ఈవిఎమ్ స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా.

 *ఈవిఎమ్ స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా*



*విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన ముఖేష్ కుమార్ మీనా*


రాజమహేంద్రవరం, మార్చి 29 (ప్రజా అమరావతి):

తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ చెయ్యడం జరిగిందనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.


శుక్రవారము మధ్యహ్నం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత , ఎస్పి పి. జగదీష్, రాజకీయా పార్టీల ప్రతినిధులు, తదితరులతో కలిసి స్ధానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన ఈ వి ఎమ్ గోడౌన్ ను పరిశీలించడం జరిగింది.


ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత , జిల్లాలోనీ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోకి ఈ వి ఎమ్ లు, వివి ప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్ భద్రపరచడం జరిగిందనీ పేర్కొన్నారు. ఈ సందర్భం గా వివిధ నియోజక వర్గాలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ విషయంలో తీసుకున్న భద్రత పరమైన అంశాలను సి ఈ వో ముఖేష్ కుమార్ మీనా కు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వి ఎమ్ గోడౌన్ నుంచి ఆయా నియోజక వర్గాల కు చెందిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకీ తరలించే విధానం, తదితర అంశాలపై సీ ఈ వో సమీక్షించారు. తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. తదుపరి అక్కడ ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శన రిజిస్టర్ లో ముఖేష్ కుమార్ మీనా సంతకం చేశారు.


తొలుత రాజమహేంద్రవరం కు చేరుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కు కలెక్టర్ మాధవీలత, సబ్ కలక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తదితరులు స్వాగతం పలికారు.


రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తో పాటు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎస్పి పి.. జగదీష్, రాజకీయా పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నలబాటి రమేష్ (శ్యామ్) , బిజేపి - బొర్రా రామచంద్ర రావు, అప్ - నాగులపాటి సుబ్రహ్మణ్యం, వైయస్ఆర్ సీపీ - కే. రాజశేఖర్,  టిడిపి - ఆనంద్ సలాది, కే ఆర్ ఆర్ సి - ఎస్డిటీ ఆర్. కృష్ణ నాయక్, తహసీల్దార్, ఎలక్షన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



Comments