ఏపీపీఎస్సీలోని అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి.



*ఏపీపీఎస్సీలోని అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి*



*ప్రతిష్టాత్మకమైన సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు.* 


*సర్వీస్ కమిషన్ లో అక్రమాలతో విద్యార్థుల కలలు నాశనం*


*హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలి.?* 


*సవాంగ్, సీతారామాంజనేయులు, ధనుంజయ్ రెడ్డిపై విచారణ చేయాలి*


*పిన్నమ్మ తాళిబొట్టును తెంచిన జగన్ కు ప్రజలు ఓటేయాలా.?*


*-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


*ఏపీపీఎస్సీలో అక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు*


అమరావతి (ప్రజా అమరావతి):- ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన ముద్దాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని అక్రమాలతో విద్యార్థుల కలలను ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిందే కాకుండా....హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలని ప్రశ్నించారు. ఐపీఎస్ లు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులుతో పాటు  ధనుంజయ్ రెడ్డిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలన్నారు. ఏపీపీఎస్సీలోని అక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.....‘‘ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. దుర్మార్గుల పాలనలో ఎంత బరితెగింపు ఉంటుందో ఇదొక ఉదాహరణ. రాష్ట్ర యువతకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయి. యువత ఆశలను చంపి, జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను ఏం చేసినా తప్పులేదు. తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు..కానీ కావాలని యువత గొంతు నులిమే క్రూర మృగాలను క్షమించకూడదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంపికై ప్రజలకు సేవ చేయాలన్నది కొందరి కల. పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలన్నది వారి ఆలోచన. అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యమైన పోస్టులు ఇక్కడ నియామకాలు చేస్తారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించడానికి నీతి, నిజాయితీ, సమర్థత ఉన్న వారిని తీసుకుంటారు. నియామకాల్లో రాజీపడితే బోర్డే నాశనం అవుతుంది. నాడు ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ ఎవరో కూడా నాకు తెలీదు...సమర్థులు ఎవరో వడగట్టి మంచి వ్యక్తిని తీసుకున్నాం.’ అని గుర్తు చేశారు.  


*వైసీపీ కార్యాలయంగా ఏపీపీఎస్సీ*

‘గౌతమ్ సవాంగ్...ఒక టెయింటెడ్ క్యారెక్టర్ అధికారి. నాడు రాజధాని ప్రాంతానికి నేను వెళ్తుంటే నాపై రాళ్లు, చెప్పులు వేయించారు. కోపంతో కొందరు వచ్చి నిరసన తెలిపారు అని చెప్పిన దుర్మార్గుడు ఈ గౌతమ్ సవాంగ్. ఒక డీజీపీగా నాడు అనే మాటేనా ఇది.? డీజీపీగా తప్పించాక ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఇది వైసీపీ కార్యాలయమా.? జీ.వి.సుధాకర్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత. జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభాదాస్ మనవడు సుధీర్...ఇతనే అక్రమాలకు సూత్రదారి..కేంద్ర బిందువు. సోనీవుడ్, సీవీ శంకర్ రెడ్డి, సెలీనా లాంటి చెత్త వ్యక్తులను తీసుకొచ్చి సభ్యులుగా పెట్టారు. తల్లిదండ్రులు పడ్డ కష్టం, ఆశలను నాశనం చేశారు. నేను సీఎంగా ఉన్నప్పుడు 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 30 డిప్యూటీ కలెక్టర్లు, 28 డీఎస్పీలతో పాటు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కానీ నియామకాలు, సాంప్రదాయాలకు ఈ ప్రభుత్వం తిలోదకాలు తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారు. అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మ్యాన్యువల్ మూల్యంకనం చేయాలని జస్టిస్ సోమయాజులు 2021 అక్టోబర్ 1న ఆదేశాలు ఇచ్చారు. నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. అడ్వకేట్ కోసం చందాలు వేసుకుని పోరాడారు. అయినా వారిని సీతారామాంజనేయులు వేధించారు. హాయ్ ల్యాండ్ లో మ్యాన్యువల్ మూల్యాంకనం కోసం సీతారామాంజనేయులు ఆదేశాలు ఇచ్చారు. గౌతమ్ సవాంగ్ వచ్చాక...2021 డిసెంబర్, 2022 ఫిబ్రవరిలో జరిగిన మాన్యువల్ వ్యాల్యూషన్ ఫలితాలు తొక్కిపెట్టి నచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. మొదటి సారి చేసిన వ్యాల్యూషన్ వివరాలు దాచిపెట్టి రెండో సారి వ్యాల్యూయేషన్ చేయాలని గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి రికమెండ్ చేశాడు. ఇది ఏపీపీఎస్సీ రూల్ నెంబర్ 3(9)కి వ్యతిరేకం. మొదటి సారి చేసిన వ్యాల్యూషన్ వివరాలు దాచిపెట్టి 2022 మార్చిలో వ్యాల్యూయేషన్ ప్రారంభించినట్లు కోర్టకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. రెండోసారి వ్యాల్యూషన్ కు ఇచ్చినట్లు డాటాటెక్ మెథడెక్స్ కు సీతారామాంజనేయులు రాసిన లేఖే ఆధారం. స్ట్రాంగ్ రూములు వద్ద తగిన భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి 03.12.2021న లేఖ రాశారు. హాయ్ ల్యాండ్ లో మాన్యువల్ వ్యాల్యూషన్ కు వచ్చిన అధికారులకు భోజనం ఖర్చులకు రూ.20 లక్షలు ప్రభుత్వం సొమ్మును ఆవాస రిసార్ట్ కు చెల్లించారు. డేటాటెక్ మెథడెక్స్ కు పోస్ట్ వ్యాల్యూషన్ కోసం రామాంజనేయులు లేఖ రాశారు. 2022లో ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేస్తారని సొంత పత్రిక సాక్షిలో కూడా ముందుగా కథనాలు వచ్చాయి. తప్పుడు వార్తలు రాయడానికి, రాష్ట్రాన్ని మోసం చేడానికి, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈ సాక్షి. డిజిటల్ వ్యాల్యూషన్ తప్పు అని కోర్టు మొట్టికాయలు వేసి మాన్యూవల్ వ్యాల్యూషన్ చేయాలని చెప్పింది. కావాల్సిన మనుషులు కోసం ఫలితాలు తొక్కిపెట్టారు. తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకు సవాంగ్ చైర్మన్ అయ్యాక ఆదేశాలు వచ్చాయి. కనీసం భయం కూడా లేకుండా విచ్చిలవిడి తనంతో ప్రవర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించడానికి అధికారం లేదు. చట్ట ప్రకారం పని చేస్తే ఉంటారు..లేదంటే శిక్షకు గురవుతారు. అవసరమైతే ఇలాంటి దుర్మార్గులను జైల్లో పెడితేనే పిల్లల జీవితాలు బాగుపడుతాయి.’ అని పిలుపునిచ్చారు. 


*కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన అధికారులను ఏమనాలి.?*

‘కోర్టులంటే లెక్కలేని తనం. తప్పు చేయాలంటే ఆత్మ క్షోభిస్తుంది...అయినా బరి తెగించి ప్రవర్తించారు. పిల్లల భవిష్యత్ కు మరణ శాసనం తాడేపల్లి కొంపలోనే ప్రారంభమైంది. ఆల్ ఇండియా సర్వీస్ కు గౌతమ్ సవాంగ్ అనర్హుడు. రేపు అనేది ఆలోచించకుండా సైకో ఏం చేయమంటే ఆది చేస్తున్నారు. సైకో చంపేయమన్నా చంపేస్తారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని లాయర్లకు ఖర్చు పెట్టి నాశనం చేస్తున్నారు. లాయర్లకు ఈ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టింది. 2022 మార్చి 25 నుండి మాన్యూవల్ వ్యాల్యూషన్ జరిగిందిన కోర్టుకు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇలాంటి సిగ్గులేని పనులు చేసినందుకు ఉరేసుకుని చనిపోవాలి. రెండోసారి జనవరి 2023న మరొక అఫిడవిట్ దాఖలు చేసి అదే అబద్ధాన్ని మళ్లీ చెప్పారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం మళ్లీ అప్పీల్ కు వెళ్తామని చెప్తోంది. ఎందుకు వందల కోట్ల ప్రజల డబ్బులు తగబెట్టడానికా.? ఇలా తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటే ప్రజలు మిమ్మల్ని స్మశానానికి పంపుతారు. అక్రమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సిగ్గులేకుండా కోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడానికి అర్హత ఉందా.? తప్పులు చేసింది కాకుండా మళ్లీ బుకాయిస్తున్నారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపి నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ తప్పులు తెలియక చేసినవి కావు...కావాలని చేసినవి. తప్పు ఇది. ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. అక్రమంగా ఎంపికైన వారిని విధుల్లో లేకుండా చేయాలి. ఏపీపీఎస్సీ అక్రమాలపై కోర్టు తీర్పును సైట్ లో పెట్టకుముందే  ఉద్యోగుల తరపున అప్పీల్ కు వెళ్తామని ముందే చెప్పారు.’ అని తప్పుబట్టారు. 


*యువత ఆశలను నాశనం చేసిన జగన్ కు పాలించే అర్హత లేదు*

‘టీడీపీ ప్రభుత్వంలో నిష్ణాతులు, నిపుణులు ఏపీపీఎస్సీలో ఉండేవారు. వైసీపీ వచ్చాక బంధువులు, అవినీతి పరులకు అవకాశాలు కల్పించారు. మేం పరీక్షల నిర్వహణలో పాదర్శకత పాటించాం. టీడీపీ 22 ఏళ్ల చరిత్రలో ఎక్కడా ఒక్క ఆరోపణ లేకుండా పద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించాం. నిరుద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. గౌతం సవాంగ్, సీతారామాజంనేయులును ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేయాలి, ఎవరిపై తప్పుడు కేసులు పెట్టాలి, ఎలా వేధించాలనేది సీతారామాంజనేయులు పనిగా పెట్టుకున్నాడు. జాబ్ కేలండర్, మెగా డీఎస్సీ లేదు..ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు...ఏం సమాధానం చెప్తారు? ధనుంజయ్ రెడ్డి...ఈయనో పెద్ద హీరో. రాజకీయం, సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. ఏపీపీఎస్సీలో వెలుగుచూసిన అక్రమాలు నిరుద్యోగుల విజయం..నిరూపిపంచచిన సత్యం. పోరాటం చేయకుండా ఉంటే తాము కరెక్టుగా చేశామని అక్రమార్కులు చెప్పుకునేవారు. వీళ్లు చేసేవన్నీ తప్పుడు పనులు...వెధవ పనులు. జగన్ చేయమని చెప్తే ఏ నీతిలేనిపనైనా చేస్తారా.? ఈ దుర్మార్గులు ఇంట్లో కూర్చుని ఏదైనా చేస్తారు. వీళ్ల దగ్గర ప్రభుత్వ వ్యవస్థల పాస్ వర్డ్ లు పెట్టకుని ఏదైనా మార్చుతారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ప్రమాదం. ల్యాండ్ టైటిల్ యాక్టు తెచ్చారు. ఇప్పటి దాకా జరిగిన దౌర్జన్యాలు, దోపిడీలు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. యువత ఆశలను నాశనం చేసిన జగన్ కు పాలించే అర్హత లేదు’ అని చంద్రబాబు అన్నారు.  


*పిన్నమ్మ తాళిబొట్టును తెంచిన జగన్ కు ప్రజలు ఓటేయాలా.?*

‘ప్రజలు గెలిచి...రాష్ట్రం నిలబడాలి. ఇది జరక్కపోతే భవిష్యత్ ఉండదు. జగన్ కు మద్ధతు తెలిపే స్వయంప్రకటిత మేధావులు ఎంగిలి మెతుకుల ఆశపడి సపోర్టు చేయకండి. దుర్మార్గులను సపోర్టు చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలి. చిత్ర విచిత్రమైన లీలలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. లేని ఆస్తులు ఉన్నట్లు...ఉన్న ఆస్తులు లేనట్లు చూపిస్తారు. బాబాయిని గొడ్డలితో లేపేశాం..అరెస్టుకులు కాకుండా కాపాడామని అనుకుంటున్నారు. ఇంటి దొంగను గుర్తించలేపోయాం. బాధల్లో ఉండి పట్టించుకోలేదు...జగన్ ఉదయం రావాల్సి ఉంది...సాయంత్రం వచ్చాడు. హెలికాప్టర్ అరగంటలో వెళ్లాల్సిన వ్యక్తి రోడ్డు ప్రయాణంలో సాయంత్రానికి వచ్చాడు. హత్యపై కోర్టుకు వెళ్లాలి..సీబీఐ విచారణ అడగాలన్నప్పుడు వద్దు అని జగన్ చెప్పాడు. దీంతో వారికి అవమానం కలిగింది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని జగన్ కాపాడారు. హత్యలో జగన్, భారతి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది...వైసీపీకి ఓటేయొద్దు. తాము పోరాడుతుంటే అల్లుడు, చెల్లెలుపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.’ అని సౌభాగ్యమ్మ అన్నారని చంద్రబాబు తెలిపారు. మానవత్వం ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అబద్ధాల కోరును ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు.  


*ఫోన్ ట్యాపింగులు జరుగుతున్నాయి*

మేం పొత్తులు పెట్టుకుంటే వంకలు పెడుతున్నారు...జరిగిన తప్పుకు సమాధానం చెప్పు జగన్.? వింత జంతువుల కంటే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రైతు బజార్ల, కలెక్టర్ కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాలు తాకట్టు పెట్టారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. వేలకొద్దీ స్కాములు చేసింది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లు జరుగుతున్నాయి. ప్రజలు భయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పుడు పనుల చేసేవారిని చట్టపరంగా శిక్షించాలి...రాజకీయంగానూ పాతిపెట్టాలి. ఎన్నికల నోటిఫికేషణ్ వచ్చాకైనా వారి ఆగడాలు ఆగుతాయేమో అనుకుంటున్నా. ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టింది. ఒక్క వాత పెడితే సిగ్గున్నోడు అయితే దిగిపోతాడు. ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడటానికే పొత్తు పెట్టుకున్నాం. ఎక్కడ చూసినా గంజాయి, లిక్కర్, రౌడీయిజం ఉంది. మహిళలకు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. జగన్ కు డిపాటిట్ కూడా రాకూడదు. జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. తప్పుడు కేసులపై సమీక్షలు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. ఈ ప్రభుత్వ బాధితులే క్యాంపెయినర్లు కావాలి.’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.  


*ముస్లింల రిజర్వేషన్లు కాపాడతాం*

‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్ షిప్ అవసరం. ఎప్పుడో ఒకసారి సిటిజన్ షిప్ తీసుకోవాల్సిందే. ఇది రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం అవుతుంది. అభద్రతాభావం ఎవరికి ఉంటుంది..దొంగతనంగా వచ్చేవారికి ఉంటుంది. ఉద్యోగాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి...వాటిని మేం కాపాడుతాం. ముస్లింలలో పేదలు, వెనకబడిన వారు ఉన్నారు..వారికి చేయూత ఇవ్వడం మా బాధ్యత. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేశాలు...ఇలా ఏ దేశంలో అయినా రూల్స్ ప్రకారం సిటిజన్ షిప్ ఉంటుంది. దేశం కోసం ఆలోచించే వ్యక్తులు కొన్నికొన్ని ఆమోదించాలి. పొత్తు పెట్టుకున్నాక పార్టీలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి...వాటిని మేమే పరిష్కరించుకుంటాం. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను కూడా మేము కోరుతున్నాం...రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మా పార్టీలో కూడా కేసులకు గురై పోరాడిన వారిలో కూడా కొంత మందికి సీట్లు రాలేదు. వారిలో కూడా బాధ ఆవేదన ఉంటుంది. 2014-19 మధ్య కేంద్రం నుండి హోదా తప్ప అన్ని పనులు జరిగాయి. అమరావతికి రూ.2,500 కోట్ల నిధులు, పోలవరంతో పాటు రోడ్లు వేశారు. నరేగా నిధులు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మేమున్నప్పుడు రాలేదు. విశాఖ జోన్ కు ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసింది.? జోన్ కు భూమి ఇవ్వనందును పనులు చేపట్టలేదని చెప్పారు..సిగ్గుపడాలి దీనికి. దేశం ముందుకు వెళ్తుంటే...రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం అందిస్తుంది. 2014-19లో అభివృద్ధి చేసినదానికి మెరుగ్గానే అభివృద్ధి చేస్తాం...నిధులు తీసుకొస్తాం. మా కూటమికి అనుకూలంగా జాతీయ మీడియాలో సర్వేలు కూడా వస్తున్నాయి.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments