*మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్*
హైదరాబాద్:మార్చి 12 (ప్రజా అమరావతి);
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసు కొచ్చింది.
ఈ టీ-సేఫ్ ను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.
టీ-సేఫ్ యాప్ ద్వారా తెలంగాణ పోలీసులు మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందజేయ నున్నారు. టీ-సేఫ్ యాప్ అన్ని రకాల మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండనుంది.
addComments
Post a Comment