రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు నేనే డ్రైవర్ అవుతా.



*రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు నేనే డ్రైవర్ అవుతా* 



*ట్రెండ్ మారింది.. జగన్ రెడ్డి బెండు తీయడం తథ్యం*


*విధ్వంసకారుడి పనితీరుకు ఐదేళ్ల అరాచక పాలన నిదర్శనం*


*శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి కలిపి టెంపుల్ టూరిజం అభివృద్ధికి పునాదులేశాను*


*ఎర్రచందనం స్మగ్లర్లపై టీడీపీ ఉక్కుపాదం మోపితే...జగన్ రెడ్డి టికెట్లు ఇచ్చాడు*


*సామాజికాభివృద్ధి టీడీపీ మార్క్.. స్కీము స్కీమునా జగన్ రెడ్డి స్కాము మార్క్*


*శ్రీకాళహస్తిలో జరిగిన అభివృద్ధే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పనితీరుకు నిదర్శనం*


*ఆస్తి కోసం ఒక చెల్లిని, న్యాయం అడిగినందుకు మరో చెల్లిని తరిమేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి*


*మనం పరిశ్రమలు తెస్తే.. బియ్యం రెడ్డి కమీషన్లు దండుకుంటున్నాడు*


*శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


శ్రీకాళహస్తి (ప్రజా అమరావతి):- జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, ఎన్డీఏను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధమైపోయారు. 

ఎవరైనా ప్రజల కోసం పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారనడానికి  బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రత్యక్ష నిదర్శనం.

బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో దశాబ్దాల అనుబంధం ఉంది. తొలి రోజు నుండీ.. తుది శ్వాస విడిచే వరకు ఆయన పనితీరు సదాస్మరణీయం.

రాజకీయాలు చాలా మారిపోయాయి. ఒకప్పుడు ప్రజల్ని ప్రేమించేవారు రాజకీయాల్లో ఉండేవారు. ఇప్పుడు గుడిని గుడిలో లింగాన్ని మింగేసే వారు రాజకీయాల్లోకి వచ్చారు.

కమిషన్లు, కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్లు, రౌడీయిజం, తప్పుడు కేసులు తప్ప ఏమీ లేవు. పైన ఒక సైకో.. ఇక్కడున్న పిల్ల సైకో అక్రమాలను నమ్ముకున్నారు.

జనంలో ట్రండ్ మారింది. జగన్ రెడ్డి బెండు తీసేందుకు సిద్ధమైపోయారు. 

మన మీటింగులకు జనం నీరాజనాలు పలుకుతుంటే.. జగన్ రెడ్డికి ఖాళీ బిందెలతో నిరసనలు తెలుపుతున్నారు.

విమర్శలు చేయడం కాదు.. రాష్ట్రంలో ఏ రంగమైనా సంక్రమంగా ఉందా? ప్రజల జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా?

ఈ చెత్త పాలనను ఇంకా భరించాల్సిన అవసరం మనకు లేదు.

జగన్ రెడ్డి ఒక అహంకారి, విధ్వంసకారుడు, అవినీతి పరుడు. శ్రీకాళహస్తిలో బియ్యం మధుసూధన్ రెడ్డి లాంటి దోపిడీ దారుడిని నియోజకవర్గంలోని ప్రజలు ఎప్పుడూ చూసి ఉండరు.

తెలుగు తమ్ముళ్లను కేసులతో ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. 

ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే ప్రజలు ఏ విధంగా నష్టపోతారో.. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన నిదర్శనం.

జగన్ రెడ్డి పాలనలో అన్ని కుటుంబాలు నష్టపోయాయి. అన్ని గ్రామాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

జగన్ రెడ్డి దిగిపోవడం.. ఎన్డీఏ అధికారంలోకి రావడం తధ్యం.

జగన్ రెడ్డి ముఠాకు తొత్తులుగా వ్యవహరించే అధికారుల్ని ఉపేక్షించబోనని గుర్తుంచుకోవాలి.

రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.

నేను ఏం ఆలోచించినా ప్రజల కోసం ఆలోచిస్తాను. కానీ జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం ఆలోచిస్తాడు.

తిరుపతి, చెన్నై, నెల్లూరు నగరాలను బ్రహ్మాండమైన హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేశాను. 

2014కి ముందు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎలా ఉండేది. తర్వాత ఎలా మార్చామో చూడండి. 

ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు టీసీఎల్, హీరో మోటార్స్, జోహో, సెల్ కాన్, కార్బన్, డిక్సన్ లాంటి ఎన్నో కంపెనీలొచ్చాయి. ఐఐటీ, IISER, IIDT లాంటి ఎన్నో కేంద్ర విద్యా సంస్థల్ని తీసుకొచ్చాను.

మనం పరిశ్రమలు తెస్తే..  బియ్యం మధుసూధన్ రెడ్డి ఆ కంపెనీల వద్దకు వెళ్లి కమిషన్లు దండుకుంటున్నాడు.

తిరుపతి కేంద్రంగా.. శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి దేవాలయాలను కలిపి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని ప్రయత్నించాను. తిరుపతి దేవస్థానం అనేక విద్యా సంస్థల్ని నడిపిస్తోంది.

బొజ్జల గోపాలకృష్ణ గారు SKIT(శ్రీ కాళహస్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్) ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చారు. ఆ కాలేజీకి కావాల్సిన నిధులు తిరుపతి దేవస్థానం ఇచ్చేది.

టీడీపీ హయాంలో ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపాం. కానీ నేడు ఎర్రచందనం స్మగ్లర్‌ని చిత్తూరు ఎమ్మెల్యేగా నిలబెట్టారు.

రాష్ట్రాన్ని స్మగ్లర్లకు డెన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అప్రతిష్టపాలు చేస్తున్నారు.

మన బ్రాండ్ కియా, సెల్ కాన్.. జగన్ రెడ్డి బ్రాండ్ బూం బూం, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్ లాంటి వివరాలుచెప్పుకుంటూ పోతే నవ్వొస్తోంది. జగన్ రెడ్డి గొప్పతనం గురించి మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుంది.

నేనేం తెచ్చానని అడుగుతున్నాడు. విజన్ 2020 ఇచ్చా. తెలుగు జాతిని నెం.వన్ చేయాలని విజన్ రూపొందించా. ఈ రోజు హైదరాబాద్ ఏస్థాయిలో ఆదాయం సమకూరుస్తుందో, ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ఆలోచించుకోండి.

మన హయాంలో రూ.200 ఉన్న కరెంటు బిల్లు రూ.1000 వస్తోంది ఇది జగన్ బ్రాండ్. ఐదేళ్లు కోతల్లేకుండా, కరెంటు ఛార్జీలు పెంచేది లేదని కాలర్ ఎగరేసి చెప్పా అది నా బ్రాండ్.

మన హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ ఈ రోజు రూ.200 చేశాడు. తమిళనాడు, కర్ణాటక ఎక్కడా దొరకని మద్యం ప్రజల నెత్తిన రుద్దడం జగన్ రెడ్డి బ్రాండ్. నాణ్యత లేని మద్యాన్ని నిషేధించే బ్రాండ్ నాది. 

24 శాతం నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలపడం జగన్ రెడ్డి బ్రాండ్. కానీ జాబు కావాలంటే జాబు రావాలి అది నా బ్రాండ్.

పెట్టుబడిదారులు పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్. కియా, హీరో, ఇసుజు, అశోక్ లే ల్యాండ్ లాంటి పరిశ్రమలు నా బ్రాండ్.

పెట్టుబడులతో 5.13 లక్షల ఉద్యోగాలు, 11 డీఎస్సీలు, వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు నా బ్రాండ్.. మోసపూరిత డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ మోసం, ఉద్యోగాల భర్తీ చేయకుండా దగా చేయడం జగన్ రెడ్డి బ్రాండ్.

ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ పెట్టలేకపోవడం జగన్ రెడ్డి బ్రాండ్. 

ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 60 రోజుల్లో మెగా డీఎస్సీ ఇస్తా.

ఇసుకను బంగారం చేసి ప్రజల్ని దోచుకోవడం జగన్ రెడ్డి మార్క్... ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవడం నా మార్క్.

ఒక్క రోడ్డు, ఒక్క డ్రైనేజీ పూర్తి చేయలేని, ఒక్క ప్రాజెక్టుకూ నీరివ్వని దుర్మార్గం జగన్ రెడ్డి మార్క్,.. రూ.68 వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టించడం నా మార్క్.

పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేయడం నా మార్క్.. పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం జగన్ రెడ్డి మార్క్.

ఐదేళ్లలో ఒక్క రోడ్డేయకుండా, ఒక్క చిన్న పని చేయకుండా ప్రజల్ని అవస్థల పాలు చేయడం జగన్ రెడ్డి మార్క్.. 24 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం నా మార్క్.

దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయడం, 27 సంక్షేమ పథకాల రద్దు జగన్ రెడ్డి మార్క్.. దళితుల హక్కులు కాపాడి, సబ్ ప్లాన్ ద్వారా అండగా నిలిచి ఉపాధి కల్పించడం నా మార్క్.

దళితులంటే ఎంత చిన్న చూపో వర ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యేలను మంత్రుల్ని మార్చిన జగన్ రెడ్డి సొంత వారిని ఎందుకు మార్చలేదు. పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? మిథున్ రెడ్డిని ఎందుకు మార్చలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు మార్చలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్చకపోగా కొడుక్కి కూడా సీటిచ్చారు.

ఈ జిల్లాలో దళితుల సీట్లు తప్ప మరొకరి సీటు మార్చారా? ఎవరూ నిలదొక్కు కోకుండా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేయడం జగన్ రెడ్డి మార్క్. కానీ సీనియర్లందరికీ సీట్లిచ్చి అండగా నిలవడం నా మార్క్.

శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిని, బీజేపీ ఎంపీ అభ్యర్ధి వరప్రసాద్ ను గెలిపించం నా మార్క్. సీటు ఇస్తామంటే కూడా అభ్యర్ధులు పారిపోవడం జగన్ రెడ్డి మార్క్.

పేదలకు అండగా ఉన్నానని చెబుతున్న జగన్ రెడ్డిని అడుగుతున్నా.. రూ.10 ఇచ్చి రూ.100 దోచేయడం అండగా ఉండడమా? సంక్షేమం ద్వారా ఇచ్చే ప్రతి రూపాయితో వంద రూపాయలు సంపాదించేలా ప్రోత్సాహాలు అందించడం అండగా నిలవడమా?

హైదరాబాద్ ని ఎవరు అభివృద్ధి చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. విమానాశ్రయాన్ని చూసినా, ఇన్నర్ రింగ్ రోడ్ చూసినా, హైటెక్ సిటీ చూసినా నా ముద్ర అడుగడుగునా కనిపిస్తాయి.

విభజన తర్వాత విజన్ 2029 రూపొందించా. దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపాలనుకున్నా. అందుకు కావాల్సిన వనరులు సమకూర్చా. అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా.

ప్రపంచమంతా తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాభివృద్ధికై అడుగులు వేశాను. విశ్వాసం కలిగించాను. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రాన్ని ఉద్యోగాలకు కేంద్రంగా మార్చేవాడిని.

అభివృద్ధి అంటే పేదల తలసరి ఆదాయం పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగాలి. 

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కంటే ఏపీలో తలసరి ఆదాయం 35శాతం తక్కువ. నేను తీసుకున్న నిర్ణయాలు, నా కష్టం కారణంగా 27 శాతానికి తగ్గించాను. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణతో సమానంగా ఉండేది. 

కానీ, జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 27 శాతం నుండి 45శాతానికి పెంచాడు.  రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేసే జలగ మోసకారి, ఈ జగన్ రెడ్డి.

మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతా అన్న వ్యక్తి.. అధికారంలోకి వచ్చాక రేట్లుపెంచుకుంటూ, కమిషన్లు పెంచుకుంటూ డ్రామాలాడాడు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చాడు. 

పేదలు జీవితాంతం తాగాలా? జగన్ రెడ్డి చేసిన అప్పులు ప్రజలు కట్టాలా? ఇదేనా మద్య నిషేధమంటే?

మరో 40 రోజుల తర్వాత జగన్ రెడ్డి పోతాడు. కానీ, ఈ ఐదేళ్లలో చేసిన రూ.13 లక్షల కోట్ల అప్పులు ఎవరు తీరుస్తారు? వాటికి వడ్డీ కట్టాలి. బకాయిలు తీర్చాలి. మళ్లీ ఆదాయం సృష్టించి రాష్ట్రాభివృద్ధి చేయాలి. ఆ సత్తా కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే.

సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి 19.5శాతం బడ్జెట్ ఖర్చు చేశాం. కానీ నీవు ఖర్చు చేసిందెంత? కేవలం 15.80 శాతం మాత్రమే. ఏది సంక్షేమం? టీడీపీది సంక్షేమమైతే.. జగన్ రెడ్డిది సంక్షోభం.

విదేశీ విద్య, చంద్రన్న బీమా, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి వందకు పైగా పథకాలు రద్దు చేయడమే సంక్షేమమా?

చివరికి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు. ఇదేనా సంక్షేమం? 

తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. ఏపీలో కూల్చేశారు. ఎందుకు?

ఇలాంటివి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారు. సరెండర్ అయితే కేసులు ఉండవు. గట్టిగా నిలదీస్తే సీఐడీతో కేసులు పెట్టి వేధిస్తున్నారు.

2003లో వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలిచ్చేందుకు వెళ్తున్న సమయంలో 23 క్లెమోర్ బాంబులు పేల్చారు. అలాంటి దాడులకే భయపడను. ఇలాంటి పిల్ల సైకోలకు భయపడతామా?

పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, మద్యం ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. పైగా చెత్త పన్ను వేసి ప్రజల్ని బాదుడు వీర బాదుడు బాదుతున్నాడు.

నిత్యావసరాల ధరలు పెరిగి పేదల జీవితం ప్రశ్నార్ధకమైపోయింది.

జగన్ రెడ్డి ఏ స్కీము పెట్టినా అందులో స్కాం. జే బ్రాండ్లు, ఇసుక మాఫియాతో వేల కోట్లు దోచుకున్నాడు.

పేదలకు ఇచ్చే సెంటు భూమిలో కూడా రూ.7 వేల కోట్లు దోచుకున్నాడు. పేదలకు ఇళ్లు కట్టిస్తా. బకాయిలు చెల్లిస్తా. అప్పుడు ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను.

కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షలు, నరేగా నిధులు రూ.30 వేలు ఇచ్చి జగన్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. నేను కట్టించిన 6700 టిడ్కో ఇళ్లు పేదలకు పంచకుండా దగా చేస్తున్నాడు.

టీడీపీ హయాంలో కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షలకు రాష్ట్రం నుండి రూ.1.50 ఇచ్చి పేదలకు ఇళ్లు కట్టించి అందించాను. 

ఆ ఇళ్లకు రంగులేసుకున్నారు. ఆ ఇళ్లపై అప్పులు తెచ్చారు. కానీ ఇల్లు మాత్రం పేదలకు ఇవ్వలేదు. 

కొత్తగా తిరుపతి, విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు లాంటి  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో  టీడీఆర్ బాండ్లలో రూ.25 వేల కోట్ల స్కాం చేశారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి దెబ్బతీశాడు. అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలు జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్తుంటే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి నెట్టాడు. ప్రజల జీవితాలను రివర్స్ చేశాడు.

నా అనుభవాన్ని, తెలివితేటలను ఉపయోగించి గాడి తప్పిన పాలనను, అభివృద్ధిని గాట్లో పెడతాను.

రాతియుగం నుండి స్వర్ణ యుగం వైపు నడిపేంచే డ్రైవర్ లా మారుతా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. 

యువతకు హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాది గ్యారెంటీ. మీ ఆశలకు రెక్కలు తొడిగే బాధ్యత నాది.

మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాను. భద్రత కల్పిస్తా. భవష్యత్తు చూపిస్తా. ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా.

దళితులకు రూపాయి కూడా ఇవ్వకుండా నాశనం చేశాడు. రాజ్యాంగం ప్రకారం సబ్ ప్లాన్ నిధులు, రిజర్వేషన్లు నాశనం చేశాడు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు.

బీసీకు వెన్నెముకగా నిలిచే బీసీల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందున్నాను. భవిష్యత్తులోనూ తోడుగా ఉంటాను.

బీజేపీతో కలిసినందుకు మైనార్టీలను దూరం చేసేందుకు వైసీపీ దిక్కుమాలిన మాటలు చెబుతోంది. గతంలో ఎన్డీఏలో కలిసి ఉన్నా.. ఆ సమయంలో ఏ మైనార్టీ సోదరుడికి అయినా అన్యాయం జరిగిందా?

జగన్ రెడ్డిని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. కేంద్రంలోని ప్రతి బిల్లుకూ మద్దతిచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు డ్రామాలాడుతున్నాడు. మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో చర్చిస్తాం, పోరాడుతాం. కానీ, జగన్ రెడ్డి కేంద్రంతో తన కేసుల కోసం మాత్రమే నడుస్తాడు.

నిర్ధిష్టమైన ప్రణాళికతో వస్తున్నా. సంపద సృష్టిస్తా. దాన్ని పేదలకు పంచుతా. వాటికి చేయూత అందించి ఆదాయం పెంచుతా.

ఆడబిడ్డ నిధిగా ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున పెన్షన్ వచ్చే వరకు అందిస్తా.

తల్లికి వందనం పథకంతో చదువుకునే ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను. పిల్లల్ని చదివించుకున్నపుడే వారికి మెరుగైన జీవితం అందించగలం. 

ఆడబిడ్డలందరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను.

అన్నదాతలకు ఏటా రూ.20 వేలు ఆర్ధిక సాయం అందిస్తా. సీమలో డ్రిప్ ఇరిగేషన్ పునరుద్దరిస్తా. రైతును రాజు చేసే బాధ్యత తీసుకుంటాను. సోమశిల స్వర్ణముఖ కాలువ పూర్తి చేసి శ్రీకాళహస్తికి నీరిచ్చి, చెరువులన్నీ నింపి తీరుతాను.

యువతకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు చేస్తా. యువత ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు రావాలి.

నిన్న ప్రధాని మోదీతో బిల్ గేట్స్ చర్చల సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించారు. భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. అందుకే యువత ఆ దిశగా అడుగులు వేయాలి.

డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి కూడా చర్చించారు. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం నా లక్ష్యం. కానీ, జగన్ రెడ్డి టెక్నాలజీని తప్పుడు పనులకు వాడుతారు. 

నేను కేంద్రాన్ని ఏదో అంటున్నానంటూ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని ఫేక్ పోస్టులు సృష్టించాడు. బీజేపీ అధ్యక్షురాలి పేరుతో నకిలీ లెటర్ రిలీజ్ చేవారు. జగన్ రెడ్డి లాంటి ఫేక్ ఫెలోస్ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి.

ఐటీలో ఉద్యోగాలు పొందడమే కాదు. ఉద్యోగాలిచ్చే పరిస్థితుల్లో తెలుగువారు ముందుండాలని ఆకాంక్షించాను. నాటి ఆలోచనల్ని అందిపుచ్చుకున్న వారు నేడు ప్రపంచాన్ని ఏలుతున్నారు.

కోడి కత్తి, బాబాయి బాత్రూం మర్డర్ కేసుల్ని ఎలా వాడుకుని రాజకీయం చేశాడో చూశాం.

ఇప్పుడు కంటైనర్లతో డబ్బు తరలించడమే కాకుండా.. క్యాటరింగ్ వాహనాలు అంటూ చెబుతున్నాడు. ఫర్నిచర్ అంటున్నాడు.

పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు బియ్యపు మధుసూధన్ రెడ్డి. చేయని తప్పుడు పని లేదు. దోచుకోని వర్గం లేదు. పీడించని వర్గం లేదు. 

శ్రీకాళహస్తి దేవాలయాన్నీ రాజకీయాలకు, దోపిడీకి కేంద్రం చేశాడు. మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమి ఆక్రమించాడు. స్వర్ణముఖి నది నుండి ఇసుక తవ్వుకుంటున్నాడు. నది సుందరీకరణ పేరుతో రూ.18 కోట్లు కొట్టేశాడు.

రేణిగుంటలోని అనాసంపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి వెంచర్ వేసి దోచుకున్నాడు.

ఏర్పేడులో మనం కంపెనీలను ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి ఆ కంపెనీలను బెదిరించి డబ్బులు దండుకుంటున్నాడు.

ఎప్పుడో వచ్చిన ల్యాంకో కంపెనీని ఎంతలా వేధించాడో ఇక్కడి ప్రజలందరకీ తెలుసు. ఎక్కడ డబ్బులిస్తే అక్కడ వాలిపోతున్నాడు. కప్పం కట్టలేదని 15 రోజులు మూయించేసి కార్మికులు రోడ్డున పడేశాడు.

ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా అరెకరం భూమి కబ్జా చేశాడు.

అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి, ప్రజల సంపద మాత్రం భారీగా దండుకున్నాడు. 

ఐదేళ్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో నాకంటే ఇక్కడి ప్రజలకే బాగా తెలుసు. 

పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్మకాలు, డ్రగ్స్ అమ్మకాలు, కల్తీ మద్యం సరఫరాకు కారణం బియ్యపు మధుసూధన్ రెడ్డి కాదా? కుమార్తెకు, బావమరిదికి ఒక్కో ప్రాంతం పంచి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నాడు.

ఇలాంటి దగాకోరుల్ని, దోపిడీ దారుల్ని వెనకేసుకొస్తే..  ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు.

ఇక్కడి ప్రజలు ఈ ఎమ్మెల్యే కారణంగా ఎంతలా అవస్థలు పడుతున్నారో ప్రజా స్పందన చూస్తే అర్ధమైంది.

జగన్ రెడ్డిపై, ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డిపై ప్రజలు ఏ స్థాయిలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారో కనిపిస్తోంది.

రాజధాని కూడు పెడుతుందా అనే సన్నాసులకు చెబుతున్నా.. గడ్డి తినే వారికి అన్నం విలువేం తెలుసు?

మూడు ముక్కలు ఆట ఆడి ఐదేళ్లుగా రాజధానిని, రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని నాశనం చేశాడు.

హైదరాబాద్ నిర్మాణం విషయంలో కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే ఆ స్థాయి ఐటీ నగరం ఉండేదా? రోడ్లు, విమానాశ్రయం, ఆదాయం ఉండేవా?

నాకు ఎవరూ లేరు అంటూ ఈ మధ్య ప్రజల్లోకి వచ్చి చెబుతున్నాడు. పేపర్ లేదు, ఛానల్ లేదు. అందరూ ఒకటైపోయారు. చంద్రబాబు నా చెల్లెల్లను కూడా ఏదో చేశాడంటున్నాడు.

ఒక చెల్లికి ఆస్తి ఇవ్వను అని బెదిరించినందుకు రోడ్డెక్కింది. మరో చెల్లి తన తండ్రి చావుకు సమాధానం చెప్పమంటూ రోడ్డెక్కింది. వీటికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు.

పక్కన హంతకుడిని పెట్టుకుని అమాయకుడి మాదిరి కలియుగం అంటున్నాడు. జగన్ రెడ్డి లాంటి వస్తారని తెలిసి ఉంటే బ్రహ్మం గారు ముందే చెప్పేవారేమో.

ఊరికి వచ్చిన దొంగను అంతా ఏకమై తరిమికొడతారా లేదా? సైకో వచ్చి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే వదిలేస్తామా?

రాష్ట్రం గెలవాలి. ప్రజలు గెలవాలి. మన జీవితాలు వెలగాలి. అందుకే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిశాయి.

రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ఏర్పడింది. సుధీర్ రెడ్డికి , వర ప్రసాద్ కు ఓటు వేయాలి.

1999లో బీజేపీ అభ్యర్ధిగా వెంకటస్వామి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అదే తరహాలో వర ప్రసాద్ ను గెలిపించాలి.

అభివృద్ధికి నాది బాధ్యత. కానీ, గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి.

శ్రీ కాళ హస్తి ప్రజలు ఇచ్చే మెజార్టీ ఎలా ఉండాలంటే.. జగన్ రెడ్డిని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేలా ఉండాలి.

సభకు మించిన సభలు.. జనాభాకు మించిన జనాభా వస్తున్నారు. ఈ సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాను.


Comments