టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి.*టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి


*


*మోసం చేసేవాళ్లను కాదు...ప్రజాసేవ చేసి జీవితాలు మార్చేవారినే ఎన్నుకోండి* 


*జగన్ నాసిరకం మద్యం తాగి అనేకమంది అనారోగ్యంపాలు* 


*అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా*


*పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్ ను ఏమనాలి.?*


*వెలుగొండకు పునాది వేసింది నేనే.. పూర్తి చేసి నీరందించేదీ నేనే*


*గోదావరి నీళ్లు సాగర్ కాల్వకు మళ్లిస్తే కరవే ఉండదు*


*గల్లాలో డబ్బులు లేక పెన్షన్ ఇవ్వలేదు...నెపం మాపై నెడతావా.?* 


*జగన్ పాలనలో రాష్ట్ర దుస్థితిపై ప్రతి చోటా చర్చించాలి* 


*ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు..చిత్తుగా ఓడించండి*


*ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డిని గెలిపించండి*


*-మార్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు*


మార్కాపురం (ప్రజా అమరావతి):- ఇప్పటి వరకు 15 సభలు పెడితే ప్రజల్లో విపరీతంగా స్పందన వచ్చింది. ఎన్డీఏ గెలుపు ఖాయమయ్యింది. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది.

5 ఏళ్ల శ్రమకు, కష్టానికి మే 13 నుంచి చెక్ పెట్టబోతున్నాం. ప్రతి చోట ప్రజలు చర్చ చేయాలి.

మీ పిల్లల భవిష్యత్ ను నా మీద నమ్మకం వదిలిపెడుతున్నారు. ఏడు, ఎనిమిదోవ తరగతి చదవే పిల్లల్లోను ఉత్సాహం ఉంది. 

బటన్ నొక్కా అని జగన్ రెడ్డి ప్రతి రోజూ రాగం పాడుతున్నారు. బటన్ నొక్కింది ఎంత? జనం దగ్గర బొక్కింది ఎంత? జగన్ నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా? 

ఒంగోలులో కొండేపి తప్పా అన్నింటిలోను జగన్ ను గెలిపించినా ఒక్క పని అయినా చేశారా?

ఈ ప్రాంతంలో నీళ్లుంటే బంగారం పండించే రైతులున్నారు? నాడు సమైక్యాంధ్రలో నీళ్లు కావాలని మీరు నన్ను అడిగితే వెలుగొండకు శంకుస్థాపన చేశాను. మళ్లీ దానిని నిర్వీర్యం చేశారు, కోర్టు లిటిగేషన్ లో పెట్టారు. నేను అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నింటిని పరిస్కారం చేసి పనులు ముమ్మరం చేశాను. 

టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికే నీళ్లు వచ్చి ఉండేవి. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కు తెచ్చి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి. 

జగన్ పాదయాత్రలో నెత్తి మీద చెయ్యి పెట్టి నిమిరాడు, ముద్దులు పెట్టడంతో ఐస్ అయ్యారు. ఇప్పుడు 5 ఏళ్లల్లో గుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు, కేసులే కేసులు. 

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే 15 లక్షల మందికి తాగు నీరు, 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే డబ్బులకి కక్కుర్తితో కాంట్రాక్టర్ ను మార్చి నాశనం చేశారు. 80 శాతం టీడీపీ పూర్తి చేస్తే 20 శాతం పూర్తి చేయలేని దద్దమ్మ మూడు రాజధానులు కడతానంటున్నాడు.

వెలిగొండను పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానన్నాడు. రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మొన్న పరదాల చాటున వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. 

పూర్తి చేయని ప్రాజెక్టుకు బుద్దున్నోడు ఎవడైనా ప్రారంభోత్సవం చేస్తారా? కాని జగన్ చేశాడు.

దేవుడి స్క్రిప్ట్ వెలిగొండను ప్రారంభించింది, పూర్తిచేసింది, నీళ్లు ఇవ్వబోయేది నేనే.

పోలవరం 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి గుత్తేదారుడిని మార్చి నాశనం చేశారు.

మార్కాపురాన్ని కొత్త జిల్లాగా తీసుకువస్తాను. 

రామాయపట్నం పోర్టు కోసం అన్ని పనులు పూర్తి చేశాను. జగన్ రెడ్డి వచ్చాక టెండర్లు రద్దు చేసి డబ్బుల కోసం లాలూచీ పడి రివర్స్ టెండర్ కు పాల్పడ్డారు.

ఇండోనేషియా నుంచి ఏషియా పల్స్ ఫ్యాక్టిరీని రూ.25వేల కోట్ల పెట్టుబడితో తెస్తే పారిపోయేలా చేశారు.

నీళ్లు తీసుకువచ్చి, జిల్లాను రాజధానిగా చేసి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.

సంక్షేమం పేరుతో ఒట్టి బటన్ నొక్కుతున్నారు. 2014-19లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది టీడీపీ.

సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. 1983లో రూ.2 కిలో బియ్యం, రూ.50 కరెంట్ చార్జీలు, పక్కా ఇళ్లు, వంటి పథకాలకు శ్రీకారం చుట్టింది ఆయనే.

2014-19లో సంక్షేమానికి 19 శాతం ఖర్చు పెడితే జగన్ ఖర్చు పెట్టింది 15.6 శాతం మాత్రమే. 

అన్న క్యాంటీన్ పెడితే రద్దు చేశారు, చంద్రన్న బీమాను సైతం రద్దు చేశారు.

విదేశ విద్య, పండుగ కానుక, రంజాన్ తోఫా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ.

నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు.  మద్యపాన నిషేదం ఎందుకు చేయలేదు?

బటన్ నొక్కుడు వలన 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. రూ.200 కరెంట్ బిల్లు రూ.1000 పెంచావు. 

నీ బటన్ నొక్కుడు వలనే పెట్రోల్, డీజీల్, సేల్స్ టాక్స్, ఆస్థిపన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. చెత్త పన్ను వేశాడు.

జాబ్ క్యాలెండర్ బటన్ ఎందుకు నొక్కలేదు. జాబు రావాలంటే బాబు రావాలి. మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి.

మనం జాబు తెస్తే జగన్ గంజాయి తెచ్చాడు. 

జగన్ తాగు నీళ్ల బదులు జే బ్రాండ్ తెచ్చాడు. నిత్యావసర ధరలు తగ్గించేందుకు, సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేదం, గుంటలు పడే రోడ్లు బాగు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేందుకు, రైతులకు డ్రిప్ ఇవ్వడానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సబ్ ప్లాన్ కోసం ఎందుకు బటన్ నొక్కలేదు.

రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన దొంగ జగన్. 

సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, దానిని పంచుతాం. రూ.10 ఇచ్చి వేల  రూపాయల సంపాదించే ఆలోచన చేస్తాం.

రూ.13 లక్షల కోట్ల అప్పు సాక్షి పేపర్, భారతీ కడుతుందా? 

రూ.60 మద్యం నేడు రూ.200 కి పెరిగింది. ఒక క్వార్టర్ కు రూ.140  అంటే రెండు క్వార్టర్లు రూ. 280 ఎవరి జేబులోకి వెళుతున్నాయి. 

నాశిరకం మద్యంతో ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. దురాశాపరుడు ప్రజల జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతున్నాడు. 

కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని చెప్పి తానే మెడలు దించాడు. 5 ఏళ్లల్లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేకపోయారు. వ్యక్తిగత  కేసులు తప్పా జగన్ రెడ్డికి ఏమీ పట్టదు.

మద్యనిషేధం చేస్తే ఓట్లు అడుగుతానన్నాడు. మద్యం మీద రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు.

సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని హామీనిచ్చి మాట తప్పి మడమ తిప్పాడు. ప్రతి ఏటా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోడమే జగన్ విశ్వసనీయత

మొదటి సంతకం డీఎష్సీ, జాబ్ క్యాలెండర్ మీద పెడతాను.

హూ కిల్డ్ బాబాయ్? జగన్ రెడ్డికి తెలియదందటా? నిందితులను పక్కన పెట్టుకొని బాధితులపై కేసులు పెడుతున్నారు. సొంత చెల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగం. బాబాయ్ ని చంపేవాళ్లు మనకి కావాలా? కోడి కత్తి నాటకం ఆడేవాళ్లు కావాలా? కంటైనరల్లలో డబ్బులు పంపే వాళ్లు కావాలా?

సైకిల్ మీద పువ్వు పెట్టుకొని, జనసేన గ్లాస్ పట్టుకొని తొక్కుకుంటూ ముందుకు పోదాం.

నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఊహించలేదు.

బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకు ముస్లింలను రెచ్చగొడుతున్నారు. పార్లమెంట్ లో ముస్లింల బిల్లులు కేంద్రం ప్రవేశపెడితే అక్కడ మద్ధతు ఇచ్చి ఇక్కడ నాటకాలాడుతున్నారు.

అబ్దులు సలాన్ని వేధించడంతో నలుగురు కుటుంబం సభ్యులు ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

ఉర్దూ రెండో భాషగా చేశాం. మైనార్టీ కార్పొరేషన్ పెట్టాం. హైదరాబాద్, కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం హైదరాబాద్ లో హజ్ పెట్టాం. విభజన తరువాత కడప, విజయవాడలో హజ్ హౌస్ లు కట్టాం. 30వేల మంది ఆడబిడ్డలకు దుల్హన్ పథకం ఇచ్చాం. విదేశీ విద్య అందించాం. కాని జగన్ రెడ్డి 5 ఏళ్లల్లో ముస్లింలకు ఒక్క పథకం ఇచ్చావా?

కూటమి మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం, ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి.

రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. పిల్లల్ని చదివించుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, ప్రాజెక్టులు కట్టాలి, తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత.

మనం రాతి యుగంలో ఉన్నాం స్వర్ణయుగం చేస్తాను. నేడు మీ అందరికి డ్రైవర్ గా ఉంటాను.

మనకు కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదు. మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా. మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా? సమర్ధుడు రావాలి, ప్రజలను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కావాలి.

హైటెక్ సిటిని కట్టాం, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్లు అని వేసేంది టీడీపీనే. 

విభజన రోజున తెలంగాణ తలసరి ఆదాయం, మన తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం. నా 5 ఏళ్ల కష్టానికి తలసరి ఆదాయం పెంచాం. 27 శాతానికి తగ్గించారు. నేనుంటే తెలంగాణకు సమానంగా రెండు ముందకు వెళ్లేవి.

జగన్ రెడ్డి 45 శాతానికి తీసుకువెళ్లే పేదలను నిరుపేదలుగా మార్చారు. బటన్ నొక్కుడుతో మీకు న్యాయం జరిగిందా? మీ పొలాలకు నీళ్లు వచ్చాయా? పిల్లల జీవితాలు మారాయా? జగన్ బటన్ నొక్కుడుతో సమస్యలు పెరిగిపోయాయి.

నానా రకాల పేర్లతో 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. కరెంట్ అందుబాటులో లేదు. 

ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కందుల నారాయణ రెడ్డిలకు బటన్ గుద్ది అఖండ మెజారిటీతో గెలిపించాలి.

మీ అందరి ఆమోదంతోనే సీట్లు కేటాయించాం. ఇప్పుడు గెలిపించే బాధ్యత మీదే.

వైసీపీలో ఆయనకు గౌరవం ఇవ్వలేదు. తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ ను ఇక్కడ పోటీ చేసేందుకు వైసీపీ తీసుకువచ్చింది.

ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా? చిత్తూరులోను మరో రెడ్ శాండిల్ స్మగ్లర్ ను పెట్టాడు.

18 ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇద్దరుంటే రూ.3వేలు, ముగ్గురుంటే రూ.4,500వేలు, నలుగుంటే రూ.6వేలు ఇస్తాం. 

తల్లికి వందనం పేరుతో ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు, నలుగురుంటే రూ.60వేలు ఇస్తాం. 

నేను దీపం పెడితే జగన్ రెడ్డి దీపం ఆపేశాడు. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. నేను డ్రైవర్ గా ఉంటాను. మీ భద్రతకు నాది భరోసా. చంద్రన్న బస్సు అని చెప్పండి.

రైతును రాజు చేస్తాను. రూ.20వేలు అన్నదాతకు డబ్బు ఇస్తాం.

ఇంటింటికి మంచి నీరు. బీసీలకు రక్షణ చట్టం. 50 ఏళ్లకే ఫించన్ ఇస్తాం.

యువగళం పేరుతో 20 లక్షల ఉద్యగాలు ఇస్తాం రూ.3వేల నిరుద్యోగ భృతి. మేము పరిశ్రమలు తెస్తాం. జగన్ ఉంటే పారిపోతాయి.

దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండకుండా వదిలించుకోవాల్సిన సరైన సమయం.

రూ.200 పించన్ రూ.2000 చేసింది టీడీపీ. మళ్లీ రూ.4000 పెంచి ఇస్తాం.

నేడు గళ్లాలో డబ్బులు లేకుండా పించన్ ఇవ్వలేదు. ఖజానా ఖాళీ అయ్యింది. ఆ నెపం మన మీద వేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్లకే పించన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ఎమ్మెల్యే, తమ్ముడు, మామ, బావమరిదులు ఈ నియోజకవర్గాన్ని పంచేసుకున్నారు.

సమ్మర్ స్కోరేజీ ట్యాంక్ పనులు పూర్తి చేసి తాగు నీరు అందిస్తాం. టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వలేదు.

ఎస్సీ క్యాటగిరైజేషన్ తెచ్చింది టీడీపీ. మళ్లీ జిల్లాల వారీగా చేస్తాం.


Comments