ఏపీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫార్మసీ పరీక్ష తేదీలో మార్పు.

 *ఏపీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫార్మసీ పరీక్ష తేదీలో మార్పు


*
అమరావతి:మార్చి 21 (ప్రజా అమరావతి);

ప్రతి సంవత్సరం అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహిం చే AP EAPCET పరీక్షల తేదీలలో మార్పులు జ‌రిగాయి.


లోక్‌సభ ఎన్నికల నేప థ్యంలో ఈఏపీసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అప్‌డే టెడ్‌ షెడ్యూల్ ప్రకారం, మే 13 నుండి 19 వరకు జరగా ల్సిన EAPSET పరీక్షలు మే 16 నుండి 22 వరకు వాయిదా పడ్డాయి.


అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగ నుండగా, ఇంజినీరింగ్ పరీక్షలు మే 18 నుంచి మే 22 వరకు నిర్వహించను న్నారు.


అలాగే ఏపీ పీజీసెట్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. పీజీసెట్ పరీక్ష జూన్ 3 నుంచి 16వ తేదీకి వాయిదా పడింది. ఏపీలోని యూనివర్శిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌ కూడా షెడ్యూల్‌ ఖరారు అయింది.


మే 2 నుంచి మే 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించ నున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటనలో పేర్కొంది.

Comments