నరసింహుని బ్రహ్మోత్సవాలలో యూపీహెచ్సీల వైద్య సేవలు...

 *నరసింహుని బ్రహ్మోత్సవాలలో యూపీహెచ్సీల వైద్య సేవలు...*


 

మంగళగిరి. (ప్రజా అమరావతి );   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టాలైన శ్రీ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం, దివ్య రథోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక యూపీహెచ్సీల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సోమవారం స్థానిక గణపతి నగర్లోని ఇందిరానగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష బ్రహ్మోత్సవాలకు వచ్చిన అవసరమైన భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి ఆదేశాల మేరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. భక్తులు వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నగర పరిధిలోని ఇందిరానగర్, మార్కండేయ కాలనీ, కుప్పురావు కాలనీ, యర్రబాలెం, రామచంద్రాపురం, కుంచనపల్లి యూపీహెచ్సీల వైద్య సిబ్బంది భక్తులకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి, హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments