25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లు ఆమోదం.

 *25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లు ఆమోదం*


*పీసీలకు చెందిన 183 నామినేషన్లు, ఏసీలకు చెందిన 939 నామినేషన్లు తిరస్కణ*


*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*


అమరావతి ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి): ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో  25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.  పీసీలకు చెందిన 183 నామినేషన్లు మరియు  ఏసీలకు చెందిన 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించడం జరిగిందన్నారు.  ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తము 686 నామినేషన్లు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు ఆయన తెలిపారు.


పీసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో గుంటూరు పీసీకి 47 నామినేషన్లు, అత్యల్పంగా 16 నామినేషన్లు శ్రీకాకుళం పీసీ కి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పిసికి, అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి పిసికి ఆమోదించబడ్డాయన్నారు. 


అదేవిధంగా ఏసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో తిరుపతి ఏసీ కి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8  నామినేషన్లు చోడవరం ఏసీ కి దాఖలు అయ్యాయని తెలిపారు.  నామినేషన్ల ఆమోదం విషయంలో  అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి ఏసీ కి, అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం ఏసీ కి ఆమోదించబడ్డాయన్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని  ఆయన తెలిపారు.Comments