కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ మూడో రోజు శనివారం మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి.

 


మచిలీపట్నం, ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి);


కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ మూడో రోజు శనివారం మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి.


మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి అంబళ్ళ రాజ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్,


గన్నవరం అసెంబ్లీ స్థానానికి బళ్ళాని హరీష్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్, సింహాద్రి రాఘవేంద్రరావు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్, వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్, వల్లభనేని పంకజశ్రీ,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్,


గుడివాడ అసెంబ్లీ స్థానానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గుడివాడ బోసు బాబు ఒక సెట్ నామినేషన్,


పెడన అసెంబ్లీ స్థానానికి సమ్మెట వెంకన్నబాబు స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు, 


మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి అరిఫ్ పాషా షేక్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు, లక్ష్మీ కిరణ్ కూనప రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్,


పామర్రు అసెంబ్లీ స్థానానికి సాలె దినేష్ బాబు జాతీయ జనసేన పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్,


పెనమలూరు అసెంబ్లీ స్థానానికి చుక్క ఏడుకొండలు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.


అవనిగడ్డ నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదు.

Comments