రాష్ట్రములో వ్యవసాయ పంటలకు & అనుబంధ రంగాలకు అమలుకానున్న కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్.

 

మంగళగిరి  (ప్రజా అమరావతి);


*ఏప్రిల్ నెల నుండి రాష్ట్రములో  వ్యవసాయ  పంటలకు & అనుబంధ రంగాలకు అమలుకానున్న కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్*


           ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో *రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ* (SLTC) సమావేశం జరిగింది .

ఈ సమావేశమునకు శ్రీ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ , వ్యవసాయ & సహకార ప్రత్యేక కార్యదర్శి మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) వారు అధ్యక్షత వహించటం జరిగింది.

      ఈ ఏప్రిల్ 2024 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం నకు సంబంధించి వివిధ పంటలకు మరియు అనుబంధ రంగాలైన పశు సంవర్ధక , ఉద్యానవన ,మత్స్య ,పట్టు & చెరుకు తదితర వాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను నిర్ణ యిన్చటానికి  సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమమునకు బ్యాంక్  , వ్యవసాయ & అనుబంధ రంగాల రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. వారిలో

*)శ్రీ అహ్మద్ బాబు ఐఏఎస్

వ్యవసాయ మార్కెటింగ్ & సహకార కార్యదర్శి ,సహకార కమిషనర్

*)శ్రీ చేవూరు హరికిరణ్ ఐఏఎస్,వ్యవసాయ ప్రత్యేక కమిషనర్,

*)Dr.SS శ్రీధర్ IFS, కమిషనర్,ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ

*)Dr R శ్రీనాథ్ రెడ్డి ,మేనేజింగ్ డైరెక్టర్ ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (అప్కాబ్) 

*) SLBC కన్వీనర్ మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఇందులో జిల్లాల వాతావరణ పరిస్థితులు ,పంటల సాగు విధానం పై సూచనా ప్రాయంగా   జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (DLTC) తయారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లను పరిగణనలో వుంచుకుని ,అవకాశాలను చర్చించారు.

   గత సంవత్సరం (23-24) కంటే 2024-25 సంవత్సరానికి సగటున 20% శాతం కంటే ఎక్కువగా ప్రతిపాదనలను పెంచి ఆమోదించారు.

ఈ ప్రతిపాదనలు రైతుల ఆదాయం పెంచే విధంగా ఉండాలని ఏప్రిల్ నెలనుండి ఈ కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలులోకి తీసుకురావాలని ప్రత్యేక కార్యదర్శి (వ్యవసాయం)శ్రీ గోపాలకృష్ణ ద్వివేది  ఆదేశించారు.

         

Comments