సమీకృత ఆర్ధిక శాఖ కార్యాలయముల భవన సముదాయం ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నుల, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్.సమీకృత ఆర్ధిక శాఖ కార్యాలయముల భవన సముదాయం ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నుల, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖామాత్యులు 

బుగ్గన రాజేంద్రనాథ్. విశాఖపట్నం మార్చ్ 5 (ప్రజా అమరావతి):- రూ.25.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటి గ్రేటెడ్ ఫైనాన్స్ భవన కాంప్లెక్స్ ను  రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నుల, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్ మంగళ వారం  సాయంత్రం   ప్రారంభించి, భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఈ భవన సముదాయంలో ఆర్థిక శాఖకు సంబంధించిన అన్ని విభాగాలను తీసుకొని వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా ట్రెజరీ శాఖ, పే అండ్ అకౌంటెంట్, ఆడిట్ విభాగం తదితర కార్యాలయాలను ఒకే కాంప్లెక్స్ లో ఏర్పాటు చేస్తామని  మంత్రి తెలిపారు.


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  విశాఖ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారని, విశాఖ రానున్న కాలంలో  పరిపాలన కేంద్రంగా మారనుందని, భారత్ లోనే విశాఖకు అన్ని ప్రాధాన్యతలు వున్న నగరంగా గుర్తింపు ఉందన్నారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో అనే రకాల మౌలిక సదుపాయాలు ముఖ్యమంత్రి కల్పించారని తెలిపారు. 


 భవిత ద్వారా యువత లో  నైపుణ్యత పెరుగుతుందని, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యత శిక్షణ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన  యువతకి ఎంతో మేలు కలుగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆర్దిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులు ఎన్.మోహన్ రావు, తదితర జిల్లా అధికారులు పాల్గోన్నారు.Comments