిచి, వారికి మంచి భవిష్యత్ అందించాలనే సదుద్దేశంతోనే రెండుపార్టీలు  పొత్తుపెట్టుకోవడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయు డు తెలిపారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన జనసేన నాయకులు, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే మీకోసం...!


“ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు 99 స్థానాలకు తమతమ పార్టీల అభ్య ర్థుల్ని ప్రకటించాయి. రెండుపార్టీల నుంచి ఎప్పుడైతే 99మంది అభ్యర్థుల్ని ప్రకటించామో, అప్పటినుంచే వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. దాంతో ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, రెండుపార్టీల మధ్య చిచ్చుపెట్టడాని కి ప్రయత్నిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో, వారిబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేనను విడదీయడం వైసీపీతరం కాదు. రెండు పార్టీలు తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాయి. అనంతరం టీడీపీ మంగళవారం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన జయహో బీసీ డిక్లరేషన్ సభకు ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు హాజర య్యారు. ఆ సభకూడా భారీస్థాయిలో విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం బలహీనవర్గాలు గుర్తుపెట్టుకునేలా బీసీ డిక్లరేషన్ సభ జరిగింది. 


*టీడీపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగసభ* *ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను, ఉమ్మడి మేనిఫెస్టోను సభలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు*


ఇరుపార్టీల అధినేతలైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు నిన్న సమావేశమైన సందర్భంగా ఇరుపార్టీలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాల నే నిర్ణయానికి వచ్చారు. ఆ బహిరంగ  సభ ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించబోతున్నాం. ఆ సభ  భారీస్థాయిలో కనీవినీ ఎరుగని విధంగా నిర్వ హించాలని  ఇరుపార్టీలు నిర్ణయించాయి. చిలకలూరిపేట సభ మరో చారిత్రాత్మక  ఘట్టానికి వేదిక కానుందని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఆ  సభలో ఇరుపార్టీ ల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సూపర్ సిక్స్ పథకాలకు సంబం ధించి కీలక ప్రకటన చేయబోతున్నాం. అలానే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫె స్టో కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మేనిఫెస్టోను ప్రకటిస్తారు. సభకు తెలుగుదేశం-జనసేన నుంచి సుమారు 10 లక్షలమంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారు. సభకు తరలివచ్చే జనప్రభంజనంతో నభూతో అన్నరీతిలో రెండుపార్టీల బహిరంగ సభ విజయవం తం అవుతుంది.  ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని, రెండుపార్టీల మధ్య చోటుచేసుకొనే చారిత్రక ఘట్టాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి జనసేన కూడా పనిచేస్తోంది.

 

*చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని కోరతాం.* *గతంలో మాదిరే ఆయన నిరాకరిస్తే న్యాయపరంగా ఆయనపై చర్యలు తీసుకుంటాం*

                                                                                                                                                                                           చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని కోరతాం. ఈరోజే ఆయనకు లేఖద్వారా  ఇరుపార్టీల సభకు ఎన్నిబస్సులు కావాలో తెలియచేస్తాం. మేం కోరిన విధంగా గతంలో మాదిరి బస్సులు కేటాయించకపోతే, చాలా తీవ్రంగా స్పందిస్తాం. అవసరమైతే ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. జగన్ ప్రభుత్వంలో తప్పులు చేస్తున్న అధికారుల మాదిరే ఆర్టీసీఎండీగా ఉన్న అధికారి కూడా తగినమూల్యం చెల్లించుకుంటారు. రాజకీయపార్టీలు సభలు పెట్టుకోవడం.. నిబంధనలప్రకారం డబ్బులు చెల్లిస్తే బస్సులు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీనే. కానీ జగన్ సర్కార్ ఏర్పడ్డాకే, ఆర్టీసీ యాజమాన్యం కొత్తపోకడలు పోతోంది. 

 

*మాజీమంత్రి నారాయణ ఇంట్లో సోదాలపేరుతో పోలీసులు బందిపోట్ల కంటే దారుణంగా వ్యవహరించారు* *టీడీపీ-జనసేన సోషల్ మీడియా సిబ్బందిని భయపెట్టడానికి పోలీసులు చేసే ఫోన్లకు సమాధానంగా టీడీపీ లీగల్ టీమ్ తో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.*  *73062 99999 నంబర్ కు ఫోన్  చేస్తే అందుబాటులో ఉన్న న్యాయసిబ్బంది కార్యకర్తలకు తగిన సహాయసహకారం అందిస్తారు* 


పోలీసులు మాజీమంత్రి నారాయణ ఇంటిపై పడి సోదాల పేరుతో బందిపోట్లకంటే దారుణంగా వ్యవహరించారు. అలానే పలుచోట్ల జనసేన నాయకుల  ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. సైకో ముఖ్యమంత్రి చెప్పాడని పోలీసులు గుడ్డెద్దు చేలో పడినట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ శాఖ తీరుపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని, తప్పుచేసే పోలీసు సిబ్బందిని శిక్షించాలనే నిర్ణయానికి వచ్చాం. టీడీపీ – జనసేన సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా పోలీసులు ఫోన్లు చేసి వేధిస్తు న్నారు. పోలీస్ స్టేషన్లకు రావాలని.. మీపై కేసులు నమోదు అయ్యాయని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు. అలాంటి బెదిరింపు కాల్స్ కు స్పందించాల్సిన అవ సరం లేదని, టీడీపీ-జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల సిబ్బందిగానీ, ఇరుపార్టీల కార్యకర్తలు గానీ దేనికీ భయపడాల్సిన అవసరంలేదు. పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తే, ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలకు అవసరమైన సమాచారం, సహాయం చేయడానికి మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం.  పోలీసులనుంచి వచ్చే కాల్స్ యొక్క సమాచారాన్ని టీడీపీ కాల్ సెంటర్ నెంబర్ : *73062 99999* కు తెలియ చేయాలి. కాల్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే అందుబాటులో ఉన్న న్యాయసేవా విభాగం, లీగల్ టీమ్ కార్యకర్తలకు తగిన సహాయసహకారాలు అందిస్తుంది.  ఈ విషయాన్ని టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు గమనించాలి. 


*విలేకరుల ప్రశ్నలకు అచ్చెన్నాయుడి స్పందన...!*


*పార్టీలతో సంబంధం లేకుండానే వై.ఎస్ కుటుంబానికి బీసీలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది.* *10శాతం రిజర్వేషన్లకు కోతపెట్టడం.. రూ.75వేలకోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు...56 కార్పొరేషన్లతో కనీసం 50మందికి కూడా రుణాలివ్వని బీసీ వ్యతిరేక పాలనపై జగన్ వాస్తవాలు మాట్లాడాలి*


 చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినందునే వెళ్తున్నారు. కలిసివస్తే బీజేపీతో ముందుకు సాగడానికి అభ్యంతరం లేదు. చిలక లూరిపేట సభ నిర్వహణ గురించి చెప్పడానికే నేడు మనోహర్ , నేను మీడియా ముందుకు వచ్చాం. ఆర్టీసీ ఎండీని హెచ్చరిస్తున్నాం, ఆయన నిబంధనల ప్రకారం పనిచేయాలనే కోరుతున్నాం. అవసరమైతే బస్సుల కేటాయింపు వ్యవహారంపై పక్షపాతం చూపుతున్నారని ఎన్నికల కమిషన్ కు కూడా లేఖ రాస్తాం. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి, వైసీపీనేతలకు లేదు. వై.ఎస్ కుటుంబానికి బీసీలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. రూ.75వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులు మళ్లించారా..లేదా చెప్పండి. బీసీ రిజర్వేషన్లు జగన్ రెడ్డి 24శాతానికి ఎందుకు తగ్గించారు? ఎన్టీఆర్ దగ్గర నుంచీ తన తండ్రితో సహా అందరుముఖ్యమంత్రులు బీసీల రిజర్వేషన్లు 34 శాతం అమలుచేస్తే, జగన్ రెడ్డి ఎందుకు కోతపెట్టాడు? 16,800పదవులు బీసీవర్గాలకు దూరం చేశాడు. టీడీపీప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా 4లక్షల మంది బీసీలకు రూ.3,700 కోట్ల రుణం ఇచ్చింది.  ఈ ముఖ్యమంత్రి 56 కార్పొరేషన్లు పెట్టాను అంటాడు... కనీసం 50 మందికి రుణాలిచ్చాడా?  ఇచ్చినట్టు నిరూపిస్తే ఇక నేను మాట్లాడటం ఆపేస్తాను. ఇదేనా ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమ? ప్రేమంటే ఏదైనా వారికి కొత్తగా, అదనంగా చేయడం, అంతేగానీ అందరికీ చేసినట్టు చేయడం కా దు.” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 

          *---------------------------------------------------------------------------------------*


*17న నిర్వహించే టీడీపీ-జనసేన భారీ బహిరంగసభ విజయవంతం చేయడానికి ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి :నాదెండ్ల మనోహర్ (జనసేన పీఏసీ ఛైర్మన్)*


టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం కోసం... ప్రజల కోసమే. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భరోసా నింపడానికి, ప్రజల్ని వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి బయటపడవేయడానికి టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగుతు న్నాయి. ఈ నెల 17న ఇరుపార్టీలు నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగసభ నిజంగా చరిత్ర సృష్టిస్తుంది. జనసైనికులు, వీరమహిళలు ఏవిధంగా ఈ సభను విజయవంతం చేయాలో ఆలోచించుకొని, ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ప్రతి గ్రామం నుంచి ప్రజలు సభకు తరలివచ్చేలా జనసైనికులు పని చేయాలి.

 

*టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే మేలు గురించి పవన్ కల్యాణ్ సభలో ప్రకటిస్తారు*

                                                                                                                                                                                                                   టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతికుటుంబానికి జరిగే మేలు ఏమిటనేది చిలకలూరిపేట సభలో పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు. అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన శ్రేణులు ముందుకు సాగినట్టే, చిలకలూ రి పేట సభ విజయవంతం కావడానికి కలిసి అడుగేయాలి.


*తాడేపల్లి గూడెం సభను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను జనసేన నాయకత్వం బలంగా అడ్డుకున్నందునే సభ విజయవంతమైంది*  *పోలీసులు గోడలుదూకి మరీ జనసేన కార్యాలయంలోకి చొరబడి, భద్రతాసిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు*


జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని ఇబ్బందిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోంది. తాడేపల్లిగూడెం సభను ప్లాప్ చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి నాయకత్వంలోనే వ్యవస్థలు పనిచేశాయి. ఆ రోజు జనసేన నాయకత్వం ధృఢంగా, బలంగా నిలబడబట్టే సభ విజయవంతమైంది. నిన్నరాత్రి జనసేన కార్యాలయంలో సోదాల పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతి కలిగిం చింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉన్న అపార్ట్ మెంట్ లో జనసేన పార్టీ భద్రతా సిబ్బంది...మీడియా విభాగం వారే ఉంటున్నారు. అలాంటి అపార్ట్ మెంట్ లోకి చొరబడటానికి పోలీసులు గోడలు దూకిమరీ రావడం నిజంగా సిగ్గుచేటు. అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి మరీలోపలికి వెళ్లి సోదాలు జరిపారు. అలాంటి ఆలోచనలు పోలీసులకు ఎందుకు వచ్చాయో, ఎవరి ఆదేశాలతో వారు అలా పరిధిదాటి చట్టవిరుద్ధంగా వ్యవహరించారో సమాధానం చెప్పాలి. పోలీస్ యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతల్ని భయపెట్టేందుకు వినియోగిస్తు న్న ముఖ్యమంత్రి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు జరిపిన అకారణ సోదాలతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు కొంత భయాందోళనకు గురయ్యాయి. మీడియా వారు వచ్చేలోపే తనిఖీలకోసం వచ్చిన పోలీసులు వెళ్లిపోయారు. కానీ దాదాపు 45 నిమిషాలపాటు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. ఈ ఘటన ను టీడీపీ తరపున ఖండించడాన్ని స్వాగతిస్తున్నాం. మాకు, మా పార్టీకి, మా శ్రేణులకు అండగా నిలిచిన టీడీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు.

 

*చంద్రబాబుతో జరిపిన చర్చల వివరాలు పవన్ కల్యాణ్ సభలో ప్రకటిస్తారు*

                                                                                                                                                                                           జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై తీసుకున్న నిర్ణయాలను చిలకలూరిపేట సభలో ప్రకటిస్తారు. భారీ బహిరంగసభ లో ఇరుపార్టీ శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య ప్రకటిస్తే ఆయనకు కూడా సంతోషంగా ఉంటుంది. 

                                                                                                                                                                                                        *విలేకరుల ప్రశ్నలకు మనోహర్ స్పందన...!*

*జగన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపుల్లో భాగమే జనసేన కార్యాలయంలోకి పోలీసులు చొరబడటం*


పవన్ కల్యాణ్  ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఇరుపార్టీల అధినేతలు బీజేపీ పెద్దలతో చర్చించి, ఒక అభిప్రాయానికి వచ్చాక వారే స్వయంగా మీడియాకు వివరాలు తెలియచేస్తారు. బీజేపీతో పొత్తు చర్చలు సానుకూలంగానే  ఉంటాయ ని భావిస్తున్నాం. జనసేన కార్యాలయంలో ఏదో విధంగా తనిఖీలుచేసి, ఏదో ఒక వస్తువు పెట్టి,  ఏవో ఆధారాలు దొరికాయని హడావుడి చేసే క్రమంలో ఆఫీసులోని కంప్యూటర్ని, హార్ట్ డిస్క్ ను తీసుకునే ప్రయత్నం చేశారు. దానిలో మీడియా డేటా మాత్రమే ఉంది. జరిగిన ఘటనపై కచ్చితంగా మేం న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ కక్ష సాధింపులకోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పరిధి దాటి  వ్యవహరిస్తున్నారు.” అని మనోహర్ పేర్కొన్నారు.

Comments