టీడీపీ పేదల పక్షం..వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పక్షం.


*టీడీపీ పేదల పక్షం..వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పక్షం*



*చట్టపరంగా కులగణన...దామాషా ప్రకారం నిధులు ఖర్చు* 


*సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం*


*చివరి ఆయకట్టుకూ సాగునీరందించి వలసలు నివారిస్తాం*


*కురబ, బుడగజంగాలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి* 


*సీమ ప్రాజెక్టులకు మేం రూ.12వేల కోట్లు ఖర్చు... జగన్ చేసిన ఖర్చు రూ.2వేల కోట్లు* 


*ఎంపీటిసీకి ఎంపీ సీటు ఇచ్చిన చరిత్ర టీడీపీది*


*ఎమ్మిగనూరుకు టెక్స్ టైల్ పార్కు తీసుకొస్తా* 


*కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు* 


ఎమ్మిగనూరు (ప్రజా అమరావతి):- ప్రజల మద్ధతు కోసమే ప్రజాగళం. ఎన్నికల వేడి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. వైసీపీ ఓడించాలన్న కసి మీలో ఉంది. మీరు పడిన బాధలకు విముక్తి దొరుకుతుంది.

బీవీ మోహన్ రెడ్డి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఆయన ఎమ్మిగనూరుకి ఎన్నో సేవలు అందించారు. ఆ ఒరవడిని కొనసాగించేందుకే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు.

సామాజిక న్యాయం చేసేది టీడీపీ, బూటకపు న్యాయం చేసింది వైసీపీ.

నా జీవితంలో ఇంత ఉత్సాహం, కసి ఎప్పుడూ చూడలేదు. 1994 తరువాతే ఇంత కసి చూశాను.

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలయ్యి డస్ట్ బిన్ లోకి పోవడం ఖాయం. 

జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోయే రకం. అందుకు రాయలసీమ ఒక ఉదాహరణ.

సీమలో 52 ఎమ్మెల్యేల్లో 49 మందిని వైసీపీ కాంగ్రెస్ అభ్యర్ధులను బెదిరించారు. ఈ కర్నూలు ఎంపీ ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్ గురించి ఆలోచించాడా? 5 ఏళ్ల్లల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదు.

నీళ్లు లేకుండా బాగా వెనకబడిన ప్రాంతం కర్నూలు, కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించారా? 

నేను రాయలసీమ బిడ్డే. రూ.68వేల కోట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. రాయలసీమకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. కాని జగన్ రూ.2వేల కోట్లు ఖఱ్చు చేశారు. జగన్ ను ఒడించేందుకు జనం సిద్ధం.

ఈ ముఖ్యమంత్రి ఫేక్ ఫెలో, ఎందుకు పనికిరాని దద్దమ్మ. హూ కిల్డ్ బాబాయ్? అని అడుగుతున్నాను. గొడ్డలి వేటు ఎవరిదో అర్ధమయ్యిందా?

చంపిన వాళ్లకు ఎంపీ సీటు, చనిపోయిన బాధితులపై కేసులా? స్వయానా చెల్లినే ఇబ్బందులకు గురి చేశారు.

ఇలాంటి నాయకులు ముఖ్యమంత్రులు అవుతారని ఎవ్వరూ ఊహించలేదు.

బీజేపీతో తాత్కాలిక ఒప్పందం అంటూ నాపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. టెక్నాలిజీని తప్పుడు వార్తలకు చేరేస్తున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా మోసం చేసే మోసగాళ్లు వచ్చారు.

రాయలసీమలో తాగడానికి మందినీళ్లు ఇవ్వలేని జగన్ ముద్ర ఎక్కడుంది? ఈ ప్రాంతానికి తట్ట మట్టి ఎత్తలేదు.

రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశారు.  గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నేడు నీళ్లు రాని పరిస్థితి.

ఈ ప్రాంతానికి తుంగభద్ర నీళ్లు తప్పా ఏ నీళ్లు రావు. హెచ్ హెల్ సీ, గుండ్రేవుల, గురురాంఘవేద్ర ప్రాజెక్టులు శరణ్యం. టీడీపీ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతే వైసీపీ వాటన్నింటిని నిర్వీర్యం చేశారు.

పనులు లేకపోవడంతో ఈ ప్రాంతం నుంచి కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. 

నీటి వనరుల ప్రాజెక్టులను పూర్తి చేసి దశదిశ మారుస్తాను. డ్రిప్ ఇరిగేషన్ ను  90 శాతం సబ్సిడీకి రైతులు ఇచ్చాను. కాని నేడు వాటిని రద్దు చేశారు.

రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఓటు వేసినా మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు.

టీడీపీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్ బాగుంటుందని యువత, విద్యార్ధులు ఆలోచిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది పేదలు, వెనకబడిన వర్గాల వారు ఉన్నారు. బోయ, కురబ, చేనేత, మాదిగ, మైనారిటీలు ఎక్కవు మంది ఉన్నారు. తెలుగుదేశం పేద వాళ్ల పక్షం. మీతోనే ఉంటాం. టీడీపీ డీఎన్ లోనే బీసీ ఉంది. బీసీల్లో గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ. మిమ్మల్ని ఆదరిస్తాం. మీకు మాకు ఉండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరు.

ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపిటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి పంచలిగాల నాగరాజును ఎంపీగా ప్రకటించాం. 

మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి అనే బోయ కులస్థుడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించాం. ఆలూరులో ఒక లింగాయత్ కులానికి చెందిన వీరభద్ర గౌడ్ ను ప్రకటించాం. పత్తికొండలో ఈడిగ వర్గానికి చెందిన  కేఈ కృష్ణమూర్తి కుమారిడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించాం. బీజేపీ కూడా ఆదోని నుంచి బోయ వర్గానికి చెందిన పార్ధసారధి ఇచ్చాం. కర్నూలో వైశ్య, కొడుమూరులో మాదిగ వర్గానికి చెందిన ఎస్సీలకు ఇచ్చాం. ఇక ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డికి అభ్యర్ధిగా ఇచ్చాం. వారి కుటుంబం డీఎన్ ఏపీలో టీడీపీ ఉంది. 

బుట్టా రేణుక పేద మహిళ అంటూ జగన్ రెడ్డి ప్రకటించారు. 2014లోనే ఆవిడ ఆస్తి రూ.250 కోట్లు. రామయ్య కూడా చాలా పేదవాడు అంటా? మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఇసుక, మట్టితో పాటు మంత్రాలయం దేవుడిని కూడా మింగేసిన వ్యక్తికి సీటు ప్రకటించారు.

ఆదోనిలో వలసపక్షి ఉన్నారు. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లులోను వీళ్లు షాడోలుగా ఉంటారు. సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారు. 1983లో వాళ్ల నాన్న కూడా టీడీపీలోనే ఉండేవారు.

యుద్ధాల్లో సామంత రాజును చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లుగా వీళ్లు ఇక్కడ నాయకులను ఆణగదొక్కి దోచుకుంటున్నారు.

సామాజిక న్యాయం ఎవరిది?టీడీపీ వైసీపీదా?

రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి 49 సీట్లు ఇచ్చి నాది సామాజికవర్గం అంటారు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు.

పేదవాళ్లను అన్ని వర్గాల నుంచి పైకి తెచ్చిన పార్టీ టీడీపీ. భూస్వాములు, పెత్తందారుల పార్టీ వైసీపీ.

బీసీ డిక్లరేషన్ తెచ్చాం. పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు అండగా ఉంటాం. 50 ఏళ్లు పైబడిన బీసీలకు రూ.4వేల ఫించన్ ఇస్తాం. అందరికి ఫించన్ రూ.4వేలు ఇస్తాం. రూ.200 పింఛన్ రూ.2000కు పెంచింది టీడీపీ. అసలు ఫించన్ ప్రారంభించిందే ఎన్టీఆర్.

అందరి ఫించన్లు మొదటి తారీఖునే వాళ్ల ఇంటి దగ్గరే ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4వేలు ఇస్తాం.

ఆన్ లైన్ లో పించన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ చెప్పంది. ఓటు వేయలేని వారికి ఇంటి దగ్గరే పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటు వేయించుకుంటున్నారు. నా పేద వాళ్లు భయటకు రాలేరు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంక్ లో వేయకుండా, వాలంటీర్లతో కాకుండా వేరే వాళ్లను పెట్టి  పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. 

వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడూ పేదవాళ్ల పక్షం ఉంటుంది.

5 ఏళ్ల్లల్లో వెనకబడిన వర్గాలకు రూ లక్షా 5వేల  కోట్లతో సబ్ ప్లాన్ తీసువస్తాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 34 శాతం టీడీపీ ఇస్తే జగన్ రెడ్డి 24 శాతానికి తగ్గించడంతో  దాదాపు 17వేల మంది పదవులు కోల్పోయారు. ఈ రిజర్వేషన్ ను 34 శాతానికి పెంచుతాం.

కులగణన చేసి ధామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతాం. బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. కురబలు, బుడగజంగాలను ఎస్సీలు, బోయలను ఎస్టీలుగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. 

రూ. 5వేల కోట్లతో ఆదరణలో ఆధునిక పనిముట్లు ఇస్తాం. విదేశీ విద్య, స్టడీసర్కిల్, విద్యోన్నతి పథకాలు పునరుద్దరిస్తాం. చంద్రన్న బీమాతో రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తాం. కులదృవీకరణ పత్రాలు అందిస్తాం. బీసీభవనాలు, కమ్యునిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేస్తాం.

చేనేతలకు హ్యాండ్ లూమ్ ఉంటే రూ.200 యూనిట్లు, ఫవర్ లో ఉంటే రూ.500 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాం. చేనేతలకు ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తాం. ఎమ్మిగనూరు కేంద్రంగా టెక్స్ టైల్స్ పార్కును తీసుకువస్తాం.

టీడీపీ వెనకబడిన వర్గాలకు అత్యధికంగా  సీట్లు ఇచ్చింది. మీకు ధైర్యం ఉంటే ముందుకు రా మాట్లాడుకుందాం. పేర్లతో సహా చర్చించేందుకు సిద్ధం? మీరు సిద్ధమా?

ఒకే వర్గానికి 49 సీట్లు ఇచ్చిన వైసీపీ నాయకులా మాట్లాడేది. 1995లో మాదిగలకు ఏ,బి,సి,డి, తీసుకువచ్చింది టీడీపీ. మాదిగలకు జిల్లాల వారిగా క్యాటిగరైజేషన్ తీసుకుస్తాం. మాల, మాదిగ, రెల్లీ వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకుంటాం.

రెండు సార్లు ఎన్డీలో ఉన్నా ఏ ఒక్క ముస్లిం వ్యక్తి హక్కు భంగం కలగకుండా చూశాం. 

హైదరాబాద్, కర్నూలులో ఉర్దూయూనివర్సిటీలు పెట్టాం. ఉర్దూను రెండో భాషగా పెట్టాం. రంజాన్ తోఫాలు అందించాం. ముస్లింలకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్ట్టాం. 

దుల్హన్ పథకం ద్వారా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయించాం. దుకాన్, మకాన్ ద్వారా షాపులు ఇచ్చాం. మౌజన్, ఇమాంలకు గౌరవ వేతనం అందించాం.

5 ఏళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకు వైసీపీ సహకరించారు. కబుర్లతో దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే  రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతున్నారు. టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు కాపాడింది. 

మా పిల్లల భవిష్యత్ నువ్వే చంద్రన్న అంటూ ముస్లింలు కోరుతున్నారు. మూడు పార్టీలు కదిలివస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. 

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి కాకపోతే పనులు ఎందుకు ముందుకు సాగుతాయి.

హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. అలాంటి అభివృద్ధిని ఏపీలో చేసుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు రాష్ట్రం కోసం.

తెలుగు ప్రజలను ప్రపంచానికి పరిచయం చేసింది టీడీపీనే. 

బడ్జెట్ లో 19.15 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టాం. కాని జగన్ రెడ్డి 15.08 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేశారు.

నవరత్నాలు 9 అయితే టీడీపీ అమలు చేసినవి దాదాపు 100 పథకాలు.

అన్న క్యాంటీన్ ఇప్పుడు ఉందా? పేదవాడిని కడుపు మాడ్చాలని అనుకుంటారా? పేద వాళ్లకు రూ.5 అన్నం పెట్టాం. తమిళనాడు, కర్నాటకలో ప్రభుత్వాలు  అన్నం పెట్టే క్యాంటీన్లు కొనసాగించారు? కాని ఏపీలో ఎందుకు రద్దు చేశారు?

దుల్హన్, ఆదరణ, రంజాన్ తోఫా, రైతులకు డ్రిఫ్ ఇరిగేషన్, పంటల బీమా, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చేనేతలకు ఒక్క రూపాయి ఇచ్చారా? డప్పు కళాకారులకు పెన్షను ఇచ్చారా? ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనారిటీలకు 10 పథకాలు రద్దు చేశారు.

నాడు టీడీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ రూ.60 అయితే నేడు రూ.200 పెరిగింది. రూ.140 పెరిగిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి. ఒక క్వార్టర్ రోజు తాగితే ఏడాదికి అయ్యే ఖర్చు రూ.30వేలు, అదే రెండు క్వార్టర్లు అయితే రూ.60వేలు. అవతాయి. మీ జేబులు గుల్లచేయడంతో పాటు మీ ఆరోగ్యాన్ని నాశనం చేశారు.

మద్యపాన నిషేదం చేస్తేనే ఓటు అడగనన్నారు. కాని ఎందుకు మళ్లీ వస్తున్నారు?

డ్వాక్రా సంఘాలు, ఆస్తిలో సమాన హక్కు, కాలేజీల్లో, స్కూళ్లలో 33 శాతం, వంట గ్యాస్ ఇచ్చింది టీడీపీనే. ఏపీ ఆడబిడ్డలు ప్రపంచానికే ఆదర్శం చేస్తాను. 

ఒట్టిట్టి బటన్ కాదు నిజమైన బటన్ నొక్కుతా. 18 ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇద్దరుంటే రూ.3వేలు, ముగ్గురుంటే రూ.4,500వేలు, నలుగుంటే రూ.6వేలు ఇస్తాం. 

తల్లికి వందనం పేరుతో ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు, నలుగురుంటే రూ.60వేలు ఇస్తాం. 

నేను దీపం పెడితే జగన్ రెడ్డి దీపం ఆపేశాడు. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తాం.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. నేను డ్రైవర్ గా ఉంటాను.

ప్రజల భవిష్యత్ కు నేను డ్రైవర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, రైతులకు నేను డ్రైవర్ ని.

మీకు పుట్టబోయే బిడ్డలకు నిన్నిచ్చే పథకాలు అదర్శం.

డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. గోదావరి నీళ్లు కృష్ణకు తీసుకువస్తాను.

కర్నూలుకు నీళ్లు ఇస్తేనే నా జీవిత ధన్యం అవుతుంది. కృష్ణ నీళ్లు తీసుకువస్తాం.

యువతను జగన్ రెడ్డి బురిడీ గొట్టిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడిపీది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి. 

మెగా డీఎస్సీ పెడతాను.  నేను 8 డీఎస్సీలు, ఎన్టీఆర్ 3 డీఎస్సీలు పెడితే సైకో జగన్ ఎన్ని డీస్సీలు పెట్టారు.

జగన్ పుట్టక ముందే నేను సీఎంని. నేను తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిదిలో  ఎంఏ చేశాను. కాని జగన్ నువ్వేం చేశావు. ఏసు ప్రభువు పుట్టిన రోజు సాక్షిగా జగన్ ఏం చదివారో చెప్పాలి. నా దగ్గర జగన్ బచ్చా.

గౌరవం లేని వ్యక్తులకు ఇలాంటి ఫిట్టింగ్ సమాధానాలు ఇవ్వాలి. మీ నోటిని ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. నిరుద్యోగులకు  నెలకు రూ.3వేలు ఇస్తాం.  

ఆర్డీఎస్ కుడి కాలువ పూర్తి చేయాలి. వేదవతి, వెలుగోడు, గుండ్రేవుల, గురు రాఘవేంద్ర పనులు పూర్తి చేస్తాం.  3వేల టిడ్కో ఇళ్లు రద్దు చేశారు.

జగన్ గేమ్ ఈ ఓవర్. కూటమి అన్ స్టాపబుల్, సైకిల్ తొక్కుకుంటూ పోతుంది, గ్లాస్ కుమ్ముకుంటూ పోతుంది. పువ్వు కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది.

దొంగల ఫేక్ న్యూస్ నమ్మొద్దు. బాబాయ్ ఎవరు చంపారో వివేకం అనే సినిమా ద్రోహి ఎవరో అర్ధమౌతుంది.


Comments