ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.

 *ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి  ముఖేష్ కుమార్ మీనా


*


*ప్రస్తుత వేసవి దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలి : ముఖేష్ కుమార్ మీనా*


ఏలూరు, మార్చి,29 (ప్రజా అమరావతి): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలో  స్ట్రాంగ్ రూమ్ లు మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకుగాను   ఎంపిక చేసిన ఏలూరు సి ఆర్ ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు. 


ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల  కౌంటింగ్ ఒకే ఆవరణలో ఉన్నందున ఆయా నియోగాజకవర్గాల ఓట్ల కౌంటింగ్ కు వేరు, వేరు సముదాయాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత లేఔట్ ను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు.  ఇందుకు సంబందించిన వివరాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సీఈవో కి వివరించారు.  ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలసిన భద్రతకు సంబంధించి  జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి ,ఇతర పోలీసు అధికారులకు సీఈఓ సూచనలు చేశారు.  


తొలుత పోలింగ్ పూర్తయిన తరువాత వచ్చే ఈవీఎం, ఇతర స్టాట్యూటరీ సామాగ్రిని స్వీకరించేందుకు రిసప్షన్ కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు.  ఈ సందర్భంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని, త్రాగునీరు, టెంట్లు వంటివి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు. . 



వీరి వెంట జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐ టి డి ఏ  పీఓ ఎం. సూర్యతేజ, అసిస్టెంట్ కలెక్టర్ టి.  శ్రీపూజ,  డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్ . ఎస్.కె. ఖాజావలి, వై. భవాని శంకరి ,కె. అద్ధయ్య, ఎస్డీసీలు ఎం. ముక్కంటి, కె. భాస్కర్, కలెక్టరేట్ ఏ వో కె.కాశీ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.       


Comments