లోకేష్ సమక్షంలో జోరుగా టిడిపిలోకి చేరికలు.

 *లోకేష్ సమక్షంలో జోరుగా టిడిపిలోకి చేరికలు


*


తాడేపల్లి (ప్రజా అమరావతి): మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానంటున్న యువనేత లోకేష్ సంకల్పానికి నియోజకవర్గం నలుమూలల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పలువురు ముఖ్యనేతలు అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్, దుగ్గిరాల ప్రాంతాల నుండి సుమారు 130 కుటుంబాలు ఆదివారం లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరాయి. వీరికి లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా  ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కె.ఆర్.కొండూరుకు చెందిన అంజుమాన్ కమిటీ అధ్యక్షులు ఎస్ కె జానీ బాషా, సెక్రటరీ ఎస్.కె.మస్తాన్ వలి, సభ్యులు ఎస్.కే.ఖాజా, ఎస్.కే.సయ్యద్ బాబులా, ఎస్.కే గాలి సాహెబ్ తో  పాటు 30 కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన సీహెచ్.తాతారావు, ఎస్.కాళిదాసు, వంగా దేవతో పాటు 50 కుటుంబాలు, మంగళగిరి పట్టణం, రూరల్ నుండి బాప్టిస్టు పేటకు చెందిన కాలికోట శివ, 24వ వార్డుకు చెందిన గొట్టెముక్కల మురళీ, ఆత్మకూరుకు చెందిన బెల్లంకొండ అరవింద్, బండపల్లి వెంకటేష్ తో పాటు మరో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.  


Comments