వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.


నేరేడుచెర్ల, ప్యాపిలి, నంద్యాల జిల్లా.(ప్రజా అమరావతి);


*వాణిజ్య బ్యాంకులకు దీటుగా కేడీసీసీబీ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*నేరేడుచెర్ల శాఖ కేడీసీసీ బ్యాంకును ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ప్యాపిలి మండలం నేరేడుచెర్లలో రైతులకు అందుబాటులోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్*


*మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వం పెద్దపీట*


*రుణాల మంజూరుతో రైతులు, మహిళలకు  భరోసానివ్వాలి*


*మహిళలను మోసం చేయడానికి టీడీపీ పెద్దపీట*


*కేడీసీసీ బ్యాంకు నూతన భవన నిర్మాణం ప్రారంభం*


*బ్యాంక్ లోపల స్ట్రాంగ్ రూమ్, క్యాష్ కౌంటర్, ఇతర సౌకర్యాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం*


*రైతులు, స్వయం ఉపాధి మహిళలకు ఎంతో ఉపయోగకరం*


*నన్ను ఓడించడం కోసం విపక్షాలు ఏకమయ్యాయి..ఒకరి తర్వాత ఒకరు ముగ్గురొచ్చారు*


*అభివృద్ధి చూస్తూ ఎక్కడ అని అడుగుతున్న ప్రతిపక్షాలు కళ్లు తెరచి చూడాలి*


*ఫ్యాక్షన్ కు అడ్డాగా మార్చిన కేఈ, కోట్ల కుటుంబాలు ఒక్కటవడమా అభివృద్ధి?*


*మీ కలయిక ఎవరి అభివృద్ధి? ఎవరికి అభివృద్ధి? ఎవరిని అభివృద్ధి చేయడానికి ఒక్కటయ్యారో సమాధానం చెప్పండి?*


*ఫ్యాక్షన్ రాజకీయాలతో 200 మంది చావుకు కారణమైన మీకు అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది?*


*నా భర్తను చంపిన వారు ఒక్కటయ్యారు..వాళ్లు నాడే కలిసుంటే నా మొగుడు నాకు దక్కేవాడు కదా అని ఓ మహిళ బాధపడుతోంది*


*మీ హయాంలో ఊరూరా ఎంత మందిని చంపారు?మీ రాజకీయాలతో ఎంత మంది నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అదా అభివృద్ధి?*


*200 మంది సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు మీ కలయిక ఏం సమాధానం చెబుతుంది?*


*కక్ష, కార్పణ్యాల రాజకీయాలతో మీ చుట్టూ తిప్పుకోవడం, రాకపోతే దొంగ కేసులతో  ఇరికించడమే మీ రాజకీయం*


*స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో బతుకుతూ సమానంగా ప్రజలుు ఎదిగే శాంతిభద్రతలు కాపాడడం మా రాజకీయం*


*సైకిల్ బయట ఉండాలి..టీ గ్లాస్ సింకులో ఉండాలి..ఫ్యాన్ ఇంట్లో ఉండాలి*


Comments